వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుపై భారత్, ఫిలిప్పీన్స్ ప్రకటన
August 05th, 05:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ 2025 ఆగస్టు 4 నుంచి భారత్ పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 8వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. అధ్యక్షుడు మార్కోస్ వెంట ప్రథమ మహిళ శ్రీమతి లూయిస్ అరనెటా మార్కోస్ తో పాటు ఫిలిప్పీన్స్ కు చెందిన పలువురు క్యాబినెట్ మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి అధికార, ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి వర్గాలు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నాయి.భారత్‌లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అధికారిక పర్యటన: ఒప్పందాలు/ఎంవోయూలు
August 05th, 04:31 pm
భారత్, ఫిలిప్పీన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఏర్పాటుపై ప్రకటనఫిలిప్పీన్స్ అధ్యక్షునితో సమావేశం సందర్భంగా ప్రధాని ప్రారంభోపన్యాసానికి తెలుగు అనువాదం
August 05th, 03:45 pm
మీకు, మీ ప్రతినిధివర్గానికి ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నా. ఈ రోజు మన రెండు దేశాల సంబంధాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోతుంది. మనం భారత్-ఫిలిప్పీన్స్ సంబంధాలను ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్తున్నాం. ఇది మన బంధానికి ఒక కొత్త జోరును, సమగ్రతను జోడిస్తుంది. గత కొన్నేళ్లుగా వాణిజ్యం, రక్షణ, నౌకావాణిజ్య సహకారం, ఆరోగ్య సంరక్షణ, భద్రత, తగినన్ని ఆహారపదార్థాల నిల్వలు కలిగి ఉండటం, అభివృద్ధి ప్రధాన అంశాల్లో భాగస్వామ్యం, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అన్ని రంగాల్లో మన సంబంధాలు ముందంజ వేశాయి. వచ్చే అయిదేళ్లకు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దానిని మనం అమలు చేయబోవడం నిజంగా చాలా సంతోషాన్నిచ్చే అంశం.భారత ప్రధానమంత్రి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంయుక్త ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం
August 05th, 11:06 am
భారతదేశానికి వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, ఆయన బృందానికి మొదట హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. ఈ ఏడాది భారత్, ఫిలిప్పీన్స్ 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకలను జరుపుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన దౌత్య సంబంధాలు ఈమధ్యే ప్రారంభమైనవైనప్పటికీ, మన నాగరికతల బంధం చాలా పురాతనమైనది. ఫిలిప్పీన్స్ రామాయణ రూపం అయిన మహారదియా లవానా మన సాంస్కృతిక సంబంధాల ప్రత్యేకతను తెలియజెబుతుంది. ఇరుదేశాల జాతీయ పుష్పాలతో విడుదల చేసిన తపాలా స్టాంపులు మన స్నేహ పరిమళాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఫిలీపీన్స్ అధ్యక్షుడుశ్రీ ఫర్డీనాండ్ మార్కోస్ జూనియర్ కు మరియు ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ కి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ
August 05th, 02:44 pm
ఫిలీపీన్స్ అధ్యక్షుడు శ్రీ ఫర్డీనాండ్ మార్కోస్ జూనియర్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.