న్యూఢిల్లీలో 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' ప్రోత్సాహకాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 19th, 05:15 pm
నా మంత్రివర్గ సహచరులు శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు, సోదరి శోభ గారు, దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, సాంకేతికతతో అనుసంధానమైన ప్రముఖులందరికీ, నిర్వాహకులకు, ప్రస్తుతం 200 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన సుమారు రెండు లక్షల మందికి... నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పారిశ్రామిక రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన యువ మిత్రుల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కింద సుమారు రూ. 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేసిన ప్రధానమంత్రి
June 19th, 05:00 pm
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, భాగస్వాములనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. భారత యువతకు సాధికారత కల్పించడానికి, దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎం-వీబీఆర్‌వై అమలులో భాగంగా... అన్ని రంగాలకు సామాజిక భద్రతా పరిధిని విస్తరించడంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ ప్రోత్సాహకం దేశవ్యాప్తంగా 15 లక్షల ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడింది.ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 11:41 pm
కాంతులు, రంగులతో కూడిన నగరం పారిస్. ఇది కళలకు, సరికొత్త ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరంతా ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరే దీనికి సరికొత్త, చైతన్యవంతమైన రంగులను అద్దుతున్నారు.ప్యారిస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
June 18th, 09:30 pm
ఫ్రాన్స్‌లోని వివిధ రంగాల్లో భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. భారతీయ ఆవిష్కరణలనూ, ఆలోచనలనూ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఇండియా-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ- వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులు ఫ్రాన్స్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవడంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలు విస్తరించాయని ఆయన తెలియజేశారు. ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఫ్రాన్స్‌లో యూపీఐ విస్తరణ గురించి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని వివరించారు.విశ్వసనీయ ఏఐ.. ఆవిష్కరణలు.. అంతర్జాతీయ సహకారంపై ‘మిస్ట్రల్ ఏఐ’ సీఈఓ ఆర్థర్ మెన్ష్‌తో ప్రధానమంత్రి సంభాషణ
June 18th, 06:44 pm
కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానం ప్రపంచమంతటా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘మిస్ట్రల్ ఏఐ’ సంస్ధ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) శ్రీ ఆర్థర్ మెన్ష్‌తో సమగ్రంగా చర్చించారు.ఆల్‌స్టామ్ సీఈఓ శ్రీ మార్టిన్ సియోన్‌తో ప్రధానమంత్రి సమావేశం... దేశ యువతతో అంతర్జాతీయ సహకార అవకాశాలపై చర్చ
June 18th, 06:42 pm
ఆల్‌స్టామ్ సీఈఓ శ్రీ మార్టిన్ సియోన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలప్రదమైన చర్చలు జరిపారు.భారత్‌లో సెయింట్-గోబైన్ కార్యకలాపాల విస్తరణపై సీఈవో బెనోయిట్ బాజిన్‌తో చర్చించిన ప్రధాని
June 18th, 06:39 pm
సెయింట్-గోబైన్ సీఈవో శ్రీ బెనోయిట్ బాజిన్‌తో చర్చలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.నౌకా వాణిజ్య అనుసంధానం, సహకారానికి గల అవకాశాలపై సీఎంఏ సీజీఎం చైర్మన్, సీఈవో రోడాల్ఫ్ సాడేతో చర్చించిన ప్రధానమంత్రి
June 18th, 06:37 pm
నౌకా వాణిజ్య అనుసంధానం, ప్రపంచ స్థాయిలో నౌకాయాన ధోరణులు, భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకా వాణిజ్య రంగంలో పెరుగుతున్న అవకాశాలపై సీఎంఏ సీజీఎం చైర్మన్, సీఈవో శ్రీ రోడాల్ఫ్ సాడేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు.పారిస్‌లో ‘వివాటెక్-2026’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 06:15 pm
ఇక ఇదే సంవత్సరంలో ‘ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ ప్రారంభం కావడంతో రెండు దేశాలతోపాటు ఐరోపా సాంకేతికావరణ వ్యవస్థలను చేరువ చేసే కీలక వారధిగా ఇది రూపొందింది. కొన్ని రోజుల కిందట నైస్ నగరంలో నిర్వహించిన ‘భారత్ ఇన్నొవేట్స్’ నుంచి ఇవాళ పారిస్ నగరంలో నిర్వహిస్తున్న ‘వివాటెక్’ దాకా మన అంకుర సంస్థలు అనేక కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటున్నాయి.వివాటెక్ 2026 సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
