“పరీక్షా పే చర్చా 2026” కార్యక్రమంలో విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ
February 06th, 10:21 am
నా పేరు సాన్వి ఆచార్య, నేను గుజరాత్ నుంచి వచ్చాను. నా మొదటి ప్రశ్న: తల్లిదండ్రులు మా గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులు మాకు మద్దతు ఇస్తారు. కానీ చదివేందుకు ఉపాధ్యాయులు ఒక విధానాన్ని సూచించినప్పుడు, తల్లిదండ్రులు దానికి భిన్నమైన విధానాన్ని అనుసరించాలని పట్టుబడుతుంటారు. విద్యార్థులుగా మాలో మరో ధోరణి ఉంటుంది దీనితోనే అసలు సమస్య మొదలవుతుంది. ఆ సమయంలో ఏ నమూనా సరైనదో తెలియక మేం అయోమయంలో పడతాంపరీక్షా పే చర్చ – 2026లో విద్యార్ధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
February 06th, 10:00 am
పరీక్షా పే చర్చ (పీపీసీ) 9వ సంచికలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు.ముంబయి ‘వేవ్స్ సమ్మిట్’లో ప్రధానమంత్రి ప్రసంగం
May 01st, 03:35 pm
వేవ్స్ సమ్మిట్ వేదికపై ఆసీనులైన మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫఢన్‌వీస్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ ఎల్.మురుగన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన సృజనాత్మక లోక ప్రముఖులు, వివిధ దేశాల సమాచార-ప్రసార, కమ్యూనికేషన్, కళ-సాంస్కృతిక శాఖల మంత్రులు, రాయబారులు, సృజనాత్మక లోక ప్రసిద్ధులు, ఇతర ప్రముఖులు, మహిళలు, గౌరవనీయ అతిథులారా!వేవ్స్ 2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ
May 01st, 11:15 am
మొట్టమొదటి ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ - వేవ్స్ 2025ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులు, రాయబారులు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులను స్వాగతిస్తూ.. వేవ్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. 100కు పైగా దేశాకు చెందిన కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కలసి అంతర్జాతీయ స్థాయి ప్రతిభ, సృజనాత్మక వ్యవస్థకు పునాది వేశారని పేర్కొన్నారు. ‘‘వేవ్స్ కేవలం సంక్షిప్త పదం కాదు.. సంస్కృతిని, సృజనాత్మకతను, అంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం’’ అని వర్ణించారు. అలాగే ఈ సదస్సు సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథలు చెప్పడానికి సంబంధించిన విస్తృతమైన ప్రపంచాన్ని ప్రదర్శిస్తుందని ప్రధాని అన్నారు. అదే సమయంలో కళాకారులు, రూపకర్తలకు భాగస్వామ్యాలు పెంచుకొనేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు.రోజ్ గార్ మేళా కింద 51,000 పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 26th, 11:23 am
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 51,000 మందికి పైగా యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను ఈరోజు జారీ చేశాం. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో మీ యువతకు బాధ్యతల కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం మీ కర్తవ్యం. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మీ కర్తవ్యం. కార్మికుల జీవితాల్లో మెరుగైన మార్పులు తేవడం మీ కర్తవ్యం. మీరు మీ విధులను ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ ప్రయాణంపై దాని ప్రభావం మరింత గణనీయంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారని నేను విశ్వసిస్తున్నాను.ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 26th, 11:00 am
ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన వారికి 51,000కి పైగా నియామక పత్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించారు. భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో యువతకు కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్గత భద్రతను పెంపొందించటం, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడటం, కార్మికుల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు తీసుకురావడం వీరి బాధ్యతలని పేర్కొన్నారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో చూపించే చిత్తశుద్ధి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రధానంగా పేర్కొన్నారు. విధుల నిర్వహించే విషయంలో ఈ యువత అత్యంత అంకితభావంతో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.Hackathon solutions are proving to be very useful for the people of the country: PM Modi
December 11th, 05:00 pm
PM Modi interacted with young innovators at the Grand Finale of Smart India Hackathon 2024 today, via video conferencing. He said that many solutions from the last seven hackathons were proving to be very useful for the people of the country.స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొన్నవారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
December 11th, 04:30 pm
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగంలో ‘సబ్‌కా ప్రయాస్’ (అందరి ప్రయత్నం) అవసరమని పునరుద్ఘాటించిన సంగతిని గుర్తు చేశారు. నేటి కాలపు భారతదేశం ‘అందరి ప్రయత్నం’తో చాలా వేగంగా పురోగమించగలుగుతుందని, ఈ రోజున నిర్వహించుకొంటున్న ఈ కార్యక్రమమే దీనికొక ఉదాహరణ అని ఆయన అన్నారు. ‘‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే కోసం నేను చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను’’ అని ప్రధాని అన్నారు. యువ నూతన ఆవిష్కర్తలతో భేటీ అయినప్పుడు ఏదైనా కొత్త విషయం నేర్చుకొనే అవకాశంతోపాటు అర్థం చేసుకొనే అవకాశం కూడా తనకు లభిస్తుందని ఆయన అన్నారు. నూతన ఆవిష్కర్తల నుంచి తాను ఎంతో ఆశిస్తున్నానని ప్రధాని చెబుతూ, 21వ శతాబ్ది భారతదేశమంటే వారికి ఒక భిన్న దృష్టికోణం ఉందన్నారు. ఈ కారణంగా మీరు అందించే పరిష్కారాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయి; ఏదైనా కొత్త సవాలు వచ్చిందంటే మీరు నూతన, విశిష్ట పరిష్కారాలతో ముందుకు వస్తారని శ్రీ మోదీ అన్నారు. గతంలో జరిగిన హ్యాకథాన్‌లలో తాను భాగం పంచుకొన్న విషయాన్ని ప్రధాని గుర్తుకుతెస్తూ, వాటిలో అందే ఫలితాల విషయంలో తాను ఎన్నడూ నిరుత్సాహానికి గురికాలేదన్నారు. ‘‘మీరు నా నమ్మకాన్ని బలపరచారంతే’’ అని ఆయన అన్నారు. గతంలో అందించిన పరిష్కారాలు వివిధ మంత్రిత్వ శాఖల్లో అమలవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న వారిని గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని శ్రీ మోదీ అంటూ, వారితో మాట్లాడడం మొదలుపెట్టారు.'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ
September 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.భారీ మార్పు దిశగా- మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం
September 18th, 04:24 pm
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్ సీఓఈ) ఆవిర్భవిస్తోంది. కంపెనీల చట్టం 2013 ప్రకారం సెక్షన్ 8 కంపెనీగా దీనిని రూపొందిస్తున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఇండియన్ చాంబర్స్ అఫ్ కామర్స్ సమాఖ్య, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముంబయిలో ఎన్ సిఓఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఏవీజీసీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి 2022-23 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఇది ప్రారంభం అవుతోంది.భారతదేశపు అగ్రశ్రేణి ఆటగాళ్ళు ‘కూల్’ ప్రధాని మోదీని కలిశారు
April 13th, 12:33 pm
పిసి మరియు విఆర్ గేమింగ్ ప్రపంచంలో లీనమై, భారతదేశంలోని అగ్రశ్రేణి గేమర్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైన పరస్పర చర్యలో నిమగ్నమయ్యారు. సెషన్‌లో, ప్రధాని మోదీ గేమింగ్ సెషన్‌లలో చురుకుగా పాల్గొన్నారు, వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమ పట్ల తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు.