India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia
July 07th, 05:15 pm
At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 07th, 03:15 pm
ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 07th, 03:00 pm
ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7-సదస్సులో “అందరి కోసం సమతుల్యమైన,
June 18th, 05:00 am
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో “అందరి కోసం సమతుల్యమైన, ఉమ్మడిదైన, సుస్థిరమైన ఆర్థికవృద్ధిని పునరుద్ధరించడం” అనే అంశంపై ప్రధానమంత్రి ప్రసంగించారు.జి7 శిఖరాగ్ర సదస్సులో ‘అందరి కోసం సమతుల.. సమష్టి.. సుస్థిర ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ’పై సంధాన గోష్ఠి’లో ప్రధానమంత్రి ప్రసంగం
June 17th, 06:07 pm
అధ్యక్షులు మాక్రాన్ సహా గౌరవనీయ అతిథి సమూహానికి వందనం!భారత -ఇటలీ దేశాల ఉమ్మడి ప్రకటన
May 20th, 10:28 pm
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే 19-20 తేదీల్లో ఇటలీలో అధికారిక పర్యటన చేపట్టారు. 2024 జూన్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన, 2023లో జీ20 సదస్సు సందర్భంగా భారతదేశంలో ప్రధాని మెలోనీ పర్యటనల అనంతరం జరిగిన ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్-ఇటలీ సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.నెదర్లాండ్స్ పీఎం రాబ్ జెట్టెన్‌తో ప్రతినిధుల స్థాయి సమావేశం సందర్భంగా పీఎం ప్రసంగం
May 16th, 11:58 pm
నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత నెదర్లాండ్స్‌ను సందర్శించటం నాకెంతో సంతోషంగా ఉంది. గత పదేళ్లలో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యం గణనీయంగా పురోగతిని సాధించింది.న్యూఢిల్లీలో నారీశక్తి వందన్ సమ్మేళన్ సందర్భంగా ప్రధాని ప్రసంగం
April 13th, 11:15 am
వేదికనలంకరించిన ఢిల్లీ ప్రజల మన్ననలు పొందిన ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా గారూ, కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవిగారూ, శ్రీమతి సావిత్రీ ఠాకూర్ గారూ, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి విజయా రహత్కర్ గారూ... అలాగే మీలో చాలా మంది సీనియర్లు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు ఉన్నారు. మన లోక్‌సభ మాజీ స్పీకర్ గౌరవనీయులు మీరాకుమార్ గారూ మన మధ్యనే ఉన్నారు. ఆత్మీయులైన అక్కాచెల్లెళ్లంతా ఇక్కడున్నారు. ఈ వేళ బైశాఖీ పండుగ శోభతో దేశమంతా ఆనందంతో ఉంది. రేపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకొంటారు. అలాగే జలియన్‌వాలా బాగ్ మారణకాండలో అమరులైన యోధులకూ ఈ రోజు నేను నివాళి అర్పిస్తున్నాను.‘నారీశక్తి వందన్ సమ్మేళన్’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 13th, 11:00 am
విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన నారీశక్తి వందన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. బైశాఖీ శుభసందర్భంగా, దేశంలోని చాలాచోట్ల నూతన సంవత్సర వేడుకలను చేసుకోనున్న తరుణంలో ఆయన మాట్లాడారు. జలియన్‌వాలా బాగ్ మారణకాండ అమరులకు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. ‘‘నారీ శక్తిపై భారత్ కృతనిశ్చయంతో ఉంది. 21వ శతాబ్దంలో అత్యంత కీలక నిర్ణయాల్లో ఇదొకటి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.కామన్వెల్త్ దేశాల లోక్‌సభల స్పీకర్లు, అధ్యక్షుల 28వ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
January 15th, 11:00 am
లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, అంతర్-పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలు శ్రీమతి టూలియా అక్సన్, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ క్రిస్టోఫర్ కలిలా, కామన్వెల్త్ దేశాల స్పీకర్లు, అధ్యక్లులు, ఇతర ప్రతినిధులు, సోదరసోదరీలారా!రాజ్యాంగ సౌధం సెంట్రల్ హాల్‌లో కామన్వెల్త్ స్పీకర్లు.. ప్రిసైడింగ్ ఆఫీసర్ల 28వ సదస్సుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
January 15th, 10:32 am
న్యూఢిల్లీలోని ‘రాజ్యాంగ సౌధం’లోని సెంట్రల్ హాల్‌లో కామన్వెల్త్ స్పీకర్లు-ప్రిసైడింగ్ అధికారుల 28వ సదస్సును (సీఎస్‌పీఓసీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ పాత్ర ఎంతో విశిష్టమైనదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా చట్టసభల స్పీకర్లకు మాట్లాడే అవకాశం అంతగా ఉండదంటూ- ఇతరులు చెప్పేది వినడం, ప్రతి ఒక్కరి అభిప్రాయ వెల్లడికి అవకాశమివ్వడం వారి బాధ్యతని పేర్కొన్నారు. అత్యుత్సాహం చూపే, వివాదాస్పదంగా వ్యవహరించే సభ్యులను కూడా చిరునవ్వుతో నిభాయించే స్పీకర్లలో సహనం అత్యంత సార్వత్రిక లక్షణమని అభివర్ణించారు.వారణాసిలో 72 వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 04th, 01:00 pm
ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, యూపీ ప్రభుత్వ మంత్రులు - సోదరులు రవీంద్ర జైస్వాల్, దయాశంకర్, గిరీష్ యాదవ్, బనారస్ మేయర్ - సోదరుడు అశోక్ తివారీ, ఇతర ప్రజాప్రతినిధులు, వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, దేశం నలుమూలల నుంచి నుండి విచ్చేసిన క్రీడాకారులు, కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులకు నమస్కారం.వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన ప్రధాని
