ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగ పాఠం

December 17th, 12:25 pm

పురాతన విజ్ఞానమూ, ఆధునిక ఆకాంక్షలూ కలిగిన ఒక దేశపు హృదయం వంటి ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. మీ పార్లమెంటు పట్ల, మీ ప్రజల పట్ల, మీ ప్రజాస్వామ్య ప్రస్థానం పట్ల ప్రగాఢ గౌరవంతో నేను మీ వద్దకు వచ్చాను. 140 కోట్ల భారతీయుల తరఫున స్నేహం, సద్భావన, సౌభ్రాతృత్వంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఇథియోపియాలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని

December 17th, 12:12 pm

భారత ప్రజల తరఫున ఇథియోపియా చట్టసభ సభ్యులకు మైత్రి, సద్భావనాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించడం, ఇథియోపియాలోని సామాన్యులు- రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గర్వించేలా ఎదుగుతున్న మహిళలు, దేశ భవితను తీర్చిదిద్దుతున్న యువతతో ఈ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి మాట్లాడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ ఆఫ్ ఇథియోపియా నిషాన్’ను తనకు అందించిన ఇథియోపియా ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబంధాల ప్రాధాన్యం దృష్ట్యా.. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలు ఈ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

November 27th, 11:01 am

కేబినెట్‌లో నా సహచరుడు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ గారు, ఇన్-స్పేస్ చైర్మన్ శ్రీ పవన్ గోయెంకా గారు, స్కైరూట్ బృందం, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా...!

Prime Minister Shri Narendra Modi inaugurates Skyroot’s Infinity Campus in Hyderabad via video conferencing

November 27th, 11:00 am

PM Modi inaugurated Skyroot’s Infinity Campus in Hyderabad, extending his best wishes to the founders Pawan Kumar Chandana and Naga Bharath Daka. Lauding the Gen-Z generation, he remarked that they have taken full advantage of the space sector opened by the government. The PM highlighted that over the past decade, a new wave of startups has emerged across perse sectors and called upon everyone to make the 21st century the century of India.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి పదకొండేళ్లు…: ప్రధానమంత్రి

September 25th, 01:01 pm

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ 11వ వార్షికోత్సవం ఈ రోజు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థలో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఈ కార్యక్రమం గొప్ప మార్పును తీసుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 25th, 10:22 am

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు భూపేంద్ర చౌదరి గారు, పరిశ్రమకు చెందిన మిత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా,

గ్రేటర్ నోయిడాలో... ఉత్తర ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శననుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 25th, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ‘ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ప్రదర్శనకు హాజరైన వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రధాని హార్ధిక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉందని, కాలపరీక్షకు నిలిచి ఈ భాగస్వామ్యం బలోపేతమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ సహచరులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. చిట్టచివరి వ్యక్తులకూ అభివృద్ధిని అందించాలన్న అంత్యోదయ మార్గంలో దేశాన్ని నడిపించిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజే... ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. అంత్యోదయ అంటే అత్యంత నిరుపేదలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడమని, అన్ని రకాల వివక్షలూ తొలగిపోవడమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మిళిత అభివృద్ధి భావననే భారత్ నేడు ప్రపంచానికి అందిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

August 25th, 06:42 pm

ఈ రోజు మీరంతా నిజంగా ఓ అద్భుత వాతావరణాన్ని సృష్టించారు. నేను చాలాసార్లు అనుకుంటాను.. ఈ లక్షలాది ప్రజల ప్రేమాశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని! నేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చూడండీ.. ఓ చిన్న నరేంద్ర అక్కడ నిలబడి ఉన్నాడు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసి వాటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

August 25th, 06:15 pm

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. యావత్ దేశం ప్రస్తుతం గణేష్ ఉత్సవాల ఉత్సాహంలో మునిగిపోయిందన్నారు. గణపతి బప్పా ఆశీస్సులతో గుజరాత్ పురోగతికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శుభప్రదమైన ప్రారంభం జరిగిందని వ్యాఖ్యానించారు. పలు ప్రాజెక్టులను ప్రజల పాదాలకు అంకితం చేసే అవకాశం తనకు లభించిందన్న ప్రధానమంత్రి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో సెమీకండక్టర్ యూనిట్ కు మంత్రిమండలి ఆమోదం

May 14th, 03:06 pm

భారత్ సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా మరో సెమీకండక్టర్ యూనిటును ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది.

