79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగం: 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా దార్శనికత

August 15th, 11:58 am

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి 103 నిమిషాల పాటు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి శ్రీ మోదీ చేసిన ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా ఆయన కీలక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యంతో సాహసోపేతమైన ప్రణాళికను ఇచ్చారు. స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి పెట్టిన ప్రధాని.. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.

ఏబీపీ నెట్వర్క్ ఇండియా@2047 సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

May 06th, 08:04 pm

ఈరోజు పొద్దున్న నుంచీ భారత్ మండపం ఒక శక్తిమంతమైన వేదికగా మారింది. కొద్ది నిమిషాల క్రితం మీ బృందాన్ని కలిసే అవకాశం నాకు లభించింది. ఈ సదస్సు పూర్తి వైవిధ్యంతో కూడినది. ఇక్కడ హాజరైన చాలా మంది ప్రముఖులు ఈ సదస్సుకు నిండుదనం తెచ్చారు. మీ అనుభవం కూడా చాలా విలువైనదని నేను నమ్ముతున్నా. ఈ సదస్సులో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక విధమైన ప్రత్యేకత సంతరించుకుంది. ముఖ్యంగా మన డ్రోన్ దీదీలు, లఖ్పతి దీదీలు ఉత్సాహంగా తమ అనుభవాలను పంచుకోవడాన్ని నేను ఇప్పుడే ఈ వ్యాఖ్యాతలందరినీ కలిసినప్పుడు చూడగలిగాను. వారు తమ ప్రతి మాటా గుర్తుంచుకున్నారు. ఇది నిజంగా స్ఫూర్తిదాయకమైన సందర్భం.

Prime Minister Shri Narendra Modi addresses ABP Network India@2047 Summit

May 06th, 08:00 pm

PM Modi, at the ABP News India@2047 Summit in Bharat Mandapam, hailed India's bold strides towards becoming a developed nation. Applauding the inspiring journeys of Drone Didis and Lakhpati Didis, he spotlighted key reforms, global trade pacts, and the transformative impact of DBT—underscoring his government's unwavering commitment to Nation First.

యువ సాధికారత దిశగా మున్ముందుకు... క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ సూచీ వాస్తవాలను వెల్లడించింది: ప్రధాని

January 16th, 06:00 pm

క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ సూచీలో కెనడా, జర్మనీల కన్నా ముందంజలో నిలిచి రెండో ర్యాంకును భారత్ సొంతం చేసుకోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘ఇదెంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. దశాబ్ద కాలంగా యువతను నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం ద్వారా వారిని శక్తిమంతులుగా మలచడానికి మా ప్రభుత్వం కృషిచేసింది. ఫలితంగా వారు స్వావలంబన సాధించి సంపదను సృష్టించేలా ఎదిగారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. శ్రేయస్సు, యువత సాధికారత దిశగా మనం మరింతగా ముందుకు సాగుతున్న తరుణంలో క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ సూచీ వెల్లడించిన అంశాలు ఎంతో విలువైనవని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు.

75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల అంకితం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

October 16th, 03:31 pm

75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించిన సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు దేశం మరోసారి డిజిటల్ ఇండియా సామర్థ్యాన్ని చూస్తోంది. నేడు దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు రానున్నాయి. ఈ మిషన్‌తో సంబంధం కలిగిన వ్యక్తులందరికీ, మన బ్యాంకింగ్ రంగంతో పాటు ఆర్. బి. ఐ ని నేను అభినందిస్తున్నాను.

75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

October 16th, 10:57 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల (డీబీయూ)ను వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా జాతికి అంకితం చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఈ 75 డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్లు ఆర్థిక సార్వజనీనతను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు పౌరుల‌ బ్యాంకింగ్ అనుభ‌వాన్ని ఇనుమడింపజేస్తాయని నొక్కిచెప్పారు. “సామాన్యులకు జీవన సౌలభ్యం దిశగా ‘డీబీయూ’ ఒక పెద్ద ముందడుగు” అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో కనీస మౌలిక సదుపాయాలతో గరిష్ఠ సేవలు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఈ సేవలన్నీ ఎలాంటి పత్రాలతో ప్రమేయం లేకుండా డిజిటల్‌ విధానంలో అందుతాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇది బలమైన, సురక్షిత బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేయడంసహా బ్యాంకింగ్ విధానాన్ని కూడా సులభతరం చేస్తుందని చెప్పారు. “చిన్న పట్టణాలు, గ్రామాల్లో నివసించే వారు కూడా నగదు బదిలీ చేయడం నుంచి రుణాలు పొందడం దాకా అనేక ప్రయోజనాలు పొందగలరు. దేశంలోని సామాన్యుల జీవితాన్ని సులభతరం చేసేదిశగా దేశంలో కొనసాగిస్తున్న ప్రయాణంలో ఇది మరో పెద్ద ముందడుగు” అని ఆయన అన్నారు.

