మే 23న న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న ప్రధాని
May 22nd, 04:13 pm
రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సును న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 23న ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అవకాశాల నిలయంగా ఈశాన్య ప్రాంత సామర్థ్యాన్ని ప్రదర్శించి, అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడం, కీలకమైన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలను ఒకే వేదిక మీదకు తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యం.ఏబీపీ నెట్వర్క్ ఇండియా@2047 సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
May 06th, 08:04 pm
ఈరోజు పొద్దున్న నుంచీ భారత్ మండపం ఒక శక్తిమంతమైన వేదికగా మారింది. కొద్ది నిమిషాల క్రితం మీ బృందాన్ని కలిసే అవకాశం నాకు లభించింది. ఈ సదస్సు పూర్తి వైవిధ్యంతో కూడినది. ఇక్కడ హాజరైన చాలా మంది ప్రముఖులు ఈ సదస్సుకు నిండుదనం తెచ్చారు. మీ అనుభవం కూడా చాలా విలువైనదని నేను నమ్ముతున్నా. ఈ సదస్సులో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక విధమైన ప్రత్యేకత సంతరించుకుంది. ముఖ్యంగా మన డ్రోన్ దీదీలు, లఖ్పతి దీదీలు ఉత్సాహంగా తమ అనుభవాలను పంచుకోవడాన్ని నేను ఇప్పుడే ఈ వ్యాఖ్యాతలందరినీ కలిసినప్పుడు చూడగలిగాను. వారు తమ ప్రతి మాటా గుర్తుంచుకున్నారు. ఇది నిజంగా స్ఫూర్తిదాయకమైన సందర్భం.Prime Minister Shri Narendra Modi addresses ABP Network India@2047 Summit
May 06th, 08:00 pm
PM Modi, at the ABP News India@2047 Summit in Bharat Mandapam, hailed India's bold strides towards becoming a developed nation. Applauding the inspiring journeys of Drone Didis and Lakhpati Didis, he spotlighted key reforms, global trade pacts, and the transformative impact of DBT—underscoring his government's unwavering commitment to Nation First.రోజ్ గార్ మేళా కింద 51,000 పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 26th, 11:23 am
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 51,000 మందికి పైగా యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను ఈరోజు జారీ చేశాం. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో మీ యువతకు బాధ్యతల కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం మీ కర్తవ్యం. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మీ కర్తవ్యం. కార్మికుల జీవితాల్లో మెరుగైన మార్పులు తేవడం మీ కర్తవ్యం. మీరు మీ విధులను ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ ప్రయాణంపై దాని ప్రభావం మరింత గణనీయంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారని నేను విశ్వసిస్తున్నాను.ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 26th, 11:00 am
ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన వారికి 51,000కి పైగా నియామక పత్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించారు. భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో యువతకు కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్గత భద్రతను పెంపొందించటం, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడటం, కార్మికుల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు తీసుకురావడం వీరి బాధ్యతలని పేర్కొన్నారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో చూపించే చిత్తశుద్ధి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రధానంగా పేర్కొన్నారు. విధుల నిర్వహించే విషయంలో ఈ యువత అత్యంత అంకితభావంతో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రధానమంత్రి అధ్యక్షతన వేవ్స్ సలహాదారుల మండలి విస్తృత స్థాయి సమావేశం.. వినోదం, సృజనాత్మకత, సంస్కృతి.. ఈ రంగాల ప్రముఖుల్ని ఒక చోటుకు తీసుకొచ్చిన ప్రపంచ శ్రేణి శిఖరాగ్ర సమావేశమిది
February 07th, 11:41 pm
వేవ్స్ (WAVES) సలహాదారుల మండలి విస్తృత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య ప్రధాన సమావేశ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు. వేవ్స్ ఒక ప్రపంచ శ్రేణి శిఖరాగ్ర సమావేశం. ఇది వినోదం, సృజనాత్మకత, సంస్కృతి.. ఈ రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఒక చోటుకు చేర్చింది.