పారిస్‌ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం

September 10th, 02:50 pm

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సరైన సమయంలో సాదరంగా తనను ఆహ్వానించడంపై చొరవ చూపిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించడంపై- “తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాలుపంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

పారిస్‌లో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 10th, 02:45 pm

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సరైన సమయంలో సాదరంగా తనను ఆహ్వానించడంపై చొరవ చూపిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించడంపై- “తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాలుపంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

అనువాదం: ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 08th, 06:27 pm

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన ఆవిష్కర్తలకు, నాయకులకు, పెట్టుబడిదారులకు ప్రధాని సాదర స్వాగతం పలికారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఈ కార్యక్రమంలో వరుసగా మూడోసారి పాల్గొనడం ఎంతో జాతీయ ప్రాధాన్యత కలిగిన 'హ్యాట్రిక్'లా అనిపిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. వికసిత భారత్ నిర్మాణంలో మీరు ఎంత ముఖ్యమో, మీ పని కూడా అంతటి కీలకమైనదని ఈ హ్యాట్రిక్ చాటిచెబుతోంది అని శ్రీ మోదీ అన్నారు.

ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 08th, 06:00 pm

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన ఆవిష్కర్తలకు, నాయకులకు, పెట్టుబడిదారులకు ప్రధాని సాదర స్వాగతం పలికారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఈ కార్యక్రమంలో వరుసగా మూడోసారి పాల్గొనడం ఎంతో జాతీయ ప్రాధాన్యత కలిగిన 'హ్యాట్రిక్'లా అనిపిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. వికసిత భారత్ నిర్మాణంలో మీరు ఎంత ముఖ్యమో, మీ పని కూడా అంతటి కీలకమైనదని ఈ హ్యాట్రిక్ చాటిచెబుతోంది అని శ్రీ మోదీ అన్నారు.

భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు

August 15th, 05:48 pm

భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు తెలిపిన హృదయపూర్వక శుభాకాంక్షలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అందిన అభినందన సందేశాల పట్ల ఆయన హర్షం, కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.

ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 18th, 11:41 pm

కాంతులు, రంగులతో కూడిన నగరం పారిస్. ఇది కళలకు, సరికొత్త ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరంతా ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరే దీనికి సరికొత్త, చైతన్యవంతమైన రంగులను అద్దుతున్నారు.

ప్యారిస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

June 18th, 09:30 pm

ఫ్రాన్స్‌లోని వివిధ రంగాల్లో భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. భారతీయ ఆవిష్కరణలనూ, ఆలోచనలనూ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఇండియా-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ- వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులు ఫ్రాన్స్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవడంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలు విస్తరించాయని ఆయన తెలియజేశారు. ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఫ్రాన్స్‌లో యూపీఐ విస్తరణ గురించి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని వివరించారు.

పారిస్‌లో ‘వివాటెక్-2026’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 18th, 06:15 pm

ఇక ఇదే సంవత్సరంలో ‘ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ ప్రారంభం కావడంతో రెండు దేశాలతోపాటు ఐరోపా సాంకేతికావరణ వ్యవస్థలను చేరువ చేసే కీలక వారధిగా ఇది రూపొందింది. కొన్ని రోజుల కిందట నైస్‌ నగరంలో నిర్వహించిన ‘భారత్ ఇన్నొవేట్స్’ నుంచి ఇవాళ పారిస్‌ నగరంలో నిర్వహిస్తున్న ‘వివాటెక్’ దాకా మన అంకుర సంస్థలు అనేక కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటున్నాయి.

వివాటెక్ 2026 సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

June 18th, 06:00 pm

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పారిస్‌లో జరిగిన ఐరోపాలోనే అతిపెద్ద సాంకేతిక, అంకురాల కార్యక్రమం అయిన 'వివాటెక్ 2026'లో పాల్గొన్నారు.

ప్రధాని ఫ్రాన్స్ పర్యటన ఫలితాల జాబితా

June 14th, 09:32 pm

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల రోడ్‌మ్యాప్-2030 ఆమోదం

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు

June 14th, 08:37 pm

జూన్ 14, 2026న నీస్‌లోని విల్లా కెరిలోస్ వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్-ఫ్రాన్స్ సంబంధాలను విశిష్టమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చిన తర్వాత ఇరువురు నేతల మధ్య జరిగిన తొలి సమావేశమిది.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

June 14th, 04:36 pm

ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాం. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.

ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’కు శ్రీకారం

June 14th, 03:00 pm

ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్‌ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్‌)లో ఇవాళ “భారత్ ఇన్నొవేట్స్-2026”ను సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణ పెట్టుబడి సంస్థలు, అవకాశాల దిశగా భారత డీప్-టెక్ అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికపైకి తెస్తుంది. అంతర్జాతీయ ప్రాధాన్యంగల 13 కీలక సాంకేతిక రంగాల్లో 120కి పైగా వినూత్న అంకుర సంస్థలను, 20కి పైగా అగ్రశ్రేణి నైపుణ్య సంస్థలు సహా భారత అగ్రశ్రేణి డీప్ టెక్నాలజీని ప్రపంచానికి ఈ వేదిక చాటిచెబుతుంది. ప్రపంచంలోని 350 మందికి పైగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.

ఫ్రాన్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

June 13th, 11:19 pm

తన పర్యటనలోని మొదటి అంచెను ప్రారంభించేందుకు ఫ్రాన్స్‌లోని నైస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య ఉన్న బలమైన, శాశ్వత సంబంధాలకు నిదర్శనంగా ఆయనకు ప్రత్యేక, ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ పర్యటన, బలపడుతున్న భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని, విభిన్న రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవాలనే ఉమ్మడి నిబద్ధతను నొక్కి చెబుతోంది.

ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి అధికారిక ప్రకటన

June 13th, 10:03 am

ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షులు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ రాబర్ట్ ఫికోల ఆహ్వానం మేరకు... నేను ఈ నెల 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవాక్ రిపబ్లిక్‌ దేశాల్లో పర్యటించనున్నాను.

Visit of Prime Minister to France and Slovakia (June 13-18, 2026)

June 09th, 07:20 pm

PM Modi will visit France from 13-14 June 2026 and again from 16-19 June 2026. During his initial visit to France, he will hold discussions with President Emmanuel Macron and jointly inaugurate the 'Bharat Innovates' event. He will then visit Slovakia from 14-16 June 2026 to hold discussions with PM Robert Fico and meet President Peter Pellegrini. The PM will once again visit France to participate in the G7 Summit and the VivaTech Summit.

ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్.. . పశ్చిమ ఆసియాలో స్థితితో పాటు నౌకావాణిజ్య భద్రతపై చర్చలు

April 16th, 10:25 pm

ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, మాట్లాడారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడిన భారత ప్రధాని

March 19th, 05:05 pm

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపైనా, ఉద్రిక్తతలను తగ్గించి చర్చలనూ, దౌత్యాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతపైనా చర్చించారు. ఈ ప్రాంతంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, స్థిరత్వాలను పెంపొందించే దిశగా సన్నిహిత సమన్వయంతో కూడిన కృషిని కొనసాగించాలని భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి

March 05th, 07:20 pm

ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఫోన్‌లో మాట్లాడారు.

హోలీ శుభాకాంక్షలు తెలిపినందుకు అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు

March 04th, 10:51 pm

హోలీ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.