రోజ్‌గార్ మేళా సందర్భంగా వీడియో మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
October 24th, 11:20 am
ఈ ఏడాది వెలుగుజిలుగుల దీపావళి పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త దివ్వెలు వెలిగించింది. ఈ ఉత్సాహపూరిత ఉత్సవ వాతావరణం నడుమ మీరంతా శాశ్వత ఉద్యోగ నియామక పత్రం పొందడమంటే, వేడుకల ఆనందంతోపాటు విజయం రెట్టింపైనంత సంతోషం కలుగుతుంది. ఇనుమడించిన ఈ ఆనందం నేడు దేశవ్యాప్తంగా 51 వేల మందికిపైగా యువతరం సొంతమైంది. మరోవైపు మీ కుటుంబాలన్నిటా కూడా ఆనందోత్సాహాలు ఎంతగా వెల్లువెత్తుతుంటాయో నేను ఊహించగలను. ఈ సందర్భంగా మీతోపాటు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ జీవితాల్లో ఈ సరికొత్త ప్రారంభానికిగాను నా శుభాకాంక్షలు.రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 24th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రోజ్ గార్ మేళాను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దీపాల పండగ దీపావళి ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని ప్రధానమంత్రి అన్నారు. పండగ సంబరాల సందర్భంగా శాశ్వత ఉద్యోగ నియామక పత్రాలను అందుకోవటం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు. ఒకవైపు పండగ సంతోషం, మరోవైపు ఉపాధి విజయం రెండూ లభించాయి. దేశవ్యాప్తంగా ఇవాళ 51,000 వేల మందికి పైగా యువత సంతోషంగా ఉండటం వల్ల వారి కుటుంబాలు ఆనందంతో వెలిగిపోతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలను అందుకున్న వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వారి జీవితాల్లో నూతన ప్రారంభానికి శుభాకాంక్షలు చెప్పారు.జర్మనీ విదేశాంగ మంత్రితో భారత ప్రధాని భేటీ
September 03rd, 08:40 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్‌తో భేటీ అయ్యారు. ‘‘భారత్, జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా, చైతన్యవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా.. వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరత, తయారీ, రవాణా సహా ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు విస్తృత అవకాశాలు స్పష్టంగా మన కళ్లముందున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.ముఖచిత్రం: భారత్ - జపాన్ ఆర్థిక భద్రతా సహకారం
August 29th, 08:12 pm
ఉమ్మడి విలువలు, పరస్పర గౌరవంపై ఆధారపడిన భారత్ - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం రెండు దేశాల భద్రత, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో అత్యంత కీలకంగా ఉంది. మన వ్యూహాత్మక దృక్పథం, ఆర్థిక అవసరాలలో పెరుగుతున్న సమానత్వం ఆధారంగా ఉన్న మన ద్వైపాక్షిక సహకారానికి ఆర్థిక భద్రతాపరంగా సహకారం ఎంతో కీలకం.ప్రధానమంత్రిని కలిసిన 2024 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్రైనీలు
August 19th, 08:34 pm
2024 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్ ట్రైనీలు ఈ రోజు ఉదయం 7- లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాసంలో ఆయనను కలిశారు. ఈ బ్యాచ్‌లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 33 మంది అధికారులు ఉన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ
August 19th, 07:34 pm
కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. టియాంజిన్లో జరుగుతున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పంపిన ఆహ్వానాన్ని వాంగ్ యీ ప్రధానమంత్రికి అందజేశారు. అలాగే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంపైనా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి తాను సహాధ్యక్షుడుగా వ్యవహరించిన ప్రత్యేక ప్రతినిధుల 24వ సమావేశంపైనా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.టీవీ9 సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 08:00 pm
గౌరవనీయ రామేశ్వర్ గారు, రాము గారు, బరుణ్ దాస్ గారు, మొత్తం టీవీ9 బృందానికి.. మీ నెట్‌వర్క్ వీక్షకులందరికీ, ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయ అతిథులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న మీకు అభినందనలు.టీవీ9 సదస్సు-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 28th, 06:53 pm
భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన టీవీ9 సదస్సు-2025లోప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత టీవీ9 బృందానికి, వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చానెల్‌కు ప్రాంతీయ వీక్షకులు విస్తృత సంఖ్యలో ఉండగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు కూడా వారిలో భాగం కానున్నారని పేర్కొన్నారు. దూరవాణి మాధ్యమం (టెలికాన్ఫరెన్స్) ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్న భారత ప్రవాసులకు సాదర స్వాగతం పలకడంతోపాటు అభినందనలు తెలిపారు.పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం
March 16th, 11:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 16th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.భారత్- ఖతార్ సంయుక్త ప్రకటన
