Cabinet approves two multitracking Railway projects across Maharashtra and Gujarat

November 26th, 04:30 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved two Ministry of Railways projects worth about Rs. 2,781 crore. These include the Devbhumi Dwarka (Okha)-Kanalus doubling covering 141 km and the Badlapur-Karjat 3rd and 4th line spanning 32 km. The projects will increase line capacity, improve mobility and strengthen operational efficiency and service reliability by reducing congestion across the network.

బీహార్‌లోని రెండు ప్రాంతాలు రాంసార్ కేంద్రాలుగా గుర్తింపు పొందటాన్ని భారతదేశ చిత్తడి నేలల సంరక్షణ‌లో కీలక ఘట్టంగా పేర్కొన్న ప్రధానమంత్రి

September 27th, 06:00 pm

ఈ రోజు రాంసార్ కేంద్రాలుగా బీహార్‌కు చెందిన బక్సర్ జిల్లాలో గోకుల్ జలషాయ్ (448 హెక్టార్లు), పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉదయపూర్ ఝీల్ (319 హెక్టార్లు) గుర్తింపు పొందటం... భారతదేశ పర్యావరణ పరిరక్షణకు గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

గౌరవ బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను నాటిన ప్రధానమంత్రి

September 19th, 05:24 pm

గౌరవ బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు 7 లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో నాటారు. ‘‘పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతపై గౌరవ చార్లెస్‌ కు ఎంతో నిబద్ధత ఉంది. ఈ అంశం మా చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.’’ అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.

రానున్న దశాబ్దంపై భారత్‌-జపాన్ ఉమ్మడి దృక్కోణం: ఎనిమిది లక్ష్యాలతో ప్రత్యేక వ్యూహాత్మక-ప్రపంచ భాగస్వామ్యానికి సారథ్యం

August 29th, 07:11 pm

ఇండో-పసిఫిక్ ప్రాంతంపై భార‌త్‌, జ‌పాన్‌ దేశాలది ఉమ్మ‌డి దృక్కోణం. ఈ ప్రాంతం చట్టబద్ధ పాలన సహిత స్వేచ్ఛ, సౌహార్ద‌ం, శాంతి, సౌభాగ్యాలతో ఘ‌ర్ష‌ణ ర‌హితంగా పురోగ‌మించాల‌న్న‌ది రెండు దేశాల అభిమతం. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర సహాయకారిగా మెలగుతాయి. వనరులు, సాంకేతికత, ఉత్పత్తి వ్యయం రీత్యా పోటీతత్వంలో రెండింటికీ ప్రత్యేక బలాలున్నాయి. దీంతోపాటు సుదీర్ఘ సుహృద్భావ, చారిత్రక స్నేహబంధం ఉన్నందువల్ల ఇకపైనా జంటగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే దశాబ్దంలో మన దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్పులు, అవకాశాలు అందిరానున్నాయి. వీటన్నిటి సద్వినియోగం దిశగా సంయుక్త సారథ్యానికి మేం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా ప్రకటిస్తున్నాం. జాతీయ లక్ష్యాల సాధనతో్పాటు మన దేశాలను, భవిష్యత్తరం పౌరులను మునుపటికన్నా చేరువ చేయడానికి మా నాయకత్వం తోడ్పడుతుంది.

100 గిగా వాట్స్‌ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని సాధించడంలో స్వావలంబన, హరిత విద్యుత్తును ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 13th, 08:48 pm

100 గిగా వాట్స్‌ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని సాధించడంలో స్వావలంబన విజయాలనూ, హరిత విద్యుత్తును ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రశంసించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో చేసిన పోస్టుకు ప్రధానమంత్రి స్పందించారు.

న్యూఢిల్లీలో ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగం

August 07th, 09:20 am

మంత్రివర్గ సహచరుడు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేశ్ చంద్... చాలా మంది స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడున్నారు... వారందరికీ కూడా సగౌరవంగా నమస్కరిస్తున్నాను. శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!