Eight years of BJP dedicated to welfare of poor, social security: PM Modi

May 21st, 02:29 pm

Prime Minister Narendra Modi today addressed the BJP National Office Bearers in Jaipur through video conferencing. PM Modi started his address by recognising the contribution of all members of the BJP, from Founders to Pathfinders and to the Karyakartas in strengthening the party.

జైపూర్‌లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ

May 20th, 10:00 am

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జైపూర్‌లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పార్టీని బలోపేతం చేయడంలో స్థాపకుల నుండి పాత్‌ఫైండర్ల వరకు మరియు కార్యకర్తల వరకు బిజెపి సభ్యులందరి సహకారాన్ని గుర్తించడం ద్వారా ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

విద్య మరియు నైపుణ్య రంగం పై కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మక ప్రభావం పై ఏర్పాటైనవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 21st, 11:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విద్య మరియు నైపుణ్యం రంగాల పై కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మకమైనటువంటి ప్రభావం అనే అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత కేంద్ర మంత్రులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు పరిశోధన రంగాల కు చెందిన కీలక స్టేక్ హోల్డర్స్ కూడా పాల్గొన్నారు. బడ్జెటు కు ముందు, బడ్జెటు కు తరువాత బడ్జెటు తో సంబంధమున్న అన్ని వర్గాల తో మాట్లాడడడం మరియు చర్చించడం అనే ఒక కొత్త అభ్యాసం లో ఈ వెబినార్ ఒక భాగం గా ఉంది.

చట్టం యొక్క నియమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టడం అనేది యుపి ప్రజలు పథకాల ప్రయోజనాలను పొందుతున్నారని నిర్ధారిస్తుంది: ప్రధాని

July 15th, 11:01 am

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పునాదిరాయిని ప్రారంభించి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనేక ప్రాజెక్టులు పురాతన నగరమైన కాశీని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూనే, దాని సారాన్ని భద్రంగా ఉంచుతున్నాయని ప్రధాని చెప్పారు.

వారాణ‌సీ లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; మ‌రికొన్ని అభివృద్ధి ప‌థ‌కాలకు ఆయన శంకుస్థాప‌న చేశారు

July 15th, 11:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సుమారు 744 కోట్ల రూపాయ‌లు విలువ చేసే వివిధ అభివృద్ధి ప‌థ‌కాల ను వారాణ‌సీ లో ప్రారంభించారు. మ‌రికొన్ని అభివృద్ధి ప‌థ‌కాల కు ఆయ‌న శంకుస్థాప‌న లు కూడా చేశారు. ఈ పథకాల లో బిహెచ్‌యు లో 100 పడక ల ఎమ్‌సిహెచ్‌ విభాగం, గొదౌలియా లో వాహ‌నాల నిలుపుద‌ల కు ఉద్దేశించిన బహుళ తలాల స‌దుపాయం, గంగా నది ప్రాంతం లో ప‌ర్య‌ట‌న‌ అభివృద్ధి కి రొ-రొ వెసల్స్ తో పాటు వారాణసీ గాజీపుర్ రాజమార్గం లో మూడు దోవ లతో కూడిన‌ ఫ్లైఓవర్ బ్రిడ్జి స‌హా వేరు వేరు ప‌బ్లిక్ పథకాలు, పనులు ఉన్నాయి.

‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్ధిదారుల‌ తో జులై 1న మాట్లాడ‌నున్న ప్ర‌ధాన మంత్రి

June 29th, 07:09 pm

‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్ధిదారుల‌ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జులై 1న ఉద‌యం 11 గంట‌ల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించ‌నున్నారు.