అనువాదం: 17వ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం

April 21st, 11:30 am

నా మంత్రివర్గ సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ శక్తికాంత దాస్ గారు, డాక్టర్ సోమనాథన్ గారు, ఇతర సీనియర్ అధికారులు, దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్‌కు చెందిన సహచరులు, మహిళలు, పెద్దలు.. !

17వ సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 21st, 11:00 am

ఈ రోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో 17వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్లనుద్దేశించి ప్రసంగించారు. ప్రజాపాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌)లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రి శ్రేష్ఠత అవార్డులను ప్రదానం చేశారు. స‌మావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ మోదీ, సివిల్ స‌ర్వీసెస్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంవ‌త్సరం రాజ్యాంగం 75వ సంవత్సరాల వేడుకలు, స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ 150వ జ‌యంతి ఉత్సవాల సంద‌ర్భంగా సివిల్ సర్వీసెస్ డే మరింత విశిష్ఠతను సంతరించుకుందన్నారు. అలనాడు 1947 ఏప్రిల్ 21న సర్దార్ పటేల్ చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, సర్దార్ సివిల్ సర్వెంట్లను ‘భారత దేశ ఉక్కు కవచం’గా అభివర్ణించారని గుర్తు చేశారు. పూర్తి అంకితభావంతో పని చేస్తూ, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే పాలనా యంత్రాంగాన్ని పటేల్ కోరుకున్నారని చెప్పారు. వికసిత్‌ భారత్‌ ఆశయ సాకారంలో సర్దార్ పటేల్ ఆదర్శాలు దారిదీపాలంటూ, పటేల్ దార్శనికత, వారసత్వానికి హృదయపూర్వక నివాళి అర్పించారు.

సాధికారత, పారిశ్రామిక స్ఫూర్తికి అండదండలందించిన 10 ఏళ్ళ ముద్ర యోజన: ప్రధానమంత్రి

April 08th, 09:43 pm

ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ ప్రస్థానం “సాధికారత, పారిశ్రామిక స్ఫూర్తి”కి సంబంధించిందని వ్యాఖ్యానించారు. సరైన సహకారం లభిస్తే భారతీయులు అద్భుతాలు సృష్టిస్తారన్నారు.

ముద్ర యోజన లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ

April 08th, 01:03 pm

ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పథకం లబ్ధిదారులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. న్యూఢిల్లీలోని 7, లోకకల్యాణ్ మార్గ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులను ఇంటికి ఆహ్వానించడంలో సాంస్కృతిక ప్రాధాన్యాన్ని, వారి రాక తీసుకొచ్చే పవిత్రత గురించి చెబుతూ ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. తమ అనుభవాలను పంచుకోవాలని వారిని కోరారు. పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, ఔషధాలు, సేవలు అందించే వ్యాపారితో శ్రీ మోదీ సంభాషించారు. ఈ సందర్భంగా కష్ట సమయాల్లో తమ సామర్థ్యాన్ని నమ్మిన వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం గురించి ప్రధాని వివరించారు. తమకు రుణం మంజూరు చేసిన బ్యాంకు అధికారులను ఆహ్వానించి.. తమ ప్రగతిని వారికి చూపించాలని సూచించారు. ఇలాంటి చర్యలు కలలను నిజం చేసుకోవాలనుకొనే వారికి తోడ్పాటును అందించాలనే అధికారుల నిర్ణయానికి మరింత విశ్వాసాన్ని జోడిస్తాయని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా లబ్ధిదారులు సాధించిన వృద్ధిని, విజయాన్ని చూసి వారు గర్వపడతారని మోదీ అన్నారు.

ఎంఎస్ఎంఈ రంగంపై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్లు మూడింటిని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

March 04th, 01:00 pm

క్యాబినెట్ సహచరులు, ఆర్థిక వ్యవహారాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సోదర సోదరీమణులారా!

