చండీగఢ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 17th, 02:08 pm
చండీగఢ్ అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు. అది దేశ ప్రగతికి ఒక అద్భుతమైన నమూనా. క్రమబద్ధమైన అభివృద్ధి, మెరుగైన జీవన విధానం, సులభతర జీవనానికి ఈ నగరం పేరుగాంచింది. ఇక్కడి అత్యుత్తమ వైద్య సదుపాయాలు, అన్నింటికంటే ముఖ్యంగా చండీ మాత ఆశీస్సులు ఈ నగరానికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. అందుకే చండీగఢ్ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ అగ్ర ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, దాదాపు ఏడాదిన్నర క్రితం మన దేశ న్యాయ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణను తీసుకువచ్చాం. కేవలం శిక్షించడమే లక్ష్యంగా ఉన్న పాత శిక్షాస్మృతి స్థానంలో, న్యాయం అందించడమే పరమావధిగా ఉండే భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టాం. ఈ చారిత్రక చట్టాల అమలు ప్రక్రియను మన చండీగఢ్ నుంచే ప్రారంభించడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది.చండీగఢ్‌లో ఆరోగ్య సంరక్షణ.. విద్య.. రహదారి మౌలిక సదుపాయాలు సహా ₹4,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 17th, 01:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్‌లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలు సహా ₹4,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. క్రమబద్ధ జాతీయ ప్రగతికి ఈ నగరం ఒక ఆదర్శప్రాయ నమూనాగా నిలుస్తున్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. దేశంలో దీనికిగల ప్రత్యేక స్థానాన్ని ప్రస్తావిస్తూనే- మెరుగైన జీవనశైలితో పాటు జీవన సౌలభ్య కల్పనలో నగరానికిగల ప్రాచుర్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంపై చండీమాత కృప మెండుగా ఉందంటూ- దీని నిరంతర, వ్యవస్థీకృత ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “ప్రస్తుత ప్రభుత్వం చండీగఢ్ ప్రగతికి సదా అగ్ర ప్రాధాన్యం ఇస్తోంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.హర్యానాలోని జింద్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 17th, 12:00 pm
హర్యానా గవర్నర్ శ్రీ అసిమ్ ఘోష్ గారు... అత్యంత ప్రజాదరణ కలిగిన, ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ గారు... కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు... హాజరైన ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలకు, సాంకేతిక మాధ్యామాల ద్వారా అనేక ప్రదేశాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన హర్యానాలోని నా ప్రియమైన సోదరీ సోదరులందరికీ నమస్కారం!హర్యానాలోని జింద్‌లో సుమారు రూ.14,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 17th, 11:30 am
హర్యానాలోని జింద్‌లో సుమారు రూ.14,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు, జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతానికి రావడం పట్ల ప్రధానమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శక్తి పీఠం మాతా జయంతి ఆశీస్సులు పొందిన ఈ ప్రాంతానికి ఉన్న గొప్ప చారిత్రక, సైనిక, ఆధ్యాత్మిక వారసత్వం గురించి వివరించారు. దశాబ్దాల క్రితం సంస్థాగత కార్యక్రమాల నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు లభించిన ఆప్యాయతను, ముర్రా గేదె పాలు, దేశీ బురా, ఘేవార్ లాంటి స్థానిక వంటకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఇది సాధారణ ప్రదేశం కాదు. ఇది చరిత్ర, ధైర్యం, మతం, అపారమైన గర్వానికి ప్రతీకగా నిలిచే భూమి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకల త్రివిధ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
June 21st, 12:51 pm
ఈ రోజు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. యావత్ ప్రపంచమూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఇలాంటి విశిష్ట సందర్భంలో పవిత్ర బెంగాల్ భూమికి వచ్చే అవకాశం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. భారత దేశ ఆలోచనలకు కొత్త దిశను అందించిన, భారత దేశ పునరుజ్జీవాన్ని వేగవంతం చేసిన, సముద్ర మార్గాల ద్వారా శతాబ్దాలుగా దేశాన్ని ప్రపంచంతో అనుసంధానించిన భూమి ఇది. ఈ రోజు ఇదే మట్టిపై ఆత్మనిర్భర్ భారత్, సురక్షిత భారత్, వికసిత భారత్ లక్ష్యాలతో ముడిపడి ఉన్న ఓ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. కొంతసేపటి క్రితమే ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టాం. జూన్ 21ని ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవంగా నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. అదే రోజున భారతదేశపు అత్యంత అధునాతన హైడ్రోగ్రఫీ నౌక ఐఎన్ఎస్ సంశోధక్‌ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం కాకతాళీయం. ఈ సందర్భంగా భారత నౌకాదళానికి, ఈ ప్రాజెక్టులకు పనిచేసిన శాస్త్రవేత్తలకూ, ఇంజనీర్లకూ, కార్మికులకూ, నా ప్రియమైన దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రే యుద్ధ నౌకలను నావికాదళంలోకి ప్రవేశపెట్టిన ప్రధాని
June 21st, 12:50 pm
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించిన మూడు యుద్ధనౌకలను అధికారికంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. వీటిలో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ 'ఐఎన్ఎస్ దూనగిరి', పెద్ద సర్వే నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్’, జలాంతర్గామి నిరోధక నౌక 'ఐఎన్ఎస్ అగ్రే'లు ఉన్నాయి. ఈ నౌకల చేరిక భారత కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచడమే కాకుండా సముద్రాలపై నిఘాను బలోపేతం చేస్తుంది. అలాగే భౌగోళిక రాజకీయ ముప్పుల నుంచి మన తీరప్రాంత జలాలకు రక్షణను మరింత పటిష్ఠం చేస్తుంది. ఈ మూడు నౌకలను భారత నావికాదళానికి చెందిన 'వార్‌షిప్ డిజైన్ బ్యూరో' రూపొందించగా కోల్‌కతాలోని 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్' (జీఆర్ఎస్‌ఈ) సంస్థ నిర్మించింది. వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్ఎంఈలతో కూడిన భారతీయ పరిశ్రమలు విస్తృతంగా భాగస్వామ్యమయ్యాయి. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం లేదా పరికరాలను కలిగి ఉన్న ఈ నౌకలు 'ఆత్మనిర్భరత' పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.నౌకానిర్మాణం, షిప్పింగ్, నౌకా రవాణాపై భాగస్వామ్యానికి భారత్-ఆర్‌వోకే సమగ్ర విధానం
April 20th, 10:51 pm
భారత్‌లో అధికారిక పర్యటన సందర్భంగా కొరియా రిపబ్లిక్ (ఆర్‌వోకే) అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యుంగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో 2026 ఏప్రిల్ 20న సమావేశమయ్యారు. ఈ చర్చల్లో నౌకా నిర్మాణం, షిప్పింగు, నౌకా రవాణా భాగస్వామ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారంపై ఉభయపక్షాలు ఫలవంతమైన, విస్తృతమైన ఆలోచనలను పంచుకున్నాయి.Prime Minister congratulates scientists and engineers as Prototype Fast Breeder Reactor at Kalpakkam attains criticality
April 06th, 10:14 pm
The Prime Minister, Shri Narendra Modi, today congratulated India’s scientists and engineers on the successful attainment of criticality of the indigenously developed Prototype Fast Breeder Reactor (PFBR) at Kalpakkam.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
November 27th, 11:01 am
కేబినెట్‌లో నా సహచరుడు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ గారు, ఇన్-స్పేస్ చైర్మన్ శ్రీ పవన్ గోయెంకా గారు, స్కైరూట్ బృందం, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా...!Prime Minister Shri Narendra Modi inaugurates Skyroot’s Infinity Campus in Hyderabad via video conferencing
November 27th, 11:00 am
PM Modi inaugurated Skyroot’s Infinity Campus in Hyderabad, extending his best wishes to the founders Pawan Kumar Chandana and Naga Bharath Daka. Lauding the Gen-Z generation, he remarked that they have taken full advantage of the space sector opened by the government. The PM highlighted that over the past decade, a new wave of startups has emerged across perse sectors and called upon everyone to make the 21st century the century of India.గుజరాత్‌లోని సూరత్ లో భారత బుల్లెట్ రైలు ప్రాజెక్టు బృందంతో ప్రధానమంత్రి సంభాషణ
November 16th, 03:50 pm
మీరేమనుకుంటున్నారు? ఈ వేగం ఫర్వాలేదా? మీరు నిర్దేశించుకున్న టైమ్ టేబుల్ ప్రకారమే పనిచేస్తున్నారా, లేక ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?నిర్మాణంలో ఉన్న... సూరత్ బుల్లెట్ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 16th, 03:47 pm
గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న సందర్శించారు. ముంబయి–అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ పురోగతిని ఆయన సమీక్షించారు. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ బృందంతో మాట్లాడిన ఆయన… నిర్మాణ వేగం, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే విషయంలో పురోగతితో పాటు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్ట్ సజావుగా ముందుకు సాగుతోందని ప్రాజెక్ట్ నిర్మాణ సిబ్బంది ఆయనకు తెలిపారు.డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ ఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 09th, 01:00 pm
