Empowering Africa’s development and its young talent is in the interest of the entire world: PM Modi during the Johannesburg G20 Summit
November 22nd, 09:36 pm
In his statement at the G20 Summit in Johannesburg, South Africa, PM Modi noted that the historic initiatives launched during the New Delhi G20 Summit have been carried forward here. Putting forth several landmark proposals, he stressed the need to view the human being, society and nature as one integrated whole. He added that advancing Africa’s development and empowering its young talent is in the interest of the entire world.Prime Minister participates in G20 Summit in Johannesburg
November 22nd, 09:35 pm
Prime Minister participated today in the G20 Leaders’ Summit hosted by the President of South Africa, H.E. Mr. Cyril Ramaphosa in Johannesburg. This was Prime Minister’s 12th participation in G20 Summits. Prime Minister addressed both the sessions of the opening day of the Summit. He thanked President Ramaphosa for his warm hospitality and for successfully hosting the Summit.తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025లో ప్రధానమంత్రి ప్రసంగం
November 19th, 07:01 pm
తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్. రవి, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ ఎల్. మురుగన్, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్. కె. రామస్వామి, వివిధ వ్యవసాయ సంస్థల నుంచి ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, నా ప్రియమైన రైతు సోదరీ, సోదరులు, డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన లక్షలాదిమంది రైతులు! మీ అందరికీ వణక్కం! నమస్కారం! ముందుగా, ఇక్కడ ఉన్న మీ అందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న నా రైతు సొదరీ, సోదరులకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు ఒక గంట ఆలస్యం అయ్యింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నేను సత్య సాయిబాబాకు అంకితం చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తిలో ఉన్నాను. అక్కడ ఆ కార్యక్రమం ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం కొనసాగింది. అందుకే, నేను రావడానికి ఆలస్యం అయ్యింది. దీనివల్ల మీకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలి. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఎదురు చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. అందుకే వినయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను.తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ శిఖరాగ్ర సదస్సు-2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 19th, 02:30 pm
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ రోజు దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సు-2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన శ్రీ మోదీ... కోయంబత్తూరు పవిత్ర గడ్డపై మరుధమలై మురుగన్‌కు నమస్కరిస్తూ తన వ్యాఖ్యలను ప్రారంభించారు. కోయంబత్తూరు సంస్కృతి, కరుణ, సృజనాత్మకతకు నిలయంగా... దక్షిణ భారత పారిశ్రామిక శక్తికి కేంద్రంగా ఉందన్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థకు నగర వస్త్ర రంగం ప్రధానంగా దోహదపడుతోందని ఆయన స్పష్టం చేశారు. కోయంబత్తూరుకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నందున ఈ నగరానికి మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.భూటాన్ రాజు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ప్రధాని ప్రసంగం
November 11th, 12:00 pm
బాధ్యులందరినీ చట్టం ఎదుట నిలబెడతాం.భూటాన్‌లోని థింఫులో చాంగ్లిమెథాంగ్ సెలబ్రేషన్ గ్రౌండ్‌లో జరిగిన సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 11th, 11:39 am
భూటాన్ కు, భూటాన్ రాజ కుటుంబానికి, ప్రపంచశాంతిని కోరే ప్రతి ఒక్కరికీ ఇవాళ ముఖ్యమైన రోజని ప్రధానమంత్రి అన్నారు. భారత్, భూటాన్ మధ్య శతాబ్దాలుగా ఉన్న బలమైన భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాలను ఆయన వివరించారు. ఇలాంటి కీలక సందర్భంలో తాను ఇక్కడికి రావడం భారతదేశపు ప్రాధాన్యత మాత్రమే కాదు..అది తనది కూడానని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసిందని, ఈ క్రమంలో తాను బరువెక్కిన హృదయంతో భూటాన్ కు వచ్చినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. బాధిత కుటుంబాల దుఃఖాన్ని తాను అర్థం చేసుకోగలనని, దేశం మొత్తం వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలతో రాత్రంతా సంప్రదింపులు జరిపినట్లు ప్రధానమంత్రి తెలిపారు. భారత ఏజెన్సీలు ఈ కుట్రను బయటపెడతాయని, దాడికి కారణమైన వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. కుట్రదారులను న్యాయస్థానం ఎదుట నిలబెడతామని తెలిపారు.ఏడాది పాటు నిర్వహించనున్న “వందేమాతరం” జాతీయ గేయం 150 సంవత్సరాల స్మారకోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 07th, 10:00 am