February 18th, 08:17 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆహ్వానంపై, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్- ధానీ 2025 ఫిబ్రవరి 17-18 తేదీలలో భారత్ లో అధికారిక పర్యటనకు విచ్చేశారు. అమీర్ వెంట మంత్రులు, అధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంది. అమీర్ భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి.We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives: PM
January 09th, 10:15 am
PM Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas convention in Bhubaneswar, Odisha. Expressing his heartfelt gratitude to the Indian diaspora and thanking them for giving him the opportunity to hold his head high with pride on the global stage, Shri Modi highlighted that over the past decade, he had met numerous world leaders, all of whom have praised the Indian diaspora for their social values and contributions to their respective societies.ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
January 09th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ప్రవాసీ భారతీయులకు శ్రీ మోదీ స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రారంభ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ కార్యక్రమాల్లో పాడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రవాసీ భారతీయుల భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గ్రామీ పురస్కార విజేత కళాకారుడు శ్రీ రికీ కేజ్‌నూ, ఆయన సహ కళాకారులనూ ప్రధాని ప్రశంసించారు.2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో స్పెయిన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా భారత్-స్పెయిన్ సంయుక్త ప్రకటన
October 28th, 06:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో శాంచెజ్ 2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో భారత్ లో అధికారికంగా పర్యటించారు. అధ్యక్షుడు శాంచెజ్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 18 ఏళ్ల తర్వాత స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట రవాణా, సుస్థిర రవాణా శాఖ మంత్రి, పరిశ్రమలు, పర్యాటక శాఖ మంత్రులతో పాటు ఉన్నత స్థాయి అధికార, వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.భారత్, మాల్దీవులు: సమగ్ర ఆర్థిక, నౌకా వాణిజ్య భద్రతా భాగస్వామ్యమే లక్ష్యం
October 07th, 02:39 pm
1. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మాల్దీవుల అధ్యక్షుడు డా. మహ్మద్ ముయిజ్జు ఈరోజు (అక్టోబర్ 7, 2024) సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, రెండు దేశాల ప్రజల మధ్య చారిత్రక సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సాధించిన ప్రగతిని సమగ్రంగా సమీక్షించారు.మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గౌరవనీయ మొహమ్మద్ ముయిజ్జుతో సంయుక్త పత్రికా ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 07th, 12:25 pm
భారత్-మాల్దీవ్స్ సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ముఖ్యంగా ఈ రెండూ అత్యంత సన్నిహిత, ఇరుగుపొరుగు మిత్ర దేశాలు. అలాగే మేము అనుసరిస్తున్న పొరుగుకు ప్రాధాన్యం విధానంతో పాటు మా దార్శనిక సాగర్ కార్యక్రమంలో మాల్దీవ్స్‌కు కీలక స్థానముంది. మాల్దీవ్స్ విషయంలో ఎల్లప్పుడూ మొట్టమొదట స్పందించి, తనవంతు బాధ్యత నిర్వర్తించేది భారతదేశమే. నిత్యావసరాల కొరత తీర్చడంలోనైనా, ప్రకృతి విపత్తుల సమయంలో తాగునీటి సరఫరాలోనైనా, కోవిడ్ సంక్షోభం వేళ టీకాలు అందించడంలోనైనా పొరుగు దేశం విషయంలో భారత్ సదా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంది. ఇక ఇవాళ పరస్పర సహకారానికి వ్యూహాత్మక దిశను నిర్దేశించడం కోసం ‘‘సమగ్ర ఆర్థిక-సముద్ర భద్రత భాగస్వామ్యం’’ విధానాన్ని ఆమోదించాం.ప్రధానిని కలిసిన శిక్షణ పొందుతున్న 2023 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారులు
August 29th, 06:35 pm
శిక్షణలో ఉన్న భారత విదేశాంగ శాఖ 2023 బ్యాచ్ అధికారులు ప్రధానిని ఆయన నివాసం 7, లోక్ మాన్యమార్గ్ లో కలుసుకున్నారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది ఐఎఫ్ఎస్ అధికారులు శిక్షణలో ఉన్నారు.పోలెండ్ , ఉక్రెయిన్ సందర్శనకు ముందు ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన
August 21st, 09:07 am
మన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో పోలెండును నేను సందర్శించబోతున్నాను. మధ్య ఐరోపాకు చెందిన పోలెండ్ ఒక ప్రముఖ ఆర్థిక భాగస్వామ్య దేశంగా ఉంది.నట్వర్ సింగ్ మృతిపపై ప్రధాని మోదీ సంతాపం
August 11th, 08:17 am
దౌత్య లోకానికి అందించిన సేవలతోపాటు విదేశీ విధానాల విషయంలో ఆయన విశేష కృషి చిరస్మరణీయమని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ఒక మేధావిగానే కాకుండా అనేక రచనలు చేసిన రచయితగానూ సదా గుర్తుండి పోతారని పేర్కొన్నారు.ఎస్‌సిఒ శిఖరాగ్ర సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 04th, 01:29 pm
ఈ మాటలను శిఖరాగ్ర సమావేశానికి హాజరైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్ చదివి వినిపించారు.