80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 04:44 pm
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈరోజు ఎర్రకోట ప్రాంగణం నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, గత 12 సంవత్సరాలుగా తయారీ రంగం, డిజిటల్ వృద్ధి మరియు పౌర సేవల రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతికి సంబంధించిన వివరణాత్మక నివేదికను ఆయన సమర్పించారు. జాతీయ ఆశయాలను సాధించడం కోసం ఏడు కీలక రంగాలతో కూడిన పరివర్తనాత్మక సప్తధారను కూడా ఆయన ఆవిష్కరించారు.Cabinet approves continuation of the PM-KISAN Scheme from 2026-27 to 2030-31 with a Financial Outlay of Rs.3.15 lakh crore
July 31st, 04:13 pm
The Union Cabinet, chaired by PM Modi, has approved the continuation of the PM-KISAN Scheme with an outlay of ₹3.15 lakh crore for 2026–31. The scheme will continue providing direct income support to eligible farmers, strengthening agricultural investment and rural prosperity.భారత్ - బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందమూ, సామాజిక భద్రతా ఒప్పందాలపై కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
July 15th, 12:58 pm
భారత్ - బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా), సామాజిక భద్రతా ఒప్పందాలపై కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. భారత్ - బ్రిటన్ భాగస్వామ్యంలో ఇదొక కీలక విజయంగా అభివర్ణించారు. భారత్ - బ్రిటన్ ఆర్థిక సంబంధాలను ఈ రెండు ఒప్పందాలూ మరింత బలోపేతం చేస్తాయనీ, ఇరు దేశాల ఉమ్మడి ఆశయాలను ఆయా దేశాల ప్రజలకు స్పష్టమైన అవకాశాలుగా మలుస్తాయనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
July 11th, 01:15 pm
‘మళ్లీ ఏ పుష్కరానికో...’ అంటుంటాం భారత్‌లో మనం. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారి. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజలందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను.న్యూజిలాండ్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
July 11th, 12:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆక్లాండ్‌లో జరిగిన “కియా ఓరా మోదీ” కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయత, శక్తి, ఉత్సాహం నిండిన 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ సభలో పాల్గొన్నారు.అధికారిక విందు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 11th, 12:32 pm
గతేడాది భారత్‌లో ప్రధాని లక్సన్ చేపట్టిన పర్యటన.. మన ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని అంశాల్లోనూ కొత్త శక్తిని నింపింది. ఆయన నాయకత్వమూ, స్పష్టమైన దార్శనికతా, దృఢమైన అంకితభావమూ.. భారత్, న్యూజిలాండ్ మధ్య ఉన్న స్నేహానికి కొత్త వేగాన్నీ, నూతన దిశనూ అందించాయి. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నాకంటే ముందు వచ్చిన వారు నా కోసం ఎన్నో మంచి పనులను వదిలి వెళ్లారు. వాటిని పూర్తి చేసే భాగ్యం నాకు దక్కిందని నేను తరచూ చెబుతూ ఉంటాను. మిత్రులారా, ఇది మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతోంది.''భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం'' ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధాని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
July 11th, 12:30 pm
భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ హాజరయ్యారు. రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక, క్రీడా, కళా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రాజస్థాన్‌లోని బలోత్రాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా పీఎం ప్రసంగం
July 04th, 12:50 pm
ఈ నేల ఎంతోమంది వీరుల పరాక్రమాన్ని చూసింది. ఈ యుద్ధభూమిలోని ప్రతి అణువూ ఆత్మగౌరవానికే అగ్రతాంబూలం ఇవ్వాలని నేర్పింది. ఒక వ్యక్తిదైనా, దేశానిదైనా ఆత్మ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే... అది స్వావలంబన సాధించినప్పుడు, ఇతరులపై వీలైనంత తక్కువగా ఆధారపడినప్పుడు మాత్రమే. ఇవాళ రాజస్థాన్ సాక్షిగా భారత్ అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారే దిశగా కీలక అడుగు వేసింది. ఇవాళ ఈ రిఫైనరీని దేశానికి అంకితం చేశాం. ఈ రిఫైనరీ ఇక్కడి వేలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. దీని ప్రారంభం సందర్భంగా నేను ప్రత్యేకంగా రాజస్థాన్ యువతకు అభినందనలు తెలియజేస్తున్నా.రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 04th, 12:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిరంతర సహకార స్ఫూర్తిని కొనియాడారు. మండే వేసవిలో మలమలమాడ్చే ఎండలో ఇంద పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన అఖండ ఆమోదానికి ఈ భారీ జనసందోహమే నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. “మా ప్రభుత్వ కృషిపై మీ తిరుగులేని విశ్వాసాన్ని చాటే ఈ అపార ఆదరాభిమానాలకుగాను ఈ రాజస్థాన్ గడ్డకు నేనెంతో రుణపడి ఉంటాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.మెరుగైన పాలన, పౌరులకు సాధికారతతోపాటు వికసిత్ భారత్‌కు బలమైన పునాదిని అందించిన డిజిటల్ ఇండియా: ప్రధాని నరేంద్ర మోదీ
July 01st, 12:04 pm
