ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న అర్జున్ ఎరిగైసికి ప్రధాని అభినందన

December 31st, 09:04 am

దోహాలో నిర్వహించిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఫిడే రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలిచిన కొన్ని రోజులకే ఆయన ఈ విజయాన్ని సాధించారు. ప్రపంచ చదరంగంలో భారత్‌కు గర్వకారణంగా నిలిచే మరో అపురూపమైన ఘట్టమిది.