బడ్జెట్ అనంతర వెబినార్లనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 04th, 12:30 pm

బడ్జెట్ అనంతర వెబినార్లనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వృద్ధి చోదకాలుగా ఎంఎస్ఎంఈలు, తయారీ, ఎగుమతులు, అణు ఇంధన కార్యక్రమాలు, నియంత్రణ, పెట్టుబడి, సులభతర వాణిజ్య సంస్కరణలు అన్న అంశాలపై వెబినార్లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ, ఎగుమతులపై బడ్జెట్ అనంతర వెబినార్లకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ అని చెప్తూ, అంచనాలను మించి విస్తరించడం ఇందులోని ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. అనేక రంగాల్లో నిపుణులు ఊహించిన దానికి మించి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ బడ్జెట్ లో తయారీ, ఎగుమతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

Important to maintain the authenticity of handloom craftsmanship in the age of technology: PM at Bharat Tex

February 16th, 04:15 pm

PM Modi, while addressing Bharat Tex 2025 at Bharat Mandapam, highlighted India’s rich textile heritage and its growing global presence. With participation from 120+ countries, he emphasized innovation, sustainability, and investment in the sector. He urged startups to explore new opportunities, promoted skill development, and stressed the fusion of tradition with modern fashion to drive the industry forward.

భారత్ టెక్స్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం

February 16th, 04:00 pm

న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ‘భారత్ టెక్స్ 2025’ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను కూడా ఆయన పరిశీలించారు. సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరికీ భారత్ టెక్స్‌కు ఆహ్వానం పలుకుతున్నానన్నారు. ఈ రోజు భారత్ మండపంలో భారత్ టెక్స్ రెండో సంచికను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మా దేశ సంప్రదాయాలను కళ్లకు కట్టడంతోపాటు వికసిత్ భారత్ సాధనకు ఉన్న అవకాశాలను కూడా చాటుతోందని, ఇది ఇండియాకు గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ‘‘భారత్ టెక్స్ ఇక మెగా గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్‌గా ఎదుగుతోంది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు. వేల్యూ చైన్‌లో పాత్రధారులైన మొత్తం 12 సముదాయాలు ఈసారి ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నాయని కూడా ఆయన తెలిపారు. దుస్తులు, అనుబంధ వస్తువులు (ఏక్సెసరీస్), యంత్ర పరికరాలు, రసాయనాలు, అద్దకం రంగులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్న సంగతిని ఆయన ప్రస్తావించారు. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన విధాన రూపకర్తలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓలు), పరిశ్రమ నేతలకు వ్యాపారానికి, సహకారానికి, భాగస్వామ్యాల్ని ఏర్పరచుకోవడానికి ఒక బలమైన వేదికగా భారత్ టెక్స్ మారుతోందని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పాటును అందిస్తున్న ఆసక్తిదారులందరి కృషిని ఆయన ప్రశంసించారు.

సంగీతకారిణి చంద్రిక టండన్‌కు గ్రామీ పురస్కారం.. ప్రధానమంత్రి అభినందనలు

February 03rd, 02:32 pm

‘త్రివేణి’ ఆల్బమ్‌కు గ్రామీ పురస్కారాన్ని గెలుచుకొన్న సంగీతకారిణి చంద్రిక టండన్‌‌ను ప్రధానమంత్రి అభినందించారు. భారతీయ సంస్కృతి అంటే ఆమెకున్న మక్కువతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా, దాతగా, సంగీతకారిణిగా ఆమె సాధించిన ఘనతలకు ప్రధాని ఆమెపై ప్రశంసలు కురిపించారు.

కృత్రిమ మేధ రంగంలో నాయకత్వం వహించడానికి భారత్ కంకణం కట్టుకొంది: ప్రధానమంత్రి

January 04th, 02:42 pm

భారతదేశ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఒకరైన శ్రీ విశాల్ సిక్కా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకొన్నారు. ఈ సమావేశం చక్కని ఆలోచనల్ని ఒకరికొకరు తెలియజెప్పుకోవడానికి వేదికైందంటూ శ్రీ మోదీ అభివర్ణించారు. కృత్రిమ మేధ (ఆల్టర్నేటివ్ ఇంటెలిజెన్స్.. ఏఐ) రంగంలో నాయకత్వ పాత్రను పోషించడానికి భారత్ కట్టుబడి ఉందనీ, ఈ క్రమంలో నవకల్పన (ఇన్నొవేషన్)పైనా, యువతకు అవకాశాలను అందించడంపైనా దృష్టిని కేంద్రీకరిస్తోందనీ ఆయన అన్నారు. ఏఐని గురించీ, భారత్‌పై ఏఐ చూపే ప్రభావాన్ని గురించీ, రాబోయే కాలంలో చేపట్టాల్సిన పనులను గురించీ ఇరువురూ విస్తృతంగా చర్చించారు.