భారత్-జోర్డాన్ బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 16th, 12:24 pm
కాలుష్య రహిత వృద్ధి లేనిదే నేటి ప్రపంచం ముందడుగు వేయడం సాధ్యం కాదు. అందువల్ల కాలుష్య రహిత ఇంధనం ఇక ఎంతమాత్రం ఐచ్ఛికం కాదు... అదొక అవసరంగా మారిపోయింది. ఆ మేరకు భారత్ ఇప్పటికే సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ సహా ఇంధన నిల్వలో పెట్టుబడిదారుగా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో జోర్డాన్‌కు అపార సామర్థ్యం ఉంది కాబట్టి, దాన్ని రెండు దేశాలూ సంయుక్తంగా మరింత సద్వినియోగం చేసుకోవచ్చు.ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి, కింగ్ అబ్దుల్లా II
December 16th, 12:23 pm
అమ్మాన్లో ఈ రోజు నిర్వహించిన ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జోర్డాన్ యువరాజు హుస్సేన్, ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి, పెట్టుబడుల మంత్రి కూడా హాజరయ్యారు. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవాల్సిన ప్రాధాన్యాన్ని రాజు, ప్రధాని ఇద్దరూ గుర్తించారు. సామర్థ్యాన్ని, అవకాశాలను వృద్ధిగా, సంక్షేమంగా మార్చాలని రెండు దేశాల పారిశ్రామిక వేత్తలను కోరారు. దక్షిణాసియా, పశ్చిమాసియా పరిధి దాటి విస్తరించిన ఆర్థిక కారిడార్‌ను తయారుచేయడానికి జోర్డాన్ స్వేచ్ఛాయుత వ్యాపార ఒప్పందాలను, భారత ఆర్థిక శక్తిని ఏకం చేయాలని జోర్డాన్ రాజు తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
November 27th, 11:01 am
కేబినెట్లో నా సహచరుడు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ గారు, ఇన్-స్పేస్ చైర్మన్ శ్రీ పవన్ గోయెంకా గారు, స్కైరూట్ బృందం, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా...!Prime Minister Shri Narendra Modi inaugurates Skyroot’s Infinity Campus in Hyderabad via video conferencing
November 27th, 11:00 am
PM Modi inaugurated Skyroot’s Infinity Campus in Hyderabad, extending his best wishes to the founders Pawan Kumar Chandana and Naga Bharath Daka. Lauding the Gen-Z generation, he remarked that they have taken full advantage of the space sector opened by the government. The PM highlighted that over the past decade, a new wave of startups has emerged across perse sectors and called upon everyone to make the 21st century the century of India.ప్రధానమంత్రి భూటాన్ అధికారిక పర్యటనపై సంయుక్త పత్రికా ప్రకటన
November 12th, 10:00 am
పర్యటనలో భాగంగా నవంబర్ 11న చాంగ్లిమిథాంగ్‌లో భూటాన్ నాలుగో రాజు 70వ జన్మదిన వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. అలాగే థింపులో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి ప్రార్థన ఉత్సవంలో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలు పూజలర్పించడానికి భారత్ నుంచి బుద్ధ భగవానుని పవిత్ర పిప్రాహ్వా అవశేషాలను ఈ ఉత్సవంలో ఉంచడాన్ని భూటాన్ రాజు అభినందించారు.రోజ్‌గార్ మేళా సందర్భంగా వీడియో మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
October 24th, 11:20 am
ఈ ఏడాది వెలుగుజిలుగుల దీపావళి పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త దివ్వెలు వెలిగించింది. ఈ ఉత్సాహపూరిత ఉత్సవ వాతావరణం నడుమ మీరంతా శాశ్వత ఉద్యోగ నియామక పత్రం పొందడమంటే, వేడుకల ఆనందంతోపాటు విజయం రెట్టింపైనంత సంతోషం కలుగుతుంది. ఇనుమడించిన ఈ ఆనందం నేడు దేశవ్యాప్తంగా 51 వేల మందికిపైగా యువతరం సొంతమైంది. మరోవైపు మీ కుటుంబాలన్నిటా కూడా ఆనందోత్సాహాలు ఎంతగా వెల్లువెత్తుతుంటాయో నేను ఊహించగలను. ఈ సందర్భంగా మీతోపాటు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ జీవితాల్లో ఈ సరికొత్త ప్రారంభానికిగాను నా శుభాకాంక్షలు.రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 24th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రోజ్ గార్ మేళాను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దీపాల పండగ దీపావళి ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని ప్రధానమంత్రి అన్నారు. పండగ సంబరాల సందర్భంగా శాశ్వత ఉద్యోగ నియామక పత్రాలను అందుకోవటం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు. ఒకవైపు పండగ సంతోషం, మరోవైపు ఉపాధి విజయం రెండూ లభించాయి. దేశవ్యాప్తంగా ఇవాళ 51,000 వేల మందికి పైగా యువత సంతోషంగా ఉండటం వల్ల వారి కుటుంబాలు ఆనందంతో వెలిగిపోతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలను అందుకున్న వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వారి జీవితాల్లో నూతన ప్రారంభానికి శుభాకాంక్షలు చెప్పారు.న్యూఢిల్లీలో ఎన్డీటీవీ ‘ప్రపంచ సదస్సు-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 11:09 pm
శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య గారికి, ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి, నా స్నేహితుడు టోనీ అబాట్ గారికి, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ గారికి, గౌరవ అతిథులకు, సోదరీ సోదరులకూ నా నమస్కారం!న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025 లో ప్రధాని ప్రసంగం
October 17th, 08:00 pm
న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ వాతావరణంలో ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు జరుగుతోందని శ్రీ మోదీ అన్నారు. ఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘అన్‌స్టాపబుల్ ఇండియా’’ను ప్రశంసిస్తూ.. ప్రస్తుత భారత్‌కు తన వేగాన్ని ఆపే ఉద్దేశం లేనందున ఈ అంశం సందర్భోచితంగా ఉందన్నారు. ‘‘భారత్ ఆగదు.. లేదా విరామం తీసుకోదు. 140 కోట్ల మంది భారతీయులంతా కలసికట్టుగా, వేగంగా ముందుకు సాగుతున్నారు’’ అని తెలియజేశారు.అనువాదం: భారత్-బ్రిటన్ సీఈఓ ఫోరం సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 09th, 04:41 pm
ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార రంగ నాయకులుగా మీరు చేస్తోన్న నిరంతర కృషి వల్ల ఈ ఫోరం.. భారత్-బ్రిటన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముఖ్యమైన వేదికగా మారింది. ఈ రోజు మీ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత.. మనం సహజ భాగస్వాములుగా మరింత వేగంతో ముందుకు సాగగలమనే నా నమ్మకం మరింత పెరిగింది. ఈ విషయంలో మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.భారత్-యూకే సంయుక్త ప్రకటన
October 09th, 03:24 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని స్వీకరించిన యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ 2025 అక్టోబర్ 8,9 తేదీల్లో భారత్‌లో అధికార పర్యటన చేశారు. ఆయన వెంట ఆ దేశ వ్యాపార, వాణిజ్య మంత్రి, వాణిజ్య బోర్డు అధ్యక్షుడు పీటర్ కైల్, స్కాట్లాండ్ మంత్రి డోగ్లస్ అలెగ్జాండర్, పెట్టుబడుల మంత్రి జేసన్ స్టాక్‌వుడ్‌తో పాటు 125 మంది సీఈవోలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సాంస్కృతిక నాయకులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది.ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవం ఆరో ఎడిషన్‌లో ప్రధాని ప్రసంగం
October 09th, 02:51 pm
గౌరవ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్, ఆవిష్కర్తలు, నాయకులు, ఫిన్‌టెక్ రంగ పెట్టుబడిదారులు, సోదరీ సోదరులారా! మీ అందరికీ ముంబయికి హృదయపూర్వక స్వాగతం!ముంబయిలో నిర్వహించిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 09th, 02:50 pm
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’ (అంతర్జాతీయ సాంకేతికార్థిక సదస్సు)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ తొలుత ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ముంబయిని ఇంధన, వాణిజ్య నగరంగా, అపార అవకాశాల కూడలిగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రధానమంత్రి, తన మిత్రుడైన గౌరవనీయ కీర్ స్టార్మర్ను ప్రత్యేకంగా స్వాగతిస్తూ- ఈ కార్యక్రమానికి సమయం కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు.అక్టోబరు 8,9 తేదీల్లో మహారాష్ట్రలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన
October 07th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8వ, 9వ తేదీల్లో మహారాష్ట్రలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి మధ్యాహ్నం సుమారు 3 గంటలకు నవీ ముంబయికి చేరుకొంటారు. కొత్తగా కట్టిన నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన పరిశీలిస్తారు. ఆ తరువాత, సుమారు మూడున్నర గంటల వేళకు, ప్రధానమంత్రి నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు ముంబయిలో వివిధ పథకాలను కూడా ప్రారంభించి, జాతికి అంకితమిస్తారు. ఈ సందర్భంగా జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 25th, 10:22 am
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు భూపేంద్ర చౌదరి గారు, పరిశ్రమకు చెందిన మిత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా,గ్రేటర్ నోయిడాలో... ఉత్తర ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శననుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 25th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ‘ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ప్రదర్శనకు హాజరైన వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రధాని హార్ధిక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉందని, కాలపరీక్షకు నిలిచి ఈ భాగస్వామ్యం బలోపేతమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ సహచరులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. చిట్టచివరి వ్యక్తులకూ అభివృద్ధిని అందించాలన్న అంత్యోదయ మార్గంలో దేశాన్ని నడిపించిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజే... ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. అంత్యోదయ అంటే అత్యంత నిరుపేదలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడమని, అన్ని రకాల వివక్షలూ తొలగిపోవడమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మిళిత అభివృద్ధి భావననే భారత్ నేడు ప్రపంచానికి అందిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.మాల్దీవ్స్ అధ్యక్షుడితో సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
July 25th, 06:00 pm
ఇది భారత్-మాల్దీవ్స్ దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవ ఏడాది కూడా కావడం విశేషం. వాస్తవానికి ఈ బంధానికిగల మూలాలు చరిత్రకన్నా ప్రాచీనమైనవేగాక, సముద్రమంతటి లోతైనవి కూడా. అనాదిగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ రోజు స్మారక స్టాంపును ఆవిష్కరించాం. దీనిపై కనిపించే రెండు దేశాల సంప్రదాయ పడవల చిత్రం చూస్తే- చరిత్రలో మనం ఇరుగుపొరుగు మాత్రమే కాదని, సహ ప్రయాణికులమని స్పష్టమవుతుంది.పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని ప్రసంగం
July 21st, 10:30 am
రుతుపవనాలు కొత్తదనానికి, సృష్టికి ప్రతీక. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా వాతావరణం అనుకూలంగా ఉంది. ఇది వ్యవసాయానికి లాభదాయకమైన సీజన్ అని వార్తలొస్తున్నాయి. మన రైతుల ఆర్థిక స్థితిగతుల్లోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో, ఇంకా ప్రతి ఇంటి ఆర్థిక స్థితిగతుల్లోనూ వర్షం కీలక పాత్ర పోషిస్తుంది. నాకు అందిన సమాచారం ప్రకారం.. గత పదేళ్లలో నమోదైన నీటి నిల్వ కన్నా ఈ ఏడాది దాదాపు మూడు రెట్లు అధికంగా ఉంది. మున్ముందు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదెంతో ప్రయోజనం చేకూరుస్తుంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ
July 21st, 09:54 am
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలలో, ఆయన భయంకరమైన పహల్గామ్ మారణహోమాన్ని ప్రస్తావించారు మరియు పాకిస్తాన్ పాత్రను బహిర్గతం చేయడంలో భారతదేశ రాజకీయ నాయకత్వం యొక్క ఐక్య స్వరాన్ని ప్రశంసించారు. డిజిటల్ ఇండియా, ముఖ్యంగా యుపిఐ యొక్క ప్రపంచ గుర్తింపును కూడా ప్రధాని గుర్తించారు. నక్సలిజం మరియు మావోయిజం క్షీణిస్తున్నాయని ఆయన ధృవీకరించారు మరియు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని కూడా ప్రశంసించారు.Rio de Janeiro Declaration- Strengthening Global South Cooperation for a More Inclusive and Sustainable Governance
July 07th, 06:00 am
The leaders of BRICS countries, met in Rio de Janeiro, Brazil for the 17th BRICS Summit. The leaders reaffirmed their commitment to the BRICS spirit of mutual respect and understanding, sovereign equality, solidarity, democracy, openness, inclusiveness, collaboration and consensus. They strongly condemned terrorism and welcomed the inclusion of new countries as BRICS partner countries.