ఆక్రాలోని ఎన్క్రుమా సంస్మరణ వాటికలో నివాళులర్పించిన ప్రధానమంత్రి

July 03rd, 03:50 pm

ఘనా దేశం ఆక్రా నగరంలోని ఎన్క్రుమా సంస్కరణ వాటికను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... దివంగత నేత, ఆఫ్రికా స్వాతంత్ర్య వీరుడు, దేశాన్ని ఉనికిలోకి తెచ్చిన తొలి దేశాధ్యక్షుడు డాక్టర్ క్వామే ఎన్క్రుమాకు ఘన నివాళులు అర్పించారు. ఘనా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ నానా జేన్ ఓపుకు-ఆగ్యేమాంగ్ ప్రధాని వెంట ఉన్నారు. స్వాతంత్ర్యం, ఐక్యత, సామాజిక న్యాయం వంటి ఆశయాల సాధనకు డాక్టర్ ఎన్క్రుమా చేసిన కృషిని, ఆయా రంగాలపై చెక్కుచెదరని ఆయన ప్రభావానికి గౌరవ సూచకంగా శ్రీ మోదీ పుష్ప గుచ్ఛాన్ని ఉంచి మౌనం పాటించారు.

ఘనా పార్లమెంటునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 03rd, 03:45 pm

ప్రజాస్వామ్య స్ఫూర్తి, గౌరవం, దృఢత్వంతో తొణికిసలాడే ఘనా దేశాన్ని సందర్శించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధిగా, నా వెంట 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలను తీసుకువచ్చాను.

ఘనా పార్లమెంటులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 03rd, 03:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఘనా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. పార్లమెంట్ స్పీకర్ గౌరవనీయ అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ నిర్వహించిన ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఇరు దేశాల నుంచి విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ ప్రసంగం భారత్-ఘనా సంబంధాల్లో ఒక ముఖ్యమైన సందర్భంగా నిలిచింది. ఇది రెండు దేశాలను ఏకం చేసే పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించింది.

ఘనాలో ప్రధానమంత్రి అధికారిక పర్యటన: కుదిరిన ఒప్పందాలు ‌

July 03rd, 04:01 am

సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (సీఈపీ)పై ఎంఓయూ: కళ, సంగీతం, నృత్యం, సాహిత్యం, వారసత్వం వంటి రంగాల్లో సాంస్కృతిక అవగాహనను ఇచ్చి పుచ్చుకోవడం, ప్రస్తుత స్థాయి కంటే వీటిని మరింత ముందుకు తీసుకుపోవడం.

ఘనా జాతీయ పురస్కారాన్ని అందుకున్న వేళ ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

July 03rd, 02:15 am

అధ్యక్షుల వారు ఘనా జాతీయ పురస్కారం ‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’తో నన్ను గౌరవించడం నాకు అత్యంత గర్వకారణం కావడంతో పాటు గౌరవం కూడా.

ఘనా జాతీయ పురస్కారాన్ని అందుకున్న ప్రధానమంత్రి

July 03rd, 02:12 am

ఘనా జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ రోజు ప్రదానం చేశారు. ఆయన విశిష్ట రాజనీతిజ్ఞత‌కూ, ప్రపంచ స్థాయి నాయకత్వానికీ గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఘనా అధ్యక్షుడు డాక్టర్ జాన్ డ్రమానీ మహామా అందజేశారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయుల పక్షాన ప్రధానమంత్రి స్వీకరించారు. భారతదేశ యువత ఆకాంక్షలకూ, భారత్ సాంస్కృతిక సంప్రదాయాలతో పాటు భిన్నత్వానికీ, అలాగే ఘనాకూ, భారత్‌కూ మధ్య గల చరిత్రాత్మక సంబంధాలకూ ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.

ఘనా అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం

July 03rd, 01:15 am

ఘనా అధ్యక్షుడు డాక్టర్ జాన్ డ్రమానీ మహామాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. జూబ్లీ హౌస్‌కు చేరుకున్న ప్రధానికి అధ్యక్షుడు మహామా స్వాగతం పలికారు. గడచిన మూడు దశాబ్దాల్లో ఘనాలో అధికారికంగా ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి.

ఘనా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన... ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం

July 03rd, 12:32 am

మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాను సందర్శించారు.

అధికారిక పర్యటన నిమిత్తం ఘనా చేరుకున్న ప్రధానమంత్రి

July 02nd, 09:20 pm

అధికారిక పర్యటన నిమిత్తం ఘనాలోని ఆక్రాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఇది రెండు దేశాల మధ్య కొనసాగుతున్న బలమైన, చారిత్రక స్నేహబంధాన్ని ప్రతిబింబిస్తుంది.

ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం

July 02nd, 07:34 am

జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వాతో చర్చిస్తాను.

ఘనా, ట్రినిడాడ్ - టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి (జూలై 02 - 09)

June 27th, 10:03 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనాలో ఇదే ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడం.. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అభివృద్ధిలో సహకారాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడం, ఈసీవోడబ్ల్యూఏఎస్ (ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్), ఆఫ్రికన్ యూనియన్‌లతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

ఆఫ్రికన్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించిన ప్రధాని మోదీ

March 10th, 04:59 pm

ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్రికన్ దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపి, వారితో సహకార సంబంధాలు బలోపేతం చేసుకునే మార్గాలను చర్చించారు. ప్రధానమంత్రి, ఘనా, కోట్ డి ఐవోరే, ఈక్వెటోరియల్ గినియా, నైజర్, చాడ్ మరియు నౌరుల నాయకులను కలిశారు.

India-Africa Summit: PM meets African leaders

October 28th, 11:24 am