2026-27 సీజన్‌ కోసం చెరకు రైతులకు క్వింటాల్‌కు రూ.365 'న్యాయమైన, లాభదాయకమైన ధర'కు మంత్రివర్గం ఆమోదం

May 05th, 06:43 pm

చెరకు రైతుల (గన్నా కిసాన్) ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, 2026-27 చక్కెర సీజన్‌ (అక్టోబర్ - సెప్టెంబర్) కోసం 10.25 శాతం ప్రాథమిక రికవరీ గల చెరకు పంటకు క్వింటాల్‌కు రూ. 365 'న్యాయమైన, లాభదాయకమైన ధర' (ఎఫ్ఆర్‌పీ)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 10.25 శాతం కంటే ఎక్కువ రికవరీలో వచ్చే ప్రతి 0.1 శాతం పెరుగుదలకు క్వింటాల్‌కు రూ. 3.56 చొప్పున అదనపు ప్రోత్సాహకాన్ని (ప్రీమియం) అందించాలని, రికవరీలో వచ్చే ప్రతి 0.1 శాతం తగ్గుదలకు ఎఫ్ఆర్‌పీని క్వింటాల్‌కు రూ. 3.56 చొప్పున తొలగించాలని నిర్ణయించారు.

చ‌క్కెర సీజ‌న్ 2024-25 (అక్టోబ‌ర్ - సెప్టెంబ‌ర్‌)కు చ‌క్కెర క‌ర్మాగారాలు చెల్లించ‌వ‌ల‌సిన చెరుకు న్యాయ‌మైన‌, లాభ‌దాయ‌క ధ‌ర (ఎఫ్ఆర్‌పి) ను ఆమోఇంచిన కేబినెట్‌

February 21st, 11:26 pm

చెర‌కు కాలం 2024-25కు చ‌క్కెర రిక‌వ‌రీ రేటు 10.25% వ‌ద్ద క్వింటాలు చెర‌కును న్యాయ‌మైన‌, లాభ‌దాయ‌క ధ‌ర ( ఫెయిర్ అండ్ రెమ్యున‌రేటివ్ ప్రైజ్ - ఎఫ్ ఆర్‌పి) రూ.340కి కొనుగోలు చేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఆర్థిక వ్య‌వ‌హారాల‌కేబినెట్ క‌మిటీ ఆమోదించింది. ఈ చారిత్రిక ధ‌ర ప్ర‌స్తుత 2023-24 కాలంలో చెర‌కు ఎఫ్ఆర్‌పి క‌న్నా దాదాపు 8% ఎక్కువ‌. స‌వ‌రించిన ఎఫ్ఆర్‌పి 01 అక్టోబ‌ర్ 2024 నుంచి అమ‌లులోకి వ‌స్తుంది.