అక్టోబరు 29న ముంబయిలో పర్యటించనున్న ప్రధానమంత్రి

October 27th, 10:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 29న సాయంత్రం ముంబయిలో పర్యటించనున్నారు. ముంబయిలోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇండియా మారిటైమ్ వీక్-2025లో సుమారు 4 గంటల వేళకు ఆయన మారిటైమ్ లీడర్స్ కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గ్లోబల్ మారిటైమ్ సీఈఓ ఫోరానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించనున్నారు.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం

September 25th, 06:16 pm

రష్యా ఉప ప్రధాని దిమిత్రీ పత్రుషేవ్, మంత్రి వర్గంలో నా సహచరులు చిరాగ్ పాశ్వాన్, శ్రీ రన్వీత్, శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్, వివిధ దేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రతినిధులు, విశిష్ట అతిధులు, సోదరీసోదరులారా!

వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 25th, 06:15 pm

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, వినియోగదారులు పాల్గొన్నారనీ, కొత్త పరిచయాలను పెంపొందించుకోవడానికీ, సృజనాత్మకతకు వరల్డ్ ఫుడ్ ఇండియాను వేదికగా మార్చారన్నారు. తాను ఇప్పుడే ఎగ్జిబిషన్‌ను సందర్శించానని చెబుతూ.. పోషకాహారం, వంటనూనె వినియోగాన్ని తగ్గించడం, ప్యాకేజ్డ్ ఉత్పత్తులను ఆరోగ్యకరంగా మార్చడంపై ప్రాథమిక దృష్టి సారించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

ఉత్తరాఖండ్‌లోని హర్శిల్‌లో శీతాకాల పర్యాటక కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 06th, 02:07 pm

ఈ వేదికపై ఆసీనులైన నా సోదరుడు, చురుకైన ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామ్‌ గారు, కేంద్ర మంత్రి శ్రీ అజయ్‌ టమ్టాగారు, రాష్ట్ర మంత్రి సత్పాల్‌ మహరాజ్‌ గారు, పార్లమెంటులో నా సహ సభ్యులైన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులు మహేంద్ర భట్‌ గారు, మాలా రాజ్యలక్ష్మిగారు, ఎమ్మెల్యే సురేష్‌ గారు, ఇతర ప్రముఖులు, సభకు హాజరైన సోదరీసోదరులారా!

ఉత్తరాఖండ్ లోని హర్సిల్ లో శీతాకాల పర్యాటక కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 06th, 11:17 am

ఉత్తరాఖండ్ లోని హార్సిల్ లో ట్రెక్, బైక్ ర్యాలీని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... అనంతరం శీతాకాల పర్యాటక కార్యక్రమంలో పాల్గొన్నారు. మఖ్వా ప్రాంతంలోని శీతాకాలపు గంగామాత దర్శన ప్రాంతాన్ని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనా గ్రామంలో జరిగిన విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలు సంఘీభావంగా నిలుస్తున్నారని, ఇది బాధిత కుటుంబాలకు మనోనిబ్బరాన్ని అందిస్తుందని అన్నారు.

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జనవరి 12న జరగనున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో పాల్గొననున్న ప్రధాని

January 10th, 09:21 pm

\స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జరుపుకొంటున్న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జనవరి 12న ఉదయం 10 గంటలకు దిల్లీలోని భారత్ మండపంలో జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే 3,000 మంది ప్రతిభావంతులైన యువ నాయకులతో ఆయన సంభాషించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.

We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives: PM

January 09th, 10:15 am

PM Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas convention in Bhubaneswar, Odisha. Expressing his heartfelt gratitude to the Indian diaspora and thanking them for giving him the opportunity to hold his head high with pride on the global stage, Shri Modi highlighted that over the past decade, he had met numerous world leaders, all of whom have praised the Indian diaspora for their social values and contributions to their respective societies.

ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

January 09th, 10:00 am

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ప్రవాసీ భారతీయులకు శ్రీ మోదీ స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రారంభ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ కార్యక్రమాల్లో పాడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రవాసీ భారతీయుల భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గ్రామీ పురస్కార విజేత కళాకారుడు శ్రీ రికీ కేజ్‌నూ, ఆయన సహ కళాకారులనూ ప్రధాని ప్రశంసించారు.