సామూహికంగా వందేమాతర గేయాన్ని ఆలపించే ఈ అద్భుతమైన అనుభవం నిజంగా మాటలతో వర్ణించలేనిది. అనేక గళాల్లో... ఒకే లయ, ఒకే స్వరం, ఒకే భావం, ఒకే ఉత్తేజం, ఒకే ప్రవాహంగా సాగే ఈ గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఈ భావోద్వేగ భరితమైన వాతావరణంలో నేను నా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాను. వేదికపై ఉన్న నా మంత్రివర్గ సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా గారు, ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా గారు, ఇతర ప్రముఖులు, అలాగే ఈ వేడులకు హాజరైన నా సోదరీ సోదరులారా...జాతీయ గేయం ‘‘వందేమాతరం’’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా
November 07th, 09:45 am
దేశాన్ని ఒక భౌగోళిక-రాజకీయ ప్రదేశంగా మాత్రమే చూసేవారికి... అలా కాకుండా తల్లిగా పరిగణించాలనే ఆలోచన ఆశ్చర్యం అనిపించవచ్చునని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, భారత్ ఇందుకు భిన్నం... ఇక్కడ తల్లి అంటే- జన్మనిచ్చేది.. పెంచిపోషించేది మాత్రమే కాదు బిడ్డలకు ప్రమాదం కలిగించే దుష్టశక్తులను అంతం చేసే భద్రకాళి. కాబట్టే- భరతమాత శక్తి అపారమని, కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించడమేగాక శత్రు నాశనం చేసిందని చెబుతూ- వందేమాతరంలోని పంక్తులను ఆయన ఉటంకించారు. దేశం ఒక తల్లి కాగా, ఆ తల్లి శక్తిసామర్థ్యాలు ఒక దైవ స్వరూపమనే భావనే స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీ-పురుషులు సమాన భాగస్వాములు కావడానికి దారితీసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నారీశక్తి భారత్‌ను మరోసారి పురోగమన పథంలో నిలపగలదనే స్వప్నాలకు ఊతమిచ్చింది ఈ దార్శనికతేనని చెప్పారు.నవ రాయపూర్ లో బ్రహ్మకుమారీల ధ్యాన కేంద్రం - శాంతి శిఖర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 01st, 11:15 am
ఛత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ రామన్ డేకా, ప్రజాదరణ పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి, రాజయోగిని సిస్టర్ జయంతి, రాజయోగి మృతుంజయ్, సోదరి బ్రహ్మకుమారీలు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, ప్రముఖులారా!ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో 'శాంతిశిఖర్'- ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవంలో బ్రహ్మకుమారీలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 01st, 11:00 am
ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో ఆధునిక ఆధ్యాత్మిక జ్ఞాన, శాంతి-ధ్యాన కేంద్రం “శాంతిశిఖర్”ను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్రహ్మకుమారీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 25 సంవత్సరాలు పూర్తయినందున ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ఇదే రోజున తమ 25వ అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాయని గుర్తుచేశారు. అంతేకాకుండా ఇదే రోజున ఆవిర్భవించిన దేశంలోని పలు రాష్ట్రాలు వేడుకలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్రాల ప్రగతి దేశ పురోగమనాన్ని వేగిరం చేస్తుందన్న మార్గదర్శక సూత్రం ప్రాతిపదికగా వికసిత భారత్ లక్ష్య సాధనకు మేం చురుగ్గా కృషి చేస్తున్నాం” అని ప్రధానమంత్రి స్పష్టీకరించారు.న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్ 2025లో ప్రధాని ప్రసంగం
October 31st, 06:08 pm
న్యూఢిల్లీలోని రోహిణిలో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనం 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ.. ఇంతకుముందు విన్న మంత్రాల శక్తిని అందరూ ఇంకా అనుభూతి చెందుతున్నారన్నారు. తానెప్పుడు ఈ సమావేశాలకు వచ్చినా.. దివ్యమైన, అసాధారణ అనుభవం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్వామి దయానందుడి ఆశీస్సుల వల్లే ఈ భావన ఎల్లవేళలా సాధ్యమవుతోందన్నారు. స్వామి దయానందుడి ఆదర్శాలు పూజనీయమైనవన్నారు. అక్కడున్న చింతనాపరులందరితో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధం వల్లే వారిలో ఒకరిగా ఉండే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కుతోందన్నారు. వారిని కలిసి, మాట్లాడినప్పుడల్లా.. ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని, తనలో ప్రేరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు.ముంబైలో జరిగిన మారిటైమ్ లీడర్స్ కాంక్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
October 29th, 04:09 pm
మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు సర్బానంద సోనోవాల్ జీ, శంతను ఠాకూర్ జీ, కీర్తి వర్ధన్ సింగ్ జీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే జీ, అజిత్ పవార్ జీ, షిప్పింగ్, ఇతర పరిశ్రమల నాయకులు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, పెద్దలు,PM Modi addresses Maritime Leaders Conclave at India Maritime Week 2025 in Mumbai
October 29th, 04:08 pm
In his address at the Maritime Leaders Conclave in Mumbai, PM Modi highlighted that MoUs worth lakhs of crores of rupees have been signed in the shipping sector. The PM stated that India has taken major steps towards next-gen reforms in the maritime sector this year. He highlighted Chhatrapati Shivaji Maharaj’s vision that the seas are not boundaries but gateways to opportunity, and stated that India is moving forward with the same thinking.'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
October 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.An RSS shakha is a ground of inspiration, where the journey from 'me' to 'we' begins: PM Modi
October 01st, 10:45 am
In his address at the centenary celebrations of the Rashtriya Swayamsevak Sangh (RSS), PM Modi extended his best wishes to the countless swayamsevaks dedicated to the resolve of national service. He announced that, to commemorate the occasion, the GoI has released a special postage stamp and a coin. Highlighting the RSS’ five transformative resolutions, the PM remarked that in times of calamity, swayamsevaks are among the first responders.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శత వార్షికోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 01st, 10:30 am
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శత వార్షికోత్సవాలు ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున మహా నవమి.. సిద్ధిధాత్రి అమ్మవారిని ఆరాధించేది ఈ రోజేనని ఆయన గుర్తు చేశారు. రేపు విజయదశమి మహా పర్వదినం.. ఈ పండుగ భారతీయ సంస్కృతిలో ఓ శాశ్వత జయఘోషకు సంకేతం.. అన్యాయంపై న్యాయం, అసత్యంపై సత్యం, చీకటిపై వెలుగు పైచేయిని సాధించిన సన్నివేశమని ఆయన అభివర్ణించారు. అంతటి పవిత్ర సందర్భంలో, వంద సంవత్సరాల కిందట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. ఇది యాదృచ్ఛిక ఘటన ఏమీ కాదని ఆయన ఉద్ఘాటించారు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించడమే.. దీనిలో భాగంగా ప్రతి యుగంలోనూ అప్పటి సవాళ్లను ఎదుర్కోవడానికి జాతీయ అంతశ్చేతన కొత్త కొత్త రూపాలను తీసుకొంటూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ యుగంలో, నిత్య జాతీయ చైతన్యం మూర్తీభవించిన ఓ ప్రతిరూపంగా సంఘ్ నిలుస్తోందని ఆయన తేల్చి చెప్పారు.జపాన్ ప్రధానితో కలిసి భారత ప్రధాని సంయుక్త పత్రికా ప్రకటన
August 29th, 03:59 pm
ఈ రోజు మా చర్చ ఫలప్రదంగా, ప్రయోజనకరంగా సాగింది. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా, శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా.. మన భాగస్వామ్యం ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కూడా చాలా ముఖ్యమైనదని మేమిద్దరం అంగీకరిస్తున్నాం.తెలంగాణ... కర్ణాటక... బీహార్... అస్సాం రాష్ట్రాల కోసం 3 మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు సహా గుజరాత్‌లోని కచ్‌లో దూర ప్రాంతాలను అనుసంధానించే ఒక రైలు మార్గానికి మంత్రిమండలి ఆమోదం
August 27th, 04:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తెలంగాణ సహా దేశంలోని 5 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.12,328 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి:గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 25th, 06:42 pm
ఈ రోజు మీరంతా నిజంగా ఓ అద్భుత వాతావరణాన్ని సృష్టించారు. నేను చాలాసార్లు అనుకుంటాను.. ఈ లక్షలాది ప్రజల ప్రేమాశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని! నేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చూడండీ.. ఓ చిన్న నరేంద్ర అక్కడ నిలబడి ఉన్నాడు!గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసి వాటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
August 25th, 06:15 pm
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. యావత్ దేశం ప్రస్తుతం గణేష్ ఉత్సవాల ఉత్సాహంలో మునిగిపోయిందన్నారు. గణపతి బప్పా ఆశీస్సులతో గుజరాత్ పురోగతికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శుభప్రదమైన ప్రారంభం జరిగిందని వ్యాఖ్యానించారు. పలు ప్రాజెక్టులను ప్రజల పాదాలకు అంకితం చేసే అవకాశం తనకు లభించిందన్న ప్రధానమంత్రి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.