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, శాసనసభ స్పీకర్ సోదరి శ్రీ రీతూ, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అజయ్ టమ్టా, రాష్ట్ర మంత్రులు, వేదికను అలంకరించిన ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గౌరవనీయ సాధు జనులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 09th, 12:30 pm
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పుస్కరించుకొని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు, హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.ముంబయి నగరంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 08th, 03:44 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ప్రజాదరణ గల ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ రాందాస్ అథవాలే, శ్రీ కె.ఆర్.నాయుడు, శ్రీ మురళీధర్ మొహోల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ఇతర మంత్రులు, భారత్‌లో జపాన్ రాయబారి శ్రీ కెయిచీ ఓనో, ఇతర ప్రముఖ అతిథులు, సోదరీసోదరులారా!నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
October 08th, 03:30 pm
నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. మహారాష్ట్రలోని ముంబయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులనూ ప్రారంభించిన ఆయన వాటిని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి హజారైన ప్రముఖులందరినీ స్వాగతిస్తూ.. వారందరికీ శ్రీ మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన విజయదశమి, కోజాగరి పూర్ణిమ వేడుకలను ఆయన గుర్తు చేసుకున్నారు. రాబోయే దీపావళి పండగ సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.ఒడిశాలోని ఝార్సుగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 27th, 11:45 am
ఇక్కడి కొంతమంది యువ మిత్రులు అనేక కళాకృతులను తీసుకువచ్చారు. ఒడిశాకు కళ పట్ల ఉన్న ప్రేమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మీ అందరి నుంచి నేను ఈ కానుకలను స్వీకరిస్తాను.. ఈ కానుకలన్నీ మీ నుంచి సేకరించమని నా ఎస్‌పీజీ సహచరులను నేను అభ్యర్థిస్తున్నాను. మీరు మీ పేరు, చిరునామాను వెనుక రాసి ఇస్తే మీకు కచ్చితంగా నా నుంచి ఒక లేఖ వస్తుంది. అక్కడ వెనకాల ఒక అబ్బాయి చాలాసేపు ఏదో పట్టుకుని ఉన్నట్లు నేను చూస్తున్నాను. అతని చేతులు నొప్పి పెట్టవచ్చు.. దయచేసి అతనికి సహాయం చేసి దానిని కూడా సేకరించండి. వెనక మీ పేరు, చిరునామా రాసి ఉంటే, నేను కచ్చితంగా మీకు లేఖ రాస్తాను. ఈ కళాకృతులను తయారు చేసినందుకు.. మీ అభిమానానికీ.. యువతీయువకులకు, చిన్న పిల్లలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 27th, 11:30 am
ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత నవరాత్రి పండగ రోజుల్లో మాతా సమలేయ్, మాతా రామచండీలు కొలువైన పవిత్ర భూమిని సందర్శించి.. ఇక్కడి ప్రజలను కలిసే అదృష్టం తనకు లభించిందని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, ఆడపడుచులు పాల్గొనడం ఆనందంగా ఉందన్న ప్రధానమంత్రి.. వారి ఆశీర్వాదాలే నిజమైన బలమన్నారు. ప్రజలకు వందనాలు తెలిపిన ఆయన.. అందరికీ శుభాకాంక్షలూ తెలిపారు.బీహార్‌లోని పూర్ణియాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం.. శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
September 15th, 04:30 pm
గౌరవనీయులైన గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, విశేష ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, వేదికపై ఆసీనులైన ఇతర ప్రముఖులతోపాటు సభకు హాజరైన నా ప్రియతమ సోదరీసోదరులారా!బీహార్‌లోని పూర్ణియాలో దాదాపు 40,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి
September 15th, 04:00 pm
బీహార్‌లోని పూర్ణియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దాదాపు రూ.40,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూర్ణియా ప్రాంతం మాతా పురాణ్ దేవి, భక్త ప్రహ్లాదుడు, మహర్షి మెహిబాబాల ఫుణ్యభూమి అని వ్యాఖ్యానించారు. ఈ నేల ఫణీశ్వరనాథ్ రేణు, సతీనాథ్ బాధురి వంటి సాహిత్య దిగ్గజాలకు జన్మనిచ్చిందన్నారు. ఈ ప్రాంతాన్ని వినోబా భావే వంటి అంకితభావంతో పనిచేసిన కర్మయోగుల భూమిగా అభివర్ణించారు. ఈ భూమి పట్ల తనకున్న ప్రగాఢమైన భక్తిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.