మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 17th, 11:20 am
మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు సోదరి సావిత్రి ఠాకూర్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, దేశంలోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీ సోదరులారా!మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం
September 17th, 11:19 am
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జ్ఞానానికి అధిదేవత, ధార్ భోజ్‌శాలలో పూజలందుకొనే తల్లి - వాగ్దేవికి నమస్కరిస్తూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఈ రోజు దేవశిల్పీ, నైపుణ్యం, సృజనాత్మకతకు అధిపతి అయిన విశ్వకర్మ జయంతి అని చెబుతూ ఆయనకు శ్రీ మోదీ నమస్సులు అర్పించారు. హస్త కళా నైపుణ్యం, అంకితభావంతో దేశ నిర్మాణంలో పాలుపంచు కొంటున్న కోట్లాది సోదరీసోదరులంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.Important to maintain the authenticity of handloom craftsmanship in the age of technology: PM at Bharat Tex
February 16th, 04:15 pm
PM Modi, while addressing Bharat Tex 2025 at Bharat Mandapam, highlighted India’s rich textile heritage and its growing global presence. With participation from 120+ countries, he emphasized innovation, sustainability, and investment in the sector. He urged startups to explore new opportunities, promoted skill development, and stressed the fusion of tradition with modern fashion to drive the industry forward.భారత్ టెక్స్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
February 16th, 04:00 pm
న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ‘భారత్ టెక్స్ 2025’ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను కూడా ఆయన పరిశీలించారు. సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరికీ భారత్ టెక్స్‌కు ఆహ్వానం పలుకుతున్నానన్నారు. ఈ రోజు భారత్ మండపంలో భారత్ టెక్స్ రెండో సంచికను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మా దేశ సంప్రదాయాలను కళ్లకు కట్టడంతోపాటు వికసిత్ భారత్ సాధనకు ఉన్న అవకాశాలను కూడా చాటుతోందని, ఇది ఇండియాకు గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ‘‘భారత్ టెక్స్ ఇక మెగా గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్‌గా ఎదుగుతోంది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు. వేల్యూ చైన్‌లో పాత్రధారులైన మొత్తం 12 సముదాయాలు ఈసారి ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నాయని కూడా ఆయన తెలిపారు. దుస్తులు, అనుబంధ వస్తువులు (ఏక్సెసరీస్), యంత్ర పరికరాలు, రసాయనాలు, అద్దకం రంగులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్న సంగతిని ఆయన ప్రస్తావించారు. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన విధాన రూపకర్తలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓలు), పరిశ్రమ నేతలకు వ్యాపారానికి, సహకారానికి, భాగస్వామ్యాల్ని ఏర్పరచుకోవడానికి ఒక బలమైన వేదికగా భారత్ టెక్స్ మారుతోందని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పాటును అందిస్తున్న ఆసక్తిదారులందరి కృషిని ఆయన ప్రశంసించారు.Basic spirit of Vishwakarma Yojna is ‘Samman Samarthya, Samridhi: PM in Wardha
September 20th, 11:45 am
PM Modi addressed the National PM Vishwakarma Program in Wardha, Maharashtra, launching the ‘Acharya Chanakya Skill Development’ scheme and the ‘Punyashlok Ahilyadevi Holkar Women Startup Scheme.’ He highlighted the completion of one year of the PM Vishwakarma initiative, which aims to empower artisans through skill development. The PM laid the foundation stone for the PM MITRA Park in Amravati, emphasizing its role in revitalizing India's textile industry.మహారాష్ట్ర, వార్ధాలో నిర్వహించిన జాతీయ పీఎం విశ్వకర్మ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 20th, 11:30 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని వార్ధాలో నిర్వహించిన జాతీయ పీఎం విశ్వకర్మ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్‌మెంట్’ పథకం, ‘పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్’లను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు ధ్రువపత్రాలను, రుణాలను ఆయన విడుదల చేశారు. పీఎం విశ్వకర్మ కార్యక్రమం కింద ఒక సంవత్సరం పాటు సాధించిన పురోగతికి గుర్తుగా స్మారక స్టాంపును కూడా ప్రధాని విడుదల చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ అపెరల్ (పీఎం మిత్ర) పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని తిలకించారు.