ఎఫ్‌ఏఓ అగ్రికోలా పతకం అందుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 20th, 11:00 pm

ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. భారత్‌లోని కోట్లాది మంది రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, శ్రామికులకు దక్కిన గౌరవం. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారత్‌కున్న అచంచలమైన నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇది. ఎంతో గౌరవంగా ఈ పతకాన్ని స్వీకరిస్తూ.. భారతదేశ అన్నదాతలకు అంకితమిస్తున్నా.

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నుంచి అగ్రికోలా పతకాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి

May 20th, 10:55 pm

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి 2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక అగ్రికోలా పతకాన్ని ప్రదానం చేశారు. భారత్‌తో పాటు ప్రపంచస్థాయిలోనూ ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాల పరిష్కారానికి ఆయన ప్రదర్శించిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు.

కీలక కార్యక్రమాల నిమిత్తం ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ

May 20th, 12:30 am

ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితమే ఇటలీలోని రోమ్‌కు చేరుకున్నారు. ఆయన ఇటలీ గణతంత్ర అధ్యక్షులు శ్రీ సెర్గియో మట్టరెల్లాను మర్యాదపూర్వకంగా కలుస్తారు; అలాగే ప్రధానమంత్రి మెలోనితో చర్చలు జరుపుతారు. ఈ చర్చలు ప్రధానంగా ‘భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్’ (IMEC) పై కేంద్రీకృతమై ఉంటాయి.

నార్వే - భారత్ వ్యాపార, పరిశోధన సదస్సులో ప్రధాని ప్రసంగం

May 18th, 11:49 pm

నార్వే, భారత్ వ్యాపార, పరిశోధన వర్గాల మధ్య ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరి మాటలు వినే అవకాశం లభించింది. మన భాగస్వామ్యానికి పునాది చాలా బలంగా ఉందన్న నమ్మకం వారి మాటలు విన్న తర్వాత నాకు కలిగింది.

భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

May 18th, 08:50 pm

ఓస్లోలో జరిగిన భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గౌరవ రాజు హాకాన్‌, నార్వే ప్రధానమంత్రి గౌరవ జోనాస్ గార్‌ స్టోర్‌ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.

నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన

May 18th, 04:44 pm

గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక [2026-2030]

May 17th, 03:15 am

2026 మే 16న హేగ్ నగరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్దిష్ట లక్ష్యాలు, కాలపరిమితితో కూడిన కార్యక్రమాలు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికల ద్వారా భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ లక్ష్య సాధన కోసం రాబోయే 5 సంవత్సరాల కాలానికి (2026-2030) ‘భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక’ను ఇరు దేశాలు ఆమోదించాయి.

నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్‌ ఎటెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక చర్చలు

May 17th, 02:35 am

ఈ సమావేశంలో భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు, విశ్వాసంతోపాటు సమన్వయం, సహకారం ఇనుమడించడాన్ని ప్రతిబింబిస్తూ, ఈ స్నేహబంధాన్ని “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, అత్యాధునిక-కీలక సాంకేతికతలు, సముద్ర రంగం, పునరుత్పాదక ఇంధనం, విద్యా రంగాల్లో సహకార విస్తృతి దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యంపై భవిష్యత్‌ ప్రణాళిక ఆమోదానికి నిశ్చయించారు. ఉభయ పక్షాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత-ఆవిష్కరణల భాగస్వామ్య విస్తరణ సహా భారత వృద్ధి ప్రస్థానం డచ్ కంపెనీలకు ఆశావహ వ్యాపార అవకాశాలను కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

Prime Minister’s visit to the United Arab Emirates

May 15th, 03:59 pm

During PM Modi's official visit to the United Arab Emirates, he held discussions with UAE President HH Sheikh Mohammed bin Zayed Al Nahyan. The PM reaffirmed India’s strong condemnation of the attacks on the UAE and also conveyed India’s position in favour of ensuring safe transit passage through the Strait of Hormuz. The two leaders reviewed the entire gamut of bilateral relations and welcomed the deepening of the Comprehensive Strategic Partnership across multiple sectors.

సుస్థిరాభివృద్ధిలో సహకారానికి భారత్- రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్త ప్రకటన

April 20th, 10:55 pm

వాతావరణ మార్పులు, సముద్ర, ఆర్కిటిక్ అంశాల్లో ఆచరణాత్మక సహకారం ద్వారా ప్రపంచ సుస్థిరాభివృద్ధి సవాళ్ల పరిష్కారానికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్- రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్తంగా ప్రకటించారు.

ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్ డాక్టర్ క్రిస్టియన్ స్టాకర్ భారత పర్యటన: కుదిరిన ఒప్పందాలు

April 16th, 03:01 pm

ఇరు దేశాల చలనచిత్ర పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించేలా వ్యవస్థాగత ఏర్పాటుతోపాటు.. ఉమ్మడి చలనచిత్ర నిర్మాణం, సృజనాత్మకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి, విస్తృత సాంస్కృతిక భాగస్వామ్యం దిశగా ఈ ఒప్పందంతో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

పశ్చిమ ఆసియా కల్లోలం నేపథ్యంలో తాజా పరిస్థితులు.. ఉపశమన చర్యలపై ప్రధానమంత్రి అధ్యక్షతన భద్రతపై మంత్రిమండలి కమిటీ (సీసీఎస్‌) సమావేశం

March 22nd, 09:06 pm

పశ్చిమ ఆసియాలో కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షతోపాటు ప్రస్తుత, ప్రతిపాదిత ఉపశమన చర్యలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి భద్రత కమిటీ (సీసీఎస్) లోతుగా చర్చించింది.

భారత్‌-కెనడా సంయుక్త ప్రకటన

March 02nd, 05:05 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు కెనడా ప్రధానమంత్రి మాననీయ మార్క్‌ కార్నీ ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల 2వ తేదీ వరకూ భారతదేశంలో పర్యటించారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక కార్నీ తొలిసారి భారత్‌లో పర్యటించగా, 2018 తర్వాత కెనడా ప్రధానమంత్రి ఒకరు ద్వైపాక్షిక పర్యటన కోసం మన దేశానికి రావడం ఇదే మొదటిసారి. కెనడా ప్రభుత్వంలోని సీనియర్‌ మంత్రులు, రాష్ట్రాల అధినేతలు, అగ్రగామి పరిశ్రమల ‘సీఈవో’లతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఆయన వెంట వచ్చింది.

కెనడా ప్రధానమంత్రి భారత్‌ పర్యటన.. కీలక నిర్ణయాలు

March 02nd, 05:04 pm

కెనడా ప్రధానమంత్రి భారత్‌ పర్యటన.. కీలక నిర్ణయాలు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఫలితాలు

February 26th, 07:41 pm

భూభౌతిక అన్వేషణ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

సేవా సంకల్ప ప్రతిపాదన

February 24th, 04:53 pm

గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ‘సేవా తీర్థ్’లోని ప్రధానమంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి వర్గ మొదటి సమావేశం జరుగుతుంది.

ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా ఒప్పందాలు, ప్రకటనలు

February 08th, 11:05 am

భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య ఆడియో - విజువల్ సహనిర్మాణ ఒప్పందం

మలేషియా ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని ప్రకటన

February 08th, 08:35 am

ముందుగా నాకు ఆత్మీయంగా స్వాగతం పలికిన నా ఆప్తమిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతేడాది ఆసియాన్ సదస్సు సందర్భంగా మలేషియాను సందర్శించలేకపోయాను. కానీ వీలైనంత తొందరలోనే మలేషియాకు వస్తానని నా ప్రియమిత్రుడికి అప్పట్లో మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం.. 2026లో నా తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియాలో ఉన్నాను.

మలేషియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా విడుదల చేసిన భారత్, మలేషియా ఉమ్మడి ప్రకటన

February 08th, 08:30 am

మలేషియా ప్రధానమంత్రి శ్రీ దాతో సెరీ అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు మలేషియాలో అధికారిక పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత సంబంధాలపై ఆధారపడిన ఉన్న లోతైన స్నేహం, సుదీర్ఘ ప్రజల మధ్య బంధాలను తెలియజేసింది. భారత్-మలేషియా 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్ఠం చేయటం, విస్తరించడానికి ఇరు దేశాల నాయకులకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది.

మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో ప్రతినిధి స్థాయి చర్చల సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 08th, 08:20 am

నా మిత్రులు... గౌరవనీయ ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకూ, నా ప్రతినిధి బృందానికి లభించిన స్వాగతం... కేవలం కొన్ని గంటల్లోనే సంప్రదాయాలను మించిన మలేషియా ప్రజల జీవన విధానాన్ని మాకు పరిచయం చేసిన విధానం... ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. దీనికి నేను మనస్ఫూర్తిగా నా ప్రశంసలు తెలియజేస్తున్నాను. స్నేహానికి నిజమైన అర్థాన్నీ, అలాగే దానిలోని గొప్పతనాన్నీ నేను నిజంగా అనుభూతి చెందాను. దాని కోసం మీకు నా కృతజ్ఞతలు.