ఏప్రిల్ 21న పౌర సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి ప్రజా పరిపాలనలో విశిష్ట సేవలకుగాను ప్రధానమంత్రి అవార్డులను ప్రదానం చేయనున్న శ్రీ నరేంద్ర మోదీ
April 19th, 01:16 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17వ జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21న ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సివిల్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రజా పరిపాలనలో విశిష్ట సేవలకు గాను ప్రధానమంత్రి అవార్డులను ఆయన ప్రదానం చేయనున్నారు.