PM Modi addresses the M.S. Swaminathan Centenary International Conference

August 07th, 09:00 am

PM Modi inaugurated and addressed the M.S. Swaminathan Centenary International Conference at ICAR PUSA in New Delhi. Calling Dr. Swaminathan a visionary who ensured India’s food security and turned science into service, PM Modi recalled his pioneering ideas like the Evergreen Revolution and bio-villages. The PM also launched the M.S Swaminathan Award for Food & Peace, reaffirming support for farmers.

కర్తవ్య భవన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని

August 06th, 12:15 pm

కర్తవ్య భవన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ప్రజాసేవ పట్ల దృఢసంకల్పానికి, నిరంతర కృషికి ఈ భవనంఒక ప్రతీక అని ఆయన అభివర్ణించారు.

వన మహోత్సవ వేడుకల్లో గౌరవ న్యాయమూర్తులు ఉత్సాహంగా పాల్గొనడం ప్రశంసనీయం: ప్రధానమంత్రి

July 19th, 07:02 pm

వన మహోత్సవ వేడుకల్లో గౌరవ న్యాయమూర్తులు ఉత్సాహంగా పాల్గొనడం ప్రశంసనీయమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పర్యావరణ బాధ్యత పట్ల పౌరులను ప్రేరేపించడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు.

పర్యావరణం, కాప్-30లతో పాటు ప్రపంచ ఆరోగ్యం అంశాలపై బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు.. ప్రసంగించిన ప్రధానమంత్రి

July 07th, 11:38 pm

పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్యసంరక్షణ’’ అంశాలపై సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలతో పాటు పాలుపంచుకోవాల్సిందంటూ ఆహ్వానాన్ని అందుకున్న దేశాలు కూడా పాల్గొన్నాయి. ప్రపంచ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకొని ఇలాంటి అధిక ప్రాధాన్యం కలిగిన అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు బ్రెజిల్‌కు ఆయన తన ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ మార్పును ఇంధన సమస్యల పరిష్కారం అనే ఒకే అంశంతో ముడిపెట్టి చూడడం భారతదేశం దృక్పథం కాదని, జీవనానికి ప్రకృతికి మధ్య సమతూకాన్ని ప్రభావితం చేసే అంశం ఇదని తమ దేశం భావిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వాతావరణ పరంగా న్యాయాన్ని ఏర్పరచడం అంటే అది ఒక నైతిక బాధ్యత అని, దీనిని తప్పక నిర్వర్తించాల్సిందేనని భారత్ సంకల్పించిందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పర్యావరణ సంరక్షణ దిశలో కార్యాచరణను చేపట్టడానికి భారత్ ఎంతో చిత్తశుద్ధితో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజానుకూల, భూగ్రహానికి మిత్రపూర్వక ప్రగతిసాధక విధానాలను ప్రోత్సహించడానికి తీసుకొంటున్న వివిధ కార్యక్రమాలను గురించి ఆయన సమగ్రంగా సభకు వివరించారు. ఈ సందర్భంగా మిషన్ లైఫ్ (పర్యావరణ అనుకూల జీవనం), 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడం), అంతర్జాతీయ సౌరశక్తి కూటమి, సమర్థవంతమైన విపత్తు సన్నద్ధ కూటమి (కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రేజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), హరిత హైడ్రోజన్ మిషన్, ప్రపంచ జీవ ఇంధన వేదిక, పులుల సంరక్షణ కూటమి (బిగ్ క్యాట్స్ అలయన్స్) తదితర కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.

పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్య అంశాలపై ఏర్పాటైన బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 07th, 11:13 pm

బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతాల్లో భాగంగా పర్యావరణ, ఆరోగ్య భద్రత అంశాలకు బ్రెజిల్ అత్యధిక ప్రాధాన్యతనివ్వడం నాకు సంతోషం కలిగిస్తోంది. ఇవి పరస్పర సంబంధం గల అంశాలే కాక మానవాళి సంక్షేమానికి, ఉజ్జ్వల భవిష్యత్తుకూ ఎంతో ముఖ్యమైనవి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు న్యూఢిల్లీలోని తన నివాసంలో సిందూర్ మొక్కను నాటిన ప్రధానమంత్రి

June 05th, 11:50 am

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో సిందూర్ మొక్కను నాటి దానికి నీళ్లు పోశారు. గుజరాత్‌లో కచ్ఛ్‌కు చెందిన సాహసిక మాతృమూర్తులు, సోదరీమణులు కానుకగా ఆయనకు అందజేసిన మొక్క అది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ కాలంలో కచ్ఛ్‌కు చెందిన మాతృమూర్తులు, సోదరీమణులు మొక్కవోని ధైర్య-సాహసాలతో పాటు గొప్ప దేశభక్తిని ప్రదర్శించారు. ప్రధాని ఇటీవల గుజరాత్‌లో పర్యటించిన సంగతిని గుర్తుచేసుకున్నారు...నాకు బహుమతిగా ఇచ్చిన సిందూర్ మొక్క మన దేశ నారీశక్తి శౌర్యంతో పాటు ప్రేరణకు కూడా ఒక ప్రబలమైన ప్రతీకగా అలరారుతుందని ప్రధానమంత్రి అన్నారు.

‘ప్రాజెక్ట్ లయన్’లో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల పట్ల ప్రధానమంత్రి హర్షం

May 21st, 04:08 pm

‘ప్రాజెక్ట్ లయన్’లో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల పట్ల ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాలు గుజరాత్‌లో సింహాలకు అనుకూల పరిసరాలను సమకూర్చడంతో పాటు వాటి సంరక్షణకు కూడా పూచీపడుతున్నాయి.

ముంబయి ‘వేవ్స్‌ సమ్మిట్‌’లో ప్రధానమంత్రి ప్రసంగం

May 01st, 03:35 pm

వేవ్స్‌ సమ్మిట్‌ వేదికపై ఆసీనులైన మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫఢన్‌వీస్‌, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ ఎల్.మురుగన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన సృజనాత్మక లోక ప్రముఖులు, వివిధ దేశాల సమాచార-ప్రసార, కమ్యూనికేషన్, కళ-సాంస్కృతిక శాఖల మంత్రులు, రాయబారులు, సృజనాత్మక లోక ప్రసిద్ధులు, ఇతర ప్రముఖులు, మహిళలు, గౌరవనీయ అతిథులారా!

వేవ్స్ 2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

May 01st, 11:15 am

మొట్టమొదటి ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ - వేవ్స్ 2025ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులు, రాయబారులు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులను స్వాగతిస్తూ.. వేవ్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. 100కు పైగా దేశాకు చెందిన కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కలసి అంతర్జాతీయ స్థాయి ప్రతిభ, సృజనాత్మక వ్యవస్థకు పునాది వేశారని పేర్కొన్నారు. ‘‘వేవ్స్ కేవలం సంక్షిప్త పదం కాదు.. సంస్కృతిని, సృజనాత్మకతను, అంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం’’ అని వర్ణించారు. అలాగే ఈ సదస్సు సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథలు చెప్పడానికి సంబంధించిన విస్తృతమైన ప్రపంచాన్ని ప్రదర్శిస్తుందని ప్రధాని అన్నారు. అదే సమయంలో కళాకారులు, రూపకర్తలకు భాగస్వామ్యాలు పెంచుకొనేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు.

ఆర్థిక సహకార విస్తరణపై జపాన్ ప్రతినిధి బృందం కీజై డోయుకైతో ప్రధానమంత్రి సమావేశం

March 27th, 08:17 pm

భారత్, జపాన్ మధ్య ఆర్థిక సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడానికి వచ్చిన ప్రతినిధి బృందం కీజై డోయుకై (జపాన్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ సంఘం)తో ఢిల్లీలోని లోక కళ్యాణ మార్గ్, 7 లో ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 20 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి కీజై డోయుకై అధ్యక్షుడు శ్రీ తకేసి నినామి నాయకత్వం వహిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించే అంశంలో వారి ఆలోచనలను ప్రధానమంత్రి విన్నారు.