January 04th, 12:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడాకారులందరికీ స్వాగతం పలికి అభినందించడం పట్ల వారణాసి పార్లమెంటు సభ్యునిగా సంతోషంగా ఉందని తెలిపారు. నేటి నుంచి నగరంలో జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు ఎంతో కష్టపడి ఈ జాతీయ స్థాయి పోటీలకు వచ్చారని.. రాబోయే రోజుల్లో వారణాసి గడ్డపై వారి కృషికి పరీక్ష ఎదురుకానుందని ఆయన ఉద్ఘాటించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి జట్లు ఇక్కడకు చేరుకున్నాయని.. ఇది 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోందని అభివర్ణించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న వారందరికీ ప్రధాన మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.న్యూఢిల్లీలో డబ్ల్యూహెచ్‌వో రెండో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య సదస్సులో ప్రధాని ప్రసంగం
December 19th, 08:11 pm
డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్, మన తులసీ భాయ్ డాక్టర్ టెడ్రోస్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, నా మంత్రివర్గ సహచరుడు జె.పి. నడ్డా, ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్, ఈ కార్యక్రమంతో సంబంధమున్న ఇతర దేశాల మంత్రులు, వివిధ దేశాల రాయబారులు, గౌరవ ప్రతినిధులు, సాంప్రదాయ వైద్య రంగంలో కృషి చేస్తున్న గౌరవ నిపుణులు, సోదరీ సోదరులారా..!‘సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండో సదస్సు’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని
December 19th, 07:07 pm
ఈ రోజు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండో సదస్సు’ ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత మూడు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ వైద్య రంగ నిపుణులు లోతైన అర్థవంతమైన చర్చల్లో నిమగ్నమయ్యారని ప్రధాని అన్నారు. ఈ విషయంలో భారత్ ఒక బలమైన వేదికగా నిలుస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో డబ్ల్యూహెచ్ఓ చురుకైన పాత్ర పోషిస్తోందన్న ఆయన.. సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు డబ్ల్యూహెచ్ఓ, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ, హాజరైన ప్రతినిధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జపాన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ
November 23rd, 09:46 pm
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి శ్రీ సనే తకైచీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబరు 29న టెలిఫోన్ సంభాషణ అనతరం జపాన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం కావడం ఇదే తొలిసారి.Prime Minister meets Prime Minister of Italy on the sidelines of G20 Summit 2025
November 23rd, 09:44 pm
PM Modi met PM of Italy Giorgia Meloni on the sidelines of G20 Summit in Johannesburg, South Africa. PM Meloni expressed solidarity with India on the terror incident in Delhi. Both leaders adopted the ‘India-Italy Joint Initiative to Counter Financing of Terrorism’ and positively assessed the developments in the bilateral Strategic Partnership across wide range of sectors.జోహాన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
November 23rd, 09:41 pm
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా ప్రధానమంత్రి గౌరవనీయ శ్రీ మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ఇద్దరూ భారత్, కెనడా భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు.జీ-20 సదస్సు మూడో సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటనకు ఆంగ్లానువాదం
November 23rd, 04:05 pm
మనం ప్రోత్సహించే సాంకేతికత, 'ఆర్థిక కేంద్రకం' గా కాకుండా ' మానవ కేంద్రకం' గా ఉండాలి. దేశాలకే పరిమితమై పోకుండా ప్రపంచమంతా ఉపయోగించుకునేలా ఉండాలి. పరిమిత ప్రత్యేక వనరుల విధానాల స్థానంలో అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్-సోర్స్ విధానాలను ప్రోత్సహించాలి. భారత్ ఈ భావనతోనే తన సాంకేతిక ప్రాజెక్టులను రూపొందిస్తోంది.జీ 20 సమావేశంలో "అందరికీ సమానమైన, న్యాయమైన భవిష్యత్తు"పై ప్రసంగించిన ప్రధానమంత్రి
November 23rd, 04:02 pm
జీ20 శిఖరాగ్ర సదస్సు మూడో సమావేశంలో “అందరికీ సమానమైన, న్యాయమైన భవిష్యత్తు – క్లిష్టమైన ఖనిజాలు, మంచి పని, కృత్రిమ మేధస్సు” అనే అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. క్లిష్టమైన సాంకేతికతలను ప్రోత్సహించే విధానంలో మౌలికమైన మార్పు అవసరమని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అటువంటి సాంకేతిక అన్వయాలు ఆర్థిక ప్రాధాన్యాలుగా కాకుండా ప్రజా ప్రాధాన్యాలుగా, ఉండాలని, 'జాతీయ' కాకుండా ‘అంతర్జాతీయం’ గా ఉండాలని, 'ప్రత్యేక నమూనాలకు' బదులుగా ‘స్వేచ్చా వనరుల‘ ఆధారంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ దృక్పథం భారత సాంకేతిక వ్యవస్థలో భాగమైందని, ఇది అంతరిక్ష ప్రయోగాలు, కృత్రిమ మేధ, డిజిటల్ చెల్లింపులు మొదలైన ప్రతి రంగంలోనూ భారత్ ను ప్రపంచ నాయకత్వ స్థాయిలో నిలిపి గణనీయమైన ప్రయోజనాలు అందించిందని ఆయన వివరించారు.