భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
February 18th, 08:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ)పై ‘ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సహా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేగాక 17న ముంబైలో ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ వార్షికోత్సవం-2026’ను వారిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. మాక్రాన్ ప్రస్తుతం నాలుగోసారి భారత్ పర్యటనకు రాగా, ప్రధానమంత్రి మోదీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లివచ్చారు.అరబ్ విదేశాంగ మంత్రుల ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 31st, 02:39 pm
భారత్‌లో జరుగుతున్న రెండో ఇండియా-అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు, లీగ్ ఆఫ్ అరబ్ దేశాల సెక్రటరీ జనరల్, అరబ్ ప్రతినిధి బృందాల నాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.జర్మన్ ఛాన్సలర్‌తో సంయుక్త మీడియా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 12:49 pm
ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంలో ఛాన్సలర్ మెర్జ్‌ను స్వాగతించడం నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్-జర్మనీ మధ్య తత్వం, జ్ఞానం, ఆధ్యాత్మికతల వారధిని స్వామి వివేకానంద స్వయంగా నిర్మించడం ఒక సంతోషకరమైన యాదృచ్చిక అంశం. ఈ రోజున ఛాన్సలర్ మెర్జ్ సందర్శన ఆ వారధికి కొత్త శక్తిని, కొత్త విశ్వాసాన్ని, పరిధినీ ఇస్తోంది.భారత ప్రధానికి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
January 07th, 03:03 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గౌరవ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ లో సంభాషించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ
October 17th, 04:22 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈజిప్టు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ బదర్ అబ్దుల్లాటీ ఈ రోజు సమావేశమయ్యారు.బందీల విడుదలను స్వాగతించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 13th, 07:59 pm
రెండు సంవత్సరాలకు పైగా బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. బందీల కుటుంబాల ధైర్యానికీ, శాంతి కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.గాజా శాంతి ప్రణాళిక విజయవంతం పట్ల అధ్యక్షుడు ట్రంప్‌ను అభినందించిన ప్రధానమంత్రి
October 09th, 09:31 pm
చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ఆయనకు అభినందనలు తెలిపారు.యూకే ప్రధానితో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
October 09th, 11:25 am
భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని కీర్ స్టార్మర్‌కు ముంబయిలో ఈ రోజు స్వాగతం చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను.గాజాలో శాంతి స్థాపన దిశగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి
October 04th, 07:58 am
గాజాలో శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. బందీల విడుదలకు వస్తున్న సంకేతాలు.. మానవతావాద, దౌత్యపరమైన ప్రయత్నాల్లో కీలక ముందడుగని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.గాజా సంఘర్షణకు స్వస్తి పలికే దిశగా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ చేపట్టిన శాంతి సాధన యత్నాలను స్వాగతించిన ప్రధానమంత్రి
September 30th, 09:19 am
గాజా సంఘర్షణను సమాప్తం చేయడానికి అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జే ట్రంప్ నడుం కట్టి ఒక సమగ్ర ప్రణాళికను ప్రకటించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.Rio de Janeiro Declaration- Strengthening Global South Cooperation for a More Inclusive and Sustainable Governance
July 07th, 06:00 am
The leaders of BRICS countries, met in Rio de Janeiro, Brazil for the 17th BRICS Summit. The leaders reaffirmed their commitment to the BRICS spirit of mutual respect and understanding, sovereign equality, solidarity, democracy, openness, inclusiveness, collaboration and consensus. They strongly condemned terrorism and welcomed the inclusion of new countries as BRICS partner countries.శాంతి, భద్రతలపై బ్రిక్స్ కార్యక్రమం.. ప్రధానమంత్రి ప్రకటన పాఠం
July 06th, 11:07 pm
ప్రపంచంలో శాంతి, భద్రతలు కేవలం ఆదర్శాలు కావు, అంతకంటే అవి మన ఉమ్మడి ప్రయోజనాలతో పాటు మన అందరి భవిష్యత్తుకు బలమైన పునాదులు. మానవ జాతి పురోగతి శాంతియుత, సురక్షభరిత వాతావరణంలో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో బ్రిక్స్‌ది చాలా ముఖ్య పాత్ర. మనమంతా కలిసికట్టుగా, మన సవాళ్లను సమష్టిగా పరిష్కరించుకోవాల్సిన తరుణమిది. మనం తప్పక ఐకమత్యంతో ముందడుగు వేయాలి.వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 ప్రారంభ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం
August 17th, 10:00 am
140 కోట్ల మంది భారతీయుల తరఫున, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గత రెండు శిఖరాగ్ర సమావేశాల్లో, మీలో చాలా మందితో సన్నిహితంగా కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఈ సంవత్సరం భారత సార్వత్రిక ఎన్నికల తరువాత, ఈ వేదికపై మీ అందరితో సంభాషించే అవకాశం నాకు మరోసారి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.పాలస్తీనా అధ్యక్షుని తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 19th, 08:14 pm
పాలస్తీనా అధ్యక్షుడు మాన్య శ్రీ మహమూద్ అబ్బాస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.గాజా లో అల్ అహ్లీ ఆసుపత్రి లో పెద్ద సంఖ్య లో పౌరులు మరణించినందుకు దు:ఖాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
October 18th, 01:48 pm
గాజా లో అల్ అహ్ లీ ఆసుపత్రి లో పౌరులు పెద్ద సంఖ్య లో చనిపోయిన ఘటన జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.