ప్రధానమంత్రి అధ్యక్షతన గిర్‌లో నేడు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ ఏడో సమావేశం

March 03rd, 04:48 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లో గిర్ నేషనల్ పార్కును సందర్శించారు. అక్కడ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఏడో సమావేశాన్ని నిర్వహించగా, ఆ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 28th, 09:36 pm

నేడు దేవభూమి యువశక్తితో మరింత దివ్యంగా మారింది. బాబా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగామాత ఆశీస్సులతో జాతీయ క్రీడలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తమ సత్తా చాటబోతున్నారు. ఎంతో అందమైన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి కూడా అనేక స్వదేశీ సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడల్లో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఒక రకంగా హరిత క్రీడలు కూడా. ఇందులో పర్యావరణ హితమైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాతీయ క్రీడల్లో అందుకునే పతకాలు, ట్రోఫీలన్నీ కూడా ‘ఇ-వ్యర్థాల‘తో తయారైనవే. పతకాలు సాధించిన క్రీడాకారుల పేరిట ఇక్కడ మొక్కలను కూడా నాటనున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తూ ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన క్రీడోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ధామికి, వారి బృందానికి, ఉత్తరాఖండ్ లోని ప్రతి పౌరుడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలు ప్రారంభం

January 28th, 09:02 pm

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ లో ఈ రోజు యువ శక్తి పొంగిపొరలుతోందంటూ అభివర్ణించారు. బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగ మాతల ఆశీర్వాదాలతో 38వ జాతీయ క్రీడలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ఆవిర్భవించి ఇప్పటికి ఇది 25వ సంవత్సరం అని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన యువత తన ప్రతిభను చాటిచెప్పనుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సుందర చిత్రాన్ని ఆవిష్కరించిందని కూడా ఆయన ప్రశంసించారు. జాతీయ క్రీడల తాజా సంచికలో అనేక స్థానిక ఆటలను చేర్చారనీ, ‘హరిత క్రీడలు’ ఈ ఆటలపోటీకి ఇతివ‌ృత్తంగా ఉందనీ ఆయన చెప్పారు. ఈ ఇతివృత్తం గురించి ప్రధాని మరింతగా వివరిస్తూ, ఈ పోటీల సందర్భంగా ప్రదానం చేసే ట్రోఫీలు, పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్ధాల (ఈ-వేస్ట్)తో తయారు చేశారనీ, పతకాన్ని గెలిచే ప్రతి ఒక్క విజేత పేరుతో ఒక మొక్కను నాటనున్నారనీ ఆయన వెల్లడిస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు.

బేటీ బచావో, బేటీ పఢావో ఉద్యమానికి పదేళ్లు.. ప్రస్తావించిన ప్రధానమంత్రి

January 22nd, 10:04 am

‘బేటీ బచావో, బేటీ పఢావో’ (ఆడపిల్లను కాపాడండి, ఆడపిల్లను చదివించండి) ఉద్యమానికి నేటితో పది సంవత్సరాలు పూర్తి అయిన సంగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ కార్యక్రమం చెప్పుకోదగ్గ మార్పులకు దారితీసిందని, ప్రజల అండదండలే దీనిని ముందుకు నడిపిస్తున్నాయని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని ప్రధాని అన్నారు. బాలురు, బాలికల విషయంలో పక్షపాత భావనను దూరం చేయడంలో, బాలికలకు సాధికారతను కల్పించడంలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం తోడ్పడిందని ఆయన ప్రధానంగా చెప్పారు. బాల బాలికల నిష్పత్తి తక్కువ స్థాయిల్లో ఉంటూ వస్తున్న జిల్లాల్లో ఈ ఉద్యమం అమలుతో గణనీయ ఫలితాలు వచ్చాయని కూడా శ్రీ మోదీ తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని చక్కగా కొనసాగించడంలో పాలుపంచుకొంటున్న ఆసక్తిదారులందరినీ ఆయన అభినందించారు.