జనవరి 4న న్యూఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవ్ – 2025ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

January 03rd, 05:56 pm

గ్రామీణ భారత్ మహోత్సవ్-2025ను జనవరి 4 ఉదయం 10.30గం.ల ప్రాంతంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ఆయన ప్రసంగిస్తారు.

డిసెంబరు 6న అష్టలక్ష్మీ మహోత్సవాన్ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

December 05th, 06:28 pm

ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అష్టలక్ష్మీ మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఈశాన్య భారత సాంస్కృతిక చైతన్యాన్ని చాటడంపై ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం.

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం

August 30th, 12:00 pm

ఇటీవలే జన్మాష్టమిని జరుపుకున్న దేశం ప్రస్తుతం పండుగ వాతావరణం లో ఉంది. మన ఆర్థిక వ్యవస్థలోనూ, మార్కెట్లలోనూ పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంబర వాతావరణంలోనే మనం గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాం, అలాంటి కార్యక్రమానికి కలల నగరమైన ముంబై కంటే మంచి ప్రదేశం ఏముంటుంది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం. ఇక్కడికి రాకముందు వివిధ ప్రదర్శనలను సందర్శించే అవకాశం, పలువురు మిత్రులతో మమేకమయ్యే అవకాశం లభించింది. అక్కడ, మన యువత నాయకత్వంలో, భవిష్యత్తు అవకాశాలతో నిండిన కొత్త ఆవిష్కరణల ప్రపంచాన్ని నేను చూశాను. మీ పనికి అనుగుణంగా, మరో మాటలో చెప్పాలంటే: నిజంగా ఒక కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోంది. ఈ ఉత్సవ నిర్వాహకులను, పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను.

ముంబైలో గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌(జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

August 30th, 11:15 am

మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో ఉన్న జియో వ‌రల్డ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఇవాళ జ‌రిగిన గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ (జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను సైతం ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ క‌న్వ‌ర్జెన్స్ కౌన్సిల్ క‌లిసి జీఎఫ్ఎఫ్‌ను సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఫిన్‌టెక్ రంగంలో భార‌త్ సామ‌ర్థ్యాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు ఈ రంగంలోని కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ఒక్క‌చోట‌కు చేర్చ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం.

విడిఎన్‌కెహెచ్ లోని రోసాటమ్ మండపాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి

July 09th, 04:18 pm

రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తన వెంట రాగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాస్కో లోని విడిఎన్‌కెహెచ్ లో అఖిల రష్యా ప్రదర్శన కేంద్రాన్ని సందర్శించారు.

Bharat Tex 2024 is an excellent platform to highlight India's exceptional capabilities in the textile industry: PM Modi

February 26th, 11:10 am

PM Modi inaugurated Bharat Tex 2024, one of the largest-ever global textile events to be organized in the country at Bharat Mandapam in New Delhi. He said that Bharat Tex connects the glorious history of Indian tradition with today’s talent; technology with traditions and is a thread to bring together style/sustainability/ scale/skill.

న్యూఢిల్లీలో భారత్ టెక్స్ 2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి

February 26th, 10:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపంలో దేశంలో నిర్వహించే అతి పెద్ద గ్లోబల్ టెక్స్ టైల్ ఈవెంట్ లలో ఒకటైన భారత్ టెక్స్ - 2024 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని తిలకించారు.

భారతదేశం లో అతి పెద్దది అయినటువంటిది మరియు ఆ కోవ లోమొట్టమొదటిది అయిన మొబిలిటీ ఎగ్జిబిశన్ - ‘‘భారత్మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024’’ కు సంబంధించినకార్యక్రమాన్ని ఉద్దేశించి ఫ్రిబవరి 2 వ తేదీ న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

February 01st, 03:11 pm

భారతదేశం లో అతి పెద్దది అయినటువంటి మరియు తన తరహా కు చెందిన మొట్టమొదటిది అయినటువంటి మొబిలిటీ ఎగ్జిబిశన్ ‘‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024’’ కు సంబంధించి న ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2 వ తేదీ నాడు సాయంత్రం పూట 4:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రసంగించనున్నారు.