గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి మృతికి సంతాపం ప్రకటించిన ప్రధానమంత్రి

March 10th, 07:56 pm

ప్రముఖ సంగీతజ్ఞులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తమ సంతాపం వ్యక్తం చేశారు. తమ అద్వితీయ గానం ద్వారా అనేకుల హృదయాలను స్పృశించిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, ఘనమైన భారతీయ సంగీత, ఆధ్యాత్మిక వారసత్వాలని కొనసాగించారన్నారు .