June 18th, 06:00 pm
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పారిస్‌లో జరిగిన ఐరోపాలోనే అతిపెద్ద సాంకేతిక, అంకురాల కార్యక్రమం అయిన 'వివాటెక్ 2026'లో పాల్గొన్నారు.ఎవియాన్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షునితో సమావేశమైన ప్రధానమంత్రి
June 18th, 05:04 am
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో 2026 జూన్ 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో “సురక్షితమైన కృత్రిమ మేధ
June 18th, 05:01 am
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో “కృత్రిమ మేధను సురక్షితంగా, వేగంగా, సమర్థంగా అమలు చేయడం” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7-సదస్సులో “అందరి కోసం సమతుల్యమైన,
June 18th, 05:00 am
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో “అందరి కోసం సమతుల్యమైన, ఉమ్మడిదైన, సుస్థిరమైన ఆర్థికవృద్ధిని పునరుద్ధరించడం” అనే అంశంపై ప్రధానమంత్రి ప్రసంగించారు.ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక విజయంగా ఇండియా- యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసించిన ప్రధాని
June 17th, 10:03 pm
2026 జులై 15 నుంచి ఇండియా-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుండటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.జీ7 శిఖరాగ్ర సమావేశ సదస్సు సందర్భంగా ప్రధాని ప్రసంగం: సురక్షితంగా, వేగంగా, సమర్థంగా ఏఐ వినియోగం
June 17th, 09:20 pm
ఈ ముఖ్యమైన అంశాన్ని మన చర్చల్లో భాగం చేసిన మిత్రుడు మెక్రాన్‌కు నా అభినందనలు. మానవుడు సృష్టించిన అత్యంత విప్లవాత్మక సాంకేతికతల్లో కృత్రిమ మేధ ఒకటి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.జీ7 సదస్సు సందర్భంగా ఐరోపా కౌన్సిల్, ఐరోపా కమిషన్ అధ్యక్షులతో సమావేశమైన ప్రధాని
June 17th, 06:43 pm
ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లెయెన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.జి7 శిఖరాగ్ర సదస్సులో ‘అందరి కోసం సమతుల.. సమష్టి.. సుస్థిర ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ’పై సంధాన గోష్ఠి’లో ప్రధానమంత్రి ప్రసంగం
June 17th, 06:07 pm
అధ్యక్షులు మాక్రాన్ సహా గౌరవనీయ అతిథి సమూహానికి వందనం!జి7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జర్మనీ చాన్సలర్‌తో ప్రధానమంత్రి సమావేశం
June 17th, 05:34 pm
ఈ సందర్భంగా భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్య పునరుజ్జీవనంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో చాన్సలర్ భారత పర్యటనకు రాగా, భారత-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించారు. ఈ ఏడాదిలోనే భారత్-జర్మనీ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం నిర్వహించనుండగా, వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, కాలుష్య రహిత సుస్థిర అభివృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, రవాణా తదితర రంగాల్లో సహకార బలోపేతంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. రక్షణ పారిశ్రామిక సహకారంపై వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళికపై సంతకాలు పూర్తి కావడంపై వారు హర్షం ప్రకటించారు. జర్మనీ మీదుగా ప్రయాణించే భారత పౌరులకు ట్రాన్సిట్ వీసా మినహాయింపు విధానానికి శ్రీకారం చుట్టడాన్ని స్వాగతించారు.‘జీ7 శిఖరాగ్ర సమావేశం - విస్తృత భాగస్వామ్య సదస్సు: కొత్త భాగస్వామ్యాల నిర్మాణం, అంతర్జాతీయ సంఘీభావ పునరుద్ధరణ’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
June 16th, 10:12 pm
జీ-7 శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు మాక్రాన్ ఆత్మీయ స్వాగతానికి, ఆయన అందించిన ఆతిథ్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు.ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో "నూతన భాగస్వామ్యాల ఏర్పాటు
June 16th, 10:07 pm
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ7 సదస్సులో నూతన భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ ఐక్యతను పునర్నిర్మించటం అంశంపై ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.