The days of TMC’s hooliganism are coming to an end: PM Modi in Kolkata, West Bengal

March 14th, 03:30 pm

Addressing a massive public meeting at the historic Brigade Parade Ground in Kolkata, Prime Minister Narendra Modi said, “This historic land of Bengal, this historic ground of Brigade Parade and this sea of people reflect the enthusiasm and spirit of the people. If anyone wants to know what Bengal is thinking and what lies in the hearts of its people, they should just look at these scenes.” He also gave a clarion call from Brigade Ground, “Paltano Dorkaar, Chai BJP Sorkaar.”

PM Modi’s fiery speech electrifies the crowd in Kolkata

March 14th, 03:00 pm

Addressing a massive public meeting at the historic Brigade Parade Ground in Kolkata, Prime Minister Narendra Modi said, “This historic land of Bengal, this historic ground of Brigade Parade and this sea of people reflect the enthusiasm and spirit of the people. If anyone wants to know what Bengal is thinking and what lies in the hearts of its people, they should just look at these scenes.” He also gave a clarion call from Brigade Ground, “Paltano Dorkaar, Chai BJP Sorkaar.”

The development of Delhi is linked to the image of the entire country: PM Modi

March 08th, 03:54 pm

PM Modi launched multiple development projects worth ₹33,500 crore in Delhi, ranging from the expansion of the Metro network to the construction of modern residential complexes for government employees. He highlighted the landmark achievement of creating 3 crore “Lakhpati Didis” and expressed concern over the disrespect shown by the West Bengal government toward the President of India. He called upon everyone to work towards fulfilling national resolutions.

PM Modi inaugurates, lays the foundation stone of multiple development projects worth around ₹33,500 crore in Delhi

March 08th, 10:26 am

PM Modi launched multiple development projects worth ₹33,500 crore in Delhi, ranging from the expansion of the Metro network to the construction of modern residential complexes for government employees. He highlighted the landmark achievement of creating 3 crore “Lakhpati Didis” and expressed concern over the disrespect shown by the West Bengal government toward the President of India. He called upon everyone to work towards fulfilling national resolutions.

న్యూస్ 18 రైజింగ్ భారత్ సదస్సులో ప్రధాని ప్రసంగం

February 27th, 08:30 pm

‘రైజింగ్ ఇండియా’ గురించి మీరంతా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అంతర్గత శక్తి గురించి ఎక్కువగా చెబుతున్నారు. సూటిగా చెప్పాలంటే.. స్వభావ సిద్ధమైన దేశ స్వీయ సామర్థ్యాల మీదే మీరు ప్రధానంగా దృష్టి సారించారు. ‘తత్వమసి’ అని మన గ్రంథాలు బోధిస్తున్నాయి. అంటే, మనం ఎక్కడో వెతుకులాడుతున్న దైవిక శక్తి మనలోనే ఉంది. అది మనమే. ఆ శక్తి మనలోనే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. గత 11 ఏళ్లలో భారత్ తనలో ఉన్న ఈ అసలైన శక్తిని గుర్తించింది. నేడు ఆ శక్తి ప్రవర్ధమానమయ్యేలా దేశం నిరంతరం పురోగమిస్తోంది.

నెట్‌వర్క్ 18 రైజింగ్ భారత్ సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 27th, 08:00 pm

రైజింగ్ భారత్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ‘అంతర్గత శక్తి’ అంశంపై ఆయన ప్రసంగం సాగింది. గత 11 ఏళ్లలో దేశ ప్రయాణం, జాతీయ సామర్థ్యాన్ని తిరిగి పొందడం, ఆర్థిక స్వావలంబన, 2047 నాటికి వికసిత్‌ భారత్ లక్ష్యం కోసం రూపొందించిన ప్రణాళిక గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు.

Congress wants to push Assam back into instability and infiltration: PM Modi in Guwahati

February 14th, 03:00 pm

PM Modi addressed a massive public rally in Guwahati, where he said the recent Union Budget has further strengthened the vision of the BJP-NDA for the development of Assam and the North East. Calling the North East “Ashtalakshmi,” he said the region was ignored for decades by Congress but is now being served with dedication.

