ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్-2025లో కాంస్య పతకం సాధించిన అర్జున్ ఇరిగేశిని అభినందించిన ప్రధానమంత్రి
December 29th, 03:38 pm
దోహాలో జరిగిన ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఓపెన్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన అర్జున్ ఇరిగేశిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అతని పట్టుదల ప్రశంసనీయం. అతని భవిష్యత్ ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నానని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్-2025లో కాంస్య పతకం సాధించిన కోనేరు హంపిని అభినందించిన ప్రధానమంత్రి
December 29th, 03:35 pm
దోహాలో జరిగిన ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్-2025లో మహిళల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన కోనేరు హంపిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఆటపై ఆమెకున్న అంకితభావం ప్రశంసనీయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.