PM chairs CCS Meeting to review the situation in context of ongoing West Asia Conflict
July 30th, 07:38 pm
Prime Minister Shri Narendra Modi today chaired a meeting of the Cabinet Committee on Security (CSS) to review the situation in the context of ongoing West Asia conflict and measures taken by various Ministries and Departments. This was the 4th special CCS meeting on the issue.‘స్వయంసమృద్ధ భారత్ దిశగా యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం-2026’కు మంత్రిమండలి ఆమోదం
July 15th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా ఎరువుల శాఖ ప్రతిపాదించిన ‘స్వయంసమృద్ధ భారత్ దిశగా యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం-2026’ (ఎన్‌ఐపీయూ)కు ఆమోదం తెలిపింది.India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia
July 07th, 05:15 pm
At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.రాజస్థాన్‌లోని బలోత్రాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా పీఎం ప్రసంగం
July 04th, 12:50 pm
ఈ నేల ఎంతోమంది వీరుల పరాక్రమాన్ని చూసింది. ఈ యుద్ధభూమిలోని ప్రతి అణువూ ఆత్మగౌరవానికే అగ్రతాంబూలం ఇవ్వాలని నేర్పింది. ఒక వ్యక్తిదైనా, దేశానిదైనా ఆత్మ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే... అది స్వావలంబన సాధించినప్పుడు, ఇతరులపై వీలైనంత తక్కువగా ఆధారపడినప్పుడు మాత్రమే. ఇవాళ రాజస్థాన్ సాక్షిగా భారత్ అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారే దిశగా కీలక అడుగు వేసింది. ఇవాళ ఈ రిఫైనరీని దేశానికి అంకితం చేశాం. ఈ రిఫైనరీ ఇక్కడి వేలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. దీని ప్రారంభం సందర్భంగా నేను ప్రత్యేకంగా రాజస్థాన్ యువతకు అభినందనలు తెలియజేస్తున్నా.రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 04th, 12:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిరంతర సహకార స్ఫూర్తిని కొనియాడారు. మండే వేసవిలో మలమలమాడ్చే ఎండలో ఇంద పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన అఖండ ఆమోదానికి ఈ భారీ జనసందోహమే నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. “మా ప్రభుత్వ కృషిపై మీ తిరుగులేని విశ్వాసాన్ని చాటే ఈ అపార ఆదరాభిమానాలకుగాను ఈ రాజస్థాన్ గడ్డకు నేనెంతో రుణపడి ఉంటాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు కోసం జపాన్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
July 02nd, 10:39 pm
సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఏఐతో కూడిన సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత, స్వచ్ఛ సాంకేతికత, ఔషధాలు వంటి కీలక రంగాల్లో ఉమ్మడి దృఢత్వాన్ని పెంపొందించడం కోసం ప్రాజెక్ట్ ఆధారిత సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ కీలక రంగంలో పెరుగుతున్న భారత్-జపాన్ జీటూజీ (ప్రభుత్వాల మధ్య), బీటూబీ (వ్యాపారాల మధ్య) భాగస్వామ్యాన్ని 'ఇండియా-జపాన్ ఫ్యాక్ట్ షీట్ 2.0' స్పష్టంగా తెలియజేస్తుంది.జపాన్ ప్రధానమంత్రితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 02nd, 01:30 pm
ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ అన్ని రంగాల్లోనూ భారత్ వృద్ధి పయనంలో గత అనేక దశాబ్దాలుగా జపాన్ కీలక ఓ భాగస్వామి. పరస్పర విశ్వాసం, స్నేహబంధానికి ఇదొక అమూల్య పెన్నిధి.ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7-సదస్సులో “అందరి కోసం సమతుల్యమైన,
June 18th, 05:00 am
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో “అందరి కోసం సమతుల్యమైన, ఉమ్మడిదైన, సుస్థిరమైన ఆర్థికవృద్ధిని పునరుద్ధరించడం” అనే అంశంపై ప్రధానమంత్రి ప్రసంగించారు.జి7 శిఖరాగ్ర సదస్సులో ‘అందరి కోసం సమతుల.. సమష్టి.. సుస్థిర ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ’పై సంధాన గోష్ఠి’లో ప్రధానమంత్రి ప్రసంగం
June 17th, 06:07 pm
అధ్యక్షులు మాక్రాన్ సహా గౌరవనీయ అతిథి సమూహానికి వందనం!రైతుల సంక్షేమం, వ్యవసాయంలో ఆధునిక సదుపాయాలు, వ్యవసాయ రంగానికి సాధికారత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి
June 11th, 04:19 pm
దేశ ఆహార భద్రత, పోషణ, సమృద్ధికి మన రైతు సోదరీ, సోదరులు మూల స్తంభాలని, వారి జీవితాల్ని సులభతరంగా మార్చడానికి ప్రభుత్వం సర్వశక్తులతో ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టంచేశారు. ‘పీఎమ్-కిసాన్ సమ్మాన్ నిధి’, ‘ఫసల్ బీమా యోజన’ వంటి కార్యక్రమాలు రైతులకు ఆదాయ భద్రతను సమకూర్చడంతో పాటు, వ్యవసాయానికి సాధికారతను కూడా కల్పిస్తున్నాయని, ‘పీఎమ్-కుసుమ్ పథకం’ సౌర ఇంధనాన్ని సులభతరం చేస్తోందని, దీంతో వ్యవసాయానికి అయ్యే ఖర్చులు తగ్గుతున్నాయని ఆయన వివరించారు.నార్వే - భారత్ వ్యాపార, పరిశోధన సదస్సులో ప్రధాని ప్రసంగం
May 18th, 11:49 pm
నార్వే, భారత్ వ్యాపార, పరిశోధన వర్గాల మధ్య ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరి మాటలు వినే అవకాశం లభించింది. మన భాగస్వామ్యానికి పునాది చాలా బలంగా ఉందన్న నమ్మకం వారి మాటలు విన్న తర్వాత నాకు కలిగింది.భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
May 18th, 08:50 pm
ఓస్లోలో జరిగిన భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గౌరవ రాజు హాకాన్, నార్వే ప్రధానమంత్రి గౌరవ జోనాస్ గార్ స్టోర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.మార్కెటింగ్ సీజన్ 2026-27లో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు క్యాబినెట్ ఆమోదం
May 13th, 03:23 pm
మార్కెటింగ్ సీజన్ 2026-27లో 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను పెంచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహరాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.గుజరాత్‌లోని వడోదరాలో సర్దార్‌ధామ్ హాస్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా పీఎం ప్రసంగం
May 11th, 06:15 pm
ప్రజాదరణ పొందిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి, కేంద్రమంత్రి, వ్యవస్థాపక ట్రస్టీ మన్‌సుఖ్ మాండవీయ, సర్దార్‌ధామ్ అధ్యక్షుడు గగ్జీ భాయ్ సుతారియా, దుష్యంత్ భాయ్ పటేల్, పంకజ్ భాయ్ పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మ, వేదికపైనున్న గుజరాత్ మంత్రులు, దాతలు, ట్రస్టీలు, విశిష్ట అతిథులు, గుజరాత్ నలుమూలల నుంచి విచ్చేసిన నా ప్రియమైన సోదరీసోదరులందరికీ నమస్కారం.గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 11th, 06:00 pm
గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. వడోదరలోని సర్దార్ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవం, ఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారు. డాక్టర్ దుష్యంత్, దక్ష్ పటేల్ భవన సముదాయాన్ని, బోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారు. వివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. వీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమే, ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.ప్రపంచ సవాళ్ల నడుమ ప్రతి భారతీయునికి ప్రధాని మోదీ గట్టి విజ్ఞప్తి
May 10th, 08:39 pm
హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఇటీవలి సంఘర్షణలు, సరఫరా గొలుసు అంతరాయాల వల్ల తలెత్తిన ప్రపంచ ఆర్థిక సవాళ్ల గురించి మాట్లాడారు. భారతదేశ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి సామూహిక జాతీయ బాధ్యత అవసరమని ఆయన పిలుపునిచ్చారు. దిగుమతులపై ఒత్తిడిని తగ్గించి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించాలని, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పౌరులను కోరారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న కుటుంబ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ
May 10th, 06:05 pm
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు; ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న స్థాయి, బీజేపీ సాధించిన ఇటీవలి ఎన్నికల విజయాల ప్రాముఖ్యత, అలాగే ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక-రాజకీయ సవాళ్ల నేపథ్యంలో దేశం యొక్క సమిష్టి బాధ్యత గురించి మాట్లాడారు.హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ ర్యాలీ: స్వయం సమృద్ధి మరియు 'వికసిత తెలంగాణ'పై దృష్టి
May 10th, 06:00 pm
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు; ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న స్థాయి, బీజేపీ సాధించిన ఇటీవలి ఎన్నికల విజయాల ప్రాముఖ్యత, అలాగే ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక-రాజకీయ సవాళ్ల నేపథ్యంలో దేశం యొక్క సమిష్టి బాధ్యత గురించి మాట్లాడారు.బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
May 10th, 11:05 am
ఈ ఉదయం నాకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించింది. వేద మంత్రోచ్చారణతో చిన్నారులు పలికిన స్వాగతం, శ్రీ గణేశుని దర్శనం, శ్రీ శ్రీ రవి శంకర్ 70వ జన్మదినోత్సవం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం.. ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ అద్భుతమైన ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 10th, 11:00 am
కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికున్న పవిత్రత గురించి ప్రధాని తెలియజేశారు. వేద మంత్రాలతో చిన్నారులు స్వాగతం పలకడం, గణేశుని దర్శనం, శ్రీ శ్రీ రవి శంకర్ 70వ సంవత్సరం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాలతో ఈ ఉదయం ప్రత్యేకంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.