PM Modi addresses a grand public rally in Guwahati, Assam

February 14th, 02:30 pm

PM Modi addressed a massive public rally in Guwahati, where he said the recent Union Budget has further strengthened the vision of the BJP-NDA for the development of Assam and the North East. Calling the North East “Ashtalakshmi,” he said the region was ignored for decades by Congress but is now being served with dedication.

‘ఈటీ నౌ’ అంత‌ర్జాతీయ వాణిజ్య స‌ద‌స్సు-2026లో ప్రధానమంత్రి ప్రసంగం

February 13th, 08:30 pm

ఈ అంతర్జాతీయ వాణిజ్య సదస్సుకు హాజరైన మీకందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. “ఒక దశాబ్దపు అంతరాయాలు-ఒక శతాబ్దపు మార్పు” అనే ఇతివృత్తం ప్రాతిపదికగా మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. వినీత్ గారి ప్రసంగం విన్న తర్వాత, నా పని చాలా సులభమైందని భావిస్తున్నాను. అయితే, నాదొక చిన్న అభ్యర్థన- మీకు దీనిపై ఇప్పటికే అవగాహన ఉంది కాబట్టి, కొన్ని సందర్భాల్లో అది ‘ఈటీ’లోనూ ప్రతిబింబిస్తూంటుంది.

‘ఈటీ నౌ’ అంత‌ర్జాతీయ వాణిజ్య స‌ద‌స్సు-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

February 13th, 08:00 pm

న్యూఢిల్లీలో ఈ రోజు ప్రారంభమైన ‘ఈటీ నౌ’ (ET Now) అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సదస్సుకు హాజరైన వారందరికీ తొలుత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సదస్సు ఇతివృత్తం “ఒక దశాబ్దపు అంతరాయాలు-ఒక శతాబ్దపు మార్పు”ను ప్రస్తావిస్తూ- ఈ 21వ శతాబ్దపు ప్రస్తుత దశాబ్దంలో అసాధారణ అవరోధాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు. వీటిలో మహమ్మారి కరోనా సహా ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు, సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం వంటివి ప్రపంచ సమతౌల్యాన్ని అతలాకుతలం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి సంక్షోభాలే ఒక దేశ వాస్తవ శక్తిసామర్థ్యాలను తేటతెల్లం చేస్తాయని చెప్పారు. ఇలాంటి అవరోధాలెన్నో ఎదురైనా, ఒక దశాబ్ద కాలంలో బలమైన పనితీరు, ప్రజాస్వామ్య బలోపేతానికి సాగిన కృషి ఫలితంగా భారత్‌ అద్భుత ప్రగతి సాధించిందని సగర్వంగా ప్రకటించారు. గత దశాబ్దారంభంలో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ 11వ స్థానంలో ఉండేదని, గందరగోళ పరిస్థితుల నడుమ పతనం తప్పదేమోన్న ఆందోళన దోబూలాడేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. కానీ, గడ్డు కాలాన్ని అధిగమిస్తూ నేడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా శరవేగంతో పురోగమిస్తున్నదని చెప్పారు. ఈ పరిణమాశీల శతాబ్దానికి భారత్‌ కీలక మూలస్తంభంగా నిలుస్తుందని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఆ మేరకు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్‌ వాటా 16 శాతానికిపైగా ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అంతేగాక ఏటికేడు ఈ వాటా పెరుగుతూనే ఉంటుందన్న ఆశాభావం వెలిబుచ్చారు. అంతర్జాతీయ వృద్ధికి సారథ్యం వహిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకంగా ఆవిర్భవించగలదని ఆయన స్పష్టం చేశారు.

సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 13th, 06:55 pm

నూతన చరిత్రకు ఇవాళ మనం ప్రత్యక్ష సాక్షులం. విక్రమ సంవత్ 2082, ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి, శక సంవత్ 1947 మాఘ 24, నేటి సాధారణ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 13-ఈ శుభదినాన భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతోంది. మన శాస్త్రాల ప్రకారం, విజయ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తీసుకునే ఏ సంకల్పమైనా తప్పక ఫలిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పంతో ఇవాళ మనం సేవా తీర్థ, కర్తవ్య భవన్‌లోకి అడుగుపెడుతున్నాం. మన లక్ష్య సాధనలో విజయమనే దైవిక ఆశీస్సులు మనకు తోడుగా ఉన్నాయి. సేవా తీర్థ, నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ, పీఎంఓ బృందానికి, కేబినెట్ సెక్రటేరియట్‌కు, వివిధ శాఖల ఉద్యోగులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లకు, కార్మికులకూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

న్యూఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 13th, 06:30 pm

న్యూఢిల్లీలో నేడు జరిగిన సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనమందరం ఒక కొత్త చరిత్ర సృష్టిని వీక్షిస్తున్నామని పేర్కొన్నారు. 2082 విక్రమ సంవత్సరం నాడు ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి శుభ సందర్భంగా మాఘ 24, ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం 2026 ఫిబ్రవరి 13న ఉన్న శక సంవత్సరం 1947న భారత్‌ తన అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త ఆరంభానికి సాక్షిగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. శాస్త్రాల ప్రకారం విజయ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ రోజున తీసుకున్న సంకల్పం ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తుందని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన భారత్‌ అనే సంకల్పంతో మనమందరం నేడు సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్యంలో విజయానికి దైవిక ఆశీస్సులు మనకు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా తీర్థ్, ఈ కొత్త భవనాల నిర్మాణానికి గానూ ప్రధానమంత్రి కార్యాలయ బృందానికి, మంత్రివర్గ సచివాలయం, వివిధ శాఖల ఉద్యోగులతో సహా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మిక మిత్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

అనువాదం: రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్యసభలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మాధానం

February 05th, 05:35 pm

ఈ ధన్యవాద తీర్మానానికి మద్దతుగా నా భావాలను ఈ సభ ముందు ఉంచడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమాధానం

February 05th, 05:00 pm

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమాధానమిచ్చారు. ధన్యవాద తీర్మానానికి మద్దతుగా తన భావాలను సభతో పంచుకోవడం అదృష్టమని వ్యాఖ్యానించిన ఆయన.. రాష్ట్రపతి ప్రసంగం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో గడిచిన ఏడాది కాలం అత్యంత వేగవంతమైన పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. దేశం సరైన దిశలో, గొప్ప వేగంతో దేశం ముందుకు సాగుతోందనీ.. సమాజంలోని అన్ని వర్గాల్లో, ప్రతి రంగంలోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటినీ రాష్ట్రపతి సునిశితంగా, స్పష్టంగా వివరించారని శ్రీ మోదీ అన్నారు.

అనువాదం: కేంద్ర బడ్జెట్‌పై ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

February 01st, 01:38 pm

నేటి బడ్జెట్ చారిత్రాత్మకమైనది. ఇది దేశంలోని 'నారీ శక్తి' (మహిళా శక్తి) శక్తిమంతమైన ప్రతిరూపంగా ఉంది. ఒక మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా గారు వరుసగా తొమ్మిదో సారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించారు. అపారమైన అవకాశాలకు ఒక రాజమార్గం ఈ బడ్జెట్. ఈ బడ్జెట్ వర్తమాన కాలపు కలలను సాకారం చేయడమే కాకుండా భారత్‌ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిని బలపరుస్తుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) వైపు మనం వేసే భారీ ప్రయాణానికి ఈ బడ్జెట్ ఒక బలమైన పునాది వంటిది.