క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటి ర్యాంకింగ్స్ 2022 లో అగ్రగామి-200 స్థానాల ను దక్కించుకొన్నందుకు గాను ఐఐటి బాంబే, ఐఐటి దిల్లీ, ఐఐఎస్ సి బెంగళూరు లను అభినందించిన ప్ర‌ధాన మంత్రి

June 09th, 08:33 pm

క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటి ర్యాంకింగ్స్ 2022 లో అగ్రగామి-200 స్థానాల ను దక్కించుకొన్నందుకు గాను ఐఐటి బాంబే కు, ఐఐటి దిల్లీ కి, ఐఐఎస్ సి బెంగళూరు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

‘పీఎం కేర్స్’ద్వారా బాలలకు సాధికారత- ‘కోవిడ్ బాధిత బాలలకు మద్దతు/సాధికారత కల్పన’ కార్యక్రమానికి శ్రీకారం

May 29th, 06:03 pm

దేశవ్యాప్తంగా కోవిడ్-19వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు మద్దతివ్వడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, వాటిగురించి వివరించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధ్యక్షతన ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు.

శ్రీ మ‌న్న‌థు ప‌ద్మ‌నాభ‌న్ జీ వ‌ర్థంతి సంద‌ర్భం లో ఆయ‌న కు న‌మ‌స్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

February 25th, 10:57 am

శ్రీ మ‌న్న‌థు ప‌ద్మ‌నాభ‌న్ జీ వ‌ర్థంతి సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న కు న‌మ‌స్సులు అర్పించారు.

అస్సాంపోరాటంలో అమ‌రులైన వారికి స్వాహిద్ దివ‌స్‌సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి

December 10th, 07:39 pm

అస్సాంపోరాటంలో అమ‌రులైన వారికి స్వాహిద్ దివ‌స్‌సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు.

గ్రాండ్ చాలెంజెస్ వార్షిక స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి కీల‌కోప‌న్యాసం

October 19th, 08:31 pm

మెలిందా, బిల్ గేట్స్, నా కేబినెట్ స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, ప్ర‌పంచ‌దేశాల ప్ర‌తినిధులు, శాస్త్రవేత్త‌లు, ఇన్నోవేట‌ర్లు, విద్యార్థులు, మిత్రులారా,

“గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం-2020” లో కీలకోపన్యాసం చేసిన – ప్రధానమంత్రి మోదీ

October 19th, 08:30 pm

జనాభా అధికంగా ఉన్నప్పటికీ, ప్రజల నడవడిక కారణంగా, భారతదేశంలో కోవిడ్-19 మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, ప్రధానమంత్రి చెప్పారు. ఆయన మాట్లాడుతూ, రోజువారీ కేసుల సంఖ్య ఈరోజు తగ్గిందనీ, కేసుల వృద్ధి రేటు క్షీణించిందనీ, అదేవిధంగా, ఈ రోజు రికవరీ రేటు అత్యధికంగా 88 శాతం గా నమోదయ్యిందనీ తెలియజేశారు. అనువైన లాక్ డౌన్ ను ముందుగా అమలు చేసిన దేశాల్లో భారతదేశం ఒకటనీ, మాస్కుల వాడకాన్ని ముందుగా ప్రోత్సహించిన దేశాలలో భారతదేశం ఒకటనీ, మన దేశం సమర్థవంతమైన గుర్తింపు ప్రక్రియను ముందుగా ప్రారంభించడంతో పాటు, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను మన దేశం ముందుగా చేపట్టడంతో ఇది సాధ్యమయ్యిందని, ఆయన వివరించారు.

బ్యాంకులు మరియు ఎన్ బిఎఫ్ సిల యొక్క స్టేక్ హోల్డర్స్ తో మేధోమథన సమావేశం లో పాల్గొననున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 28th, 05:47 pm

భవిష్యత్తు లో ఆచరణ కు ఉద్దేశించినటువంటి ఒక మార్గ సూచి ని గురించి మరియు సంబంధిత దృష్టికోణం గురించి ఉన్నత స్థాయి లో చర్చించడం కోసం బ్యాంకుల కు, ఇంకా ఎన్ బిఎఫ్ సి లకు చెందిన స్టేక్ హోల్డర్స్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న సాయంత్రం పూట చర్చ లు జరపనున్నారు.

Government committed to ensuring justice for everyone: PM Modi

February 29th, 11:31 am

In the biggest ever “Samajik Adhikarta Shivir”, the Prime Minister Shri Narendra Modi today distributed Assistive Aids and Devices to nearly 27,000 Senior Citizens & Divyangjan at a mega distribution camp at Prayagraj, Uttar Pradesh.