ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 12 జిల్లాలను కవర్ చేసే మూడు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
February 14th, 12:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన మూడు (3) ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం సుమారు రూ. 18,509 కోట్లు. అవి:అనువాదం: కేంద్ర బడ్జెట్‌పై ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
February 01st, 01:38 pm
నేటి బడ్జెట్ చారిత్రాత్మకమైనది. ఇది దేశంలోని 'నారీ శక్తి' (మహిళా శక్తి) శక్తిమంతమైన ప్రతిరూపంగా ఉంది. ఒక మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా గారు వరుసగా తొమ్మిదో సారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించారు. అపారమైన అవకాశాలకు ఒక రాజమార్గం ఈ బడ్జెట్. ఈ బడ్జెట్ వర్తమాన కాలపు కలలను సాకారం చేయడమే కాకుండా భారత్ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిని బలపరుస్తుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) వైపు మనం వేసే భారీ ప్రయాణానికి ఈ బడ్జెట్ ఒక బలమైన పునాది వంటిది.2026 కేంద్ర బడ్జెటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందన
February 01st, 01:00 pm
భారత్‌లో ప్రస్తుతం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోందనీ, ఈ బడ్జెటుతో ఈ ఎక్స్‌ప్రెస్ ఒక కొత్త శక్తినే కాకుండా ఓ కొత్త జోరును కూడా అందుకొంటుందని శ్రీ మోదీ వెల్లడించారు. ఇంతవరకు చేపట్టనటువంటి సంస్కరణల్ని చేపట్టినందువల్ల, భారత్‌లో వృద్ధి లోకి రావాలని తపించిపోతున్న, ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన యువతకు వారు ఉవ్వెత్తున ఎగరడానికి విశాల గగనాన్ని బడ్జెటు వారి ఎదుట ఆవిష్కరించిందని ఆయన అన్నారు. నమ్మకమైన పాలన, దేశ పౌరుల ప్రయోజనాలకు ప్రాముఖ్యాన్నిచ్చే ఆర్థిక ప్రణాళిక.. ఈ రెండు దృష్టికోణాలనూ బడ్జెటు సాకారం చేసిందని కూడా ఆయన చెప్పారు. ద్రవ్య లోటును తగ్గించడం, ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం, అదే సమయంలో అధిక మూలధన వ్యయానికీ, అధిక అభివృద్ధికీ పూచీని ఇవ్వడం.. వీటిపై దృష్టిని కేంద్రీకరించిన అద్వితీయ బడ్జెటు ఇదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.