2026 కేంద్ర బడ్జెటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందన

February 01st, 01:00 pm

భారత్‌లో ప్రస్తుతం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోందనీ, ఈ బడ్జెటుతో ఈ ఎక్స్‌ప్రెస్ ఒక కొత్త శక్తినే కాకుండా ఓ కొత్త జోరును కూడా అందుకొంటుందని శ్రీ మోదీ వెల్లడించారు. ఇంతవరకు చేపట్టనటువంటి సంస్కరణల్ని చేపట్టినందువల్ల, భారత్‌లో వృద్ధి లోకి రావాలని తపించిపోతున్న, ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన యువతకు వారు ఉవ్వెత్తున ఎగరడానికి విశాల గగనాన్ని బడ్జెటు వారి ఎదుట ఆవిష్కరించిందని ఆయన అన్నారు. నమ్మకమైన పాలన, దేశ పౌరుల ప్రయోజనాలకు ప్రాముఖ్యాన్నిచ్చే ఆర్థిక ప్రణాళిక.. ఈ రెండు దృష్టికోణాలనూ బడ్జెటు సాకారం చేసిందని కూడా ఆయన చెప్పారు. ద్రవ్య లోటును తగ్గించడం, ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం, అదే సమయంలో అధిక మూలధన వ్యయానికీ, అధిక అభివృద్ధికీ పూచీని ఇవ్వడం.. వీటిపై దృష్టిని కేంద్రీకరించిన అద్వితీయ బడ్జెటు ఇదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

DMK is the biggest enemy of Tamil Nadu’s culture: PM Modi in Madhuranthakam

January 23rd, 03:15 pm

PM Modi addressed a public rally in Madhuranthakam, Tamil Nadu, where he said the people of the state had given the DMK a clear mandate twice, but the party betrayed the trust of the people. He added DMK made many promises but delivered zero results, adding that people are now calling it a CMC government, one that promotes corruption, mafia, and crime.

Tamil Nadu shows massive support for NDA at PM Modi’s Madhuranthakam rally

January 23rd, 03:00 pm

PM Modi addressed a public rally in Madhuranthakam, Tamil Nadu, where he said the people of the state had given the DMK a clear mandate twice, but the party betrayed the trust of the people. He added DMK made many promises but delivered zero results, adding that people are now calling it a CMC government, one that promotes corruption, mafia, and crime.

కేరళలోని తిరువనంతపురంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 23rd, 11:00 am

కేరళ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాల్లో నేడు కొత్త ఊపొచ్చింది. నేటి నుంచి కేరళలో రైలు అనుసంధానం మరింత మెరుగవుతుంది. దేశంలోనే తిరువనంతపురం ఒక పెద్ద అంకుర సంస్థల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ మొదలైంది. నేడు దేశవ్యాప్తంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం ఒక గొప్ప ఆరంభం కూడా కేరళ నుంచి జరుగుతోంది. ఈ రోజు ‘పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు’ను ప్రారంభించాం. దీని ద్వారా దేశంలోని వీధి వ్యాపారులు, బండ్లపై వ్యాపారం చేసే వారు, ఫుట్‌పాత్‌లపై పనిచేసే వారు లబ్ధి పొందనున్నారు. అభివృద్ధి కోసం, ఉపాధి కల్పన కోసం, ఈ పథకాల కోసం కేరళ ప్రజలకు, దేశ ప్రజలందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

కేరళలోని తిరువనంతపురంలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

January 23rd, 10:45 am

కేరళలోని తిరువనంతపురంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మరికొన్నింటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. కేరళ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ రోజు నవోత్తేజం లభించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కేరళలో రైలు అనుసంధానం మరింత బలోపేతమైందనీ, తిరువనంతపురాన్ని అంకుర సంస్థల ప్రధాన నిలయంగా నిలిపేలా చర్యలు చేపట్టామని తెలిపారు. పేదల సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ముఖ్య కార్యక్రమమైన ‘పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు’ను కూడా కేరళ వేదికగా ప్రారంభించినట్టు ప్రధానమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవారికి, ఫుట్‌పాత్‌లపై పనిచేసుకునేవారికి ఇది ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాల సందర్భంగా కేరళతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలకు అభినందనలు తెలిపారు.