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై విజయవంతంగా 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం దేశంలో ప్రభుత్వ పాలనా వ్యవస్థను పూర్తిగా మార్చివేసిందని, ప్రజా సేవల్ని మెరుగుపరిచి పౌరుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందని ఆయన కొనియాడారు.2026 వ సంవత్సరం జూన్ 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 135 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 28th, 11:30 am
ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ ఆరు నెలల్లో ‘మన్ కీ బాత్’ లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్‌కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఇటీవల నాకు లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీ వరకు ప్రతి పనీ స్వదేశీయులే చేశారు.పశ్చిమబెంగాల్... తారకేశ్వర్‌లో జరిగిన పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పీఎం ప్రసంగం
June 20th, 05:13 pm
గవర్నర్ ఆర్.ఎన్.రవి, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి సువేందు అధికారి, వేదికపైనున్న ఇతర విశిష్ట ప్రతినిధులు, బెంగాల్ సోదరీసోదరులారా.. బాబా తారక్‌నాథ్ కొలువైన ఈ పవిత్ర భూమిపై పశ్చిమబెంగాల్ దినోత్సవం రోజున ఇక్కడ భారీ జన సందోహం... ఎన్నికలు, ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత ఇలా మీ ముందుకు రావటం నాకెంతో గర్వంగా ఉంది. బెంగాల్ గాలిలో తాజాదనం నిండింది. ఇక్కడి ప్రతి అణువూ సరికొత్త పరిమళాన్ని వెదజల్లుతున్నట్లు ఉంది. సంకెళ్ల నుంచి బెంగాల్ విముక్తి పొందినట్లుగా, బెంగాల్ ఆత్మగౌరవం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తోంది. సరికొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలనే బెంగాల్ సంకల్పానికి నేటి కార్యక్రమం, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలే నిదర్శనం. ప్రజల ముఖాల్లోని వెలుగు, ప్రతి గ్రామంలో కనిపిస్తున్న ఆనందం, విశ్వాసం.. మీ సంతోషంలో భాగం పంచుకునేందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఒక ఓటు, ఒక ఎన్నిక ఎంతటి మార్పు తీసుకురాగలదో బెంగాల్‌లో స‌్పష్టంగా తెలుస్తుంది.‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 20th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.ఒడిశా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీఎం ప్రసంగం
June 20th, 01:10 pm
గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ డియో, శ్రీమతి ప్రవతి పరిదా, ఒడిశా మంత్రి శ్రీ గణేశ్ సింగ్ ఖుంటియా, శ్రీ కృష్ణ చంద్ర మోహపాత్ర, పార్లమెంటు సభ్యుడు శ్రీ నబా చరణ్ మాఝీ, శ్రీ మన్మోహన్ సమాల్, శ్రీ బైజయంత్ పాండా, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా.ఒడిషాలో బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు: మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగపూర్‌లో ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం.. శంకుస్థాపన
June 20th, 01:00 pm
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లాలోగల పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవిత్ర ‘సంథాలీ’, ‘హో’ గిరిజన తెగల పవిత్ర వృక్షదేవతారాధ్య (జహేరా) ప్రాంతాలలో ప్రార్థనలు చేశారు. అలాగే, అక్కడి నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పహాడ్‌పూర్ పాఠశాలను సందర్శించారు. ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో “వికాస్ రా ధార-ఒడిషా సారా” (ఒడిషా రాష్ట్రమంతటా అభివృద్ధి స్రవంతి) ఇతివృత్తంగా మయూర్‌భంజ్ జిల్లాలోని రాయ్‌రంగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మోదీ ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు.‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 19th, 11:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక విజయంగా ఇండియా- యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసించిన ప్రధాని
June 17th, 10:03 pm
2026 జులై 15 నుంచి ఇండియా-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుండటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
June 14th, 04:36 pm
ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాం. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’కు శ్రీకారం
June 14th, 03:00 pm
ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్)లో ఇవాళ “భారత్ ఇన్నొవేట్స్-2026”ను సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణ పెట్టుబడి సంస్థలు, అవకాశాల దిశగా భారత డీప్-టెక్ అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికపైకి తెస్తుంది. అంతర్జాతీయ ప్రాధాన్యంగల 13 కీలక సాంకేతిక రంగాల్లో 120కి పైగా వినూత్న అంకుర సంస్థలను, 20కి పైగా అగ్రశ్రేణి నైపుణ్య సంస్థలు సహా భారత అగ్రశ్రేణి డీప్ టెక్నాలజీని ప్రపంచానికి ఈ వేదిక చాటిచెబుతుంది. ప్రపంచంలోని 350 మందికి పైగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.రైతుల సంక్షేమం, వ్యవసాయంలో ఆధునిక సదుపాయాలు, వ్యవసాయ రంగానికి సాధికారత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి
June 11th, 04:19 pm
దేశ ఆహార భద్రత, పోషణ, సమృద్ధికి మన రైతు సోదరీ, సోదరులు మూల స్తంభాలని, వారి జీవితాల్ని సులభతరంగా మార్చడానికి ప్రభుత్వం సర్వశక్తులతో ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టంచేశారు. ‘పీఎమ్-కిసాన్ సమ్మాన్ నిధి’, ‘ఫసల్ బీమా యోజన’ వంటి కార్యక్రమాలు రైతులకు ఆదాయ భద్రతను సమకూర్చడంతో పాటు, వ్యవసాయానికి సాధికారతను కూడా కల్పిస్తున్నాయని, ‘పీఎమ్-కుసుమ్ పథకం’ సౌర ఇంధనాన్ని సులభతరం చేస్తోందని, దీంతో వ్యవసాయానికి అయ్యే ఖర్చులు తగ్గుతున్నాయని ఆయన వివరించారు.