ఫిన్లాండ్ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో భారత్-ఫిన్లాండ్ సంయుక్త ప్రకటన
March 05th, 08:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 4వ తేదీన ఢిల్లీ చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ అలెగ్జాండర్ స్టూబ్ 7వ తేదీవరకూ భారత్‌లో పర్యటిస్తారు. ప్రస్తుత హోదాలో తొలిసారి మన దేశానికి వచ్చిన ఆయన ప్రధానంగా న్యూఢిల్లీ, ముంబయి నగరాలను సందర్శిస్తారు. ఆయనతోపాటు ఫిన్లాండ్ వాతావరణ-పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి సారీ ముల్తాలా, ఉపాధి శాఖ మంత్రి శ్రీ మాటియస్ మార్టినెన్ సహా ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో 5వ తేదీన న్యూఢిల్లీలో 11వ దఫా రైసినా చర్చలను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు స్టూబ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రధానోపన్యాసం చేశారు. భారత్ గత నెల ఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పో పాల్గొన్న నేపథ్యంలో అధ్యక్షుడు స్టూబ్ ఇప్పుడు పర్యటిస్తున్నారు.చిన్నారులు, కుటుంబ కథా విభాగంలో బాఫ్టా పురస్కారాన్ని గెలుచుకున్న ‘బూంగ్’ చిత్ర బృందానికి ప్రధాని అభినందన.
February 23rd, 05:10 pm
ఈ బాఫ్టా చలనచిత్ర పురస్కారాల్లో.. చిన్నారులు, కుటుంబ కథా విభాగంలో విజేతగా ‘బూంగ్’ చిత్రాన్ని బ్రిటిష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) అకాడమీ ప్రకటించింది.సీనియర్ నటుడు శ్రీ గోవర్ధన్ అస్రానీ మృతికి ప్రధాని సంతాపం
October 21st, 09:16 am
సీనియర్ నటుడు శ్రీ గోవర్ధన్ అస్రానీ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశిష్ట సేవలను, వివిధ తరాల ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించే ఆయన సామర్థ్యాన్ని గుర్తు చేసుకుంటూ.. తన సంతాప సందేశంలో నటుడికి నివాళులు అర్పించారు.ప్రముఖ సినీనటి బి. సరోజాదేవి మృతి పట్ల ప్రధాని సంతాపం
July 14th, 03:40 pm
ప్రముఖ సినీతార బి. సరోజా దేవి మరణంపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.ముంబయి ‘వేవ్స్ సమ్మిట్’లో ప్రధానమంత్రి ప్రసంగం
May 01st, 03:35 pm
వేవ్స్ సమ్మిట్ వేదికపై ఆసీనులైన మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫఢన్‌వీస్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ ఎల్.మురుగన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన సృజనాత్మక లోక ప్రముఖులు, వివిధ దేశాల సమాచార-ప్రసార, కమ్యూనికేషన్, కళ-సాంస్కృతిక శాఖల మంత్రులు, రాయబారులు, సృజనాత్మక లోక ప్రసిద్ధులు, ఇతర ప్రముఖులు, మహిళలు, గౌరవనీయ అతిథులారా!వేవ్స్ 2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ
May 01st, 11:15 am
మొట్టమొదటి ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ - వేవ్స్ 2025ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులు, రాయబారులు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులను స్వాగతిస్తూ.. వేవ్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. 100కు పైగా దేశాకు చెందిన కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కలసి అంతర్జాతీయ స్థాయి ప్రతిభ, సృజనాత్మక వ్యవస్థకు పునాది వేశారని పేర్కొన్నారు. ‘‘వేవ్స్ కేవలం సంక్షిప్త పదం కాదు.. సంస్కృతిని, సృజనాత్మకతను, అంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం’’ అని వర్ణించారు. అలాగే ఈ సదస్సు సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథలు చెప్పడానికి సంబంధించిన విస్తృతమైన ప్రపంచాన్ని ప్రదర్శిస్తుందని ప్రధాని అన్నారు. అదే సమయంలో కళాకారులు, రూపకర్తలకు భాగస్వామ్యాలు పెంచుకొనేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు.రాజ్యాంగమే మనకు మార్గదర్శకం: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 29th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క ఈ ఎపిసోడ్‌లో, రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవం మరియు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ సన్నాహాలతో సహా భారతదేశం సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రతిబింబించారు. బస్తర్ ఒలింపిక్స్ విజయాన్ని ఆయన ప్రశంసించారు మరియు ఆయుష్మాన్ భారత్ పథకం కింద మలేరియా నిర్మూలన మరియు క్యాన్సర్ చికిత్సలో పురోగతి వంటి ముఖ్యమైన ఆరోగ్య పురోగతులను హైలైట్ చేశారు. అదనంగా, ఒడిశాలోని కలహండిలో వ్యవసాయ పరివర్తనను ఆయన ప్రశంసించారు.