ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 23rd, 10:10 pm

వరల్డ్ లీడర్స్ ఫోరంకు హాజరైన అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సు నిర్వహిస్తున్న సమయం అత్యంత తగిన సమయం.. అందుకు నేను నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఒక వారం కిందట నేను ఎర్రకోట నుంచి మాట్లాడుతూ తదుపరి తరం సంస్కరణలను ప్రస్తావించాను. ఇప్పుడు ఈ సదస్సు ఆ స్పూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.

న్యూఢిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 23rd, 05:43 pm

ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన ప్రముఖ అతిథులందరినీ ఆయన స్వాగతించారు. ఈ ఫోరం జరుగుతున్న సమయం అత్యంత తగిన సమయంగా పేర్కొన్న శ్రీ నరేంద్ర మోదీ.. తగిన సమయంలో ఈ సదస్సును నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గత వారం తాను ఎర్రకోట వేదికగా తదుపరి తరం సంస్కరణల గురించి మాట్లాడినట్లు గుర్తుచేసిన ప్రధానమంత్రి.. ఇప్పుడు ఆ స్ఫూర్తిని ఈ సదస్సు మరింత శక్తిమంతం చేస్తోందన్నారు.