పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో పలు రైలు, రహదారి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 17th, 02:00 pm

పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ సి.వి. ఆనంద బోస్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వినీ వైష్ణవ్ గారు, శంతను ఠాకూర్ గారు, సుకాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, పార్లమెంటులో నా సహచరులు షమిక్ భట్టాచార్య గారు, ఖగెన్ ముర్ము గారు, కార్తీక్ చంద్ర పాల్ గారు, ఇతర ప్రతినిధులూ, సోదరీ సోదరులారా.

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో రూ. 3,250 కోట్లకు పైగా విలువైన అనేక రైలు, రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి

January 17th, 01:45 pm

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో రూ. 3,250 కోట్ల విలువైన అనేక రైలు, రహదారి మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేసి, అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని శ్రీ మోదీ ప్రసంగించారు. మాల్దా వేదికగా పశ్చిమ బెంగాల్ పురోగతిని వేగవంతం చేసే ఉద్యమానికి మరింత ఊపొచ్చిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులను ఇప్పుడే ప్రారంభించి, ప్రజలకు అంకితం చేసినట్లు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ కోసం కొత్త రైలు సేవలను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులు ప్రజలకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాలకు కూడా తోడ్పడతాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన కొత్త రైలు నిర్వహణ సదుపాయాలు బెంగాల్ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తాయని పేర్కొన్నారు.

RJD and Congress are putting Bihar’s security and the future of its children at risk: PM Modi in Katihar, Bihar

November 03rd, 02:30 pm

In a massive public rally in Katihar, Bihar, PM Modi began with the clarion call, “Phir ek baar - NDA Sarkar, Phir ek baar - Susashan Sarkar.” He accused the RJD and Congress of risking Bihar’s security for votes and questioned whether benefits meant for the poor should be taken away by infiltrators. He remarked that under Nitish Ji’s leadership, NDA brought governance and growth, emphasizing that every single vote will play a role in building a Viksit Bihar.

Be it Congress or RJD, their love is only for infiltrators: PM Modi in Saharsa, Bihar

November 03rd, 02:15 pm

Amidst the ongoing election campaigning in Bihar, PM Modi's rally spree continued as he addressed a public meeting in Saharsa. He said that only two days are left for the first phase of voting in Bihar. Many young voters here will be voting for the first time. He urged all first-time voters in Bihar, “Do not let your first vote go to waste. The NDA is forming the government in Bihar and your vote should go to the alliance that is actually winning. Your vote should be for a Viksit Bihar.”

Massive public turnout as PM Modi campaigns in Saharsa and Katihar, Bihar

November 03rd, 02:00 pm

Amid the ongoing election campaign in Bihar, PM Modi continued his rally spree, addressing large public meetings in Saharsa and Katihar. He reminded people that only two days remain for the first phase of voting, noting that many young voters will be casting their vote for the first time. Urging them not to waste their first vote, he said, “The NDA is forming the government in Bihar. Your vote should go to the alliance that is actually winning - your vote should be for a Viksit Bihar.”

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

August 25th, 06:42 pm

ఈ రోజు మీరంతా నిజంగా ఓ అద్భుత వాతావరణాన్ని సృష్టించారు. నేను చాలాసార్లు అనుకుంటాను.. ఈ లక్షలాది ప్రజల ప్రేమాశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని! నేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చూడండీ.. ఓ చిన్న నరేంద్ర అక్కడ నిలబడి ఉన్నాడు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసి వాటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

August 25th, 06:15 pm

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. యావత్ దేశం ప్రస్తుతం గణేష్ ఉత్సవాల ఉత్సాహంలో మునిగిపోయిందన్నారు. గణపతి బప్పా ఆశీస్సులతో గుజరాత్ పురోగతికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శుభప్రదమైన ప్రారంభం జరిగిందని వ్యాఖ్యానించారు. పలు ప్రాజెక్టులను ప్రజల పాదాలకు అంకితం చేసే అవకాశం తనకు లభించిందన్న ప్రధానమంత్రి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 23rd, 10:10 pm

వరల్డ్ లీడర్స్ ఫోరంకు హాజరైన అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సు నిర్వహిస్తున్న సమయం అత్యంత తగిన సమయం.. అందుకు నేను నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఒక వారం కిందట నేను ఎర్రకోట నుంచి మాట్లాడుతూ తదుపరి తరం సంస్కరణలను ప్రస్తావించాను. ఇప్పుడు ఈ సదస్సు ఆ స్పూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.

న్యూఢిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 23rd, 05:43 pm

ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన ప్రముఖ అతిథులందరినీ ఆయన స్వాగతించారు. ఈ ఫోరం జరుగుతున్న సమయం అత్యంత తగిన సమయంగా పేర్కొన్న శ్రీ నరేంద్ర మోదీ.. తగిన సమయంలో ఈ సదస్సును నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గత వారం తాను ఎర్రకోట వేదికగా తదుపరి తరం సంస్కరణల గురించి మాట్లాడినట్లు గుర్తుచేసిన ప్రధానమంత్రి.. ఇప్పుడు ఆ స్ఫూర్తిని ఈ సదస్సు మరింత శక్తిమంతం చేస్తోందన్నారు.

ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

August 17th, 12:45 pm

కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...

రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

August 17th, 12:39 pm

ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

రోజ్‌గార్ మేళా కింద 51,000కు పైగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

July 12th, 11:30 am

కేంద్ర ప్రభుత్వంలో యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే దిశగా మా చర్యలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సిఫార్సు లేదు, అవినీతి లేదు- ఈ విధానానికి మేం కట్టుబడి ఉన్నాం. నేడు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందించాం. ఇలాంటి రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువత ఇప్పటికే భారత ప్రభుత్వంలో శాశ్వత కొలువులను పొందారు. ఈ యువత ఇప్పుడు దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. నేడు మీలో చాలా మంది భారతీయ రైల్వేలలో బాధ్యతలను మొదలుపెట్టారు. కొందరు దేశ భద్రతకు రక్షకులవుతుండగా, మరికొందరు తపాలా శాఖలో నియమితులై ప్రభుత్వ సేవలను ఊరూరా చేరవేయబోతున్నారు. ‘అందరికీ ఆరోగ్యం’ మిషన్‌లో అడుగుపెట్టబోయే సైనికులు మరికొందరు. ