ఫాస్ట్ ట్రాక్ స్పెశల్ కోర్టుల కై కేంద్రీయ ప్రాయోజిత పథకాన్ని తదుపరి మూడుసంవత్సరాల వరకు కొనసాగించడానికి ఆమోదాన్ని తెలియజేసిన మంత్రిమండలి

November 29th, 03:53 pm

కేంద్రీయ ప్రాయోజిత పథకం (సిఎస్ఎస్) అయిన ఫాస్ట్ ట్రాక్ స్పెశల్ కోర్టుల (ఎఫ్‌టి‌ఎస్‌సి స్) ను 2023 ఏప్రిల్ ఒకటో తేదీ మొదలుకొని 2026 మార్చి నెల 31వ తేదీ వరకు కొనసాగించడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ నిర్ణయం ఫలితం గా 1952.23 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక ప్రభావం ఉంటుంది (దీనిలో కేంద్రం తాలూకు వాటా 1207.24 కోట్ల రూపాయలు గాను, మరియు రాష్ట్రం వాటా 744.99 కోట్లు గాను ఉంటుంది). కేంద్రీయ వాటా ను నిర్భయ నిధి నుండి సమకూర్చడం జరుగుతుంది. ఈ పథకాన్ని 2019 అక్టోబరు 2వ తేదీ నాడు ప్రవేశపెట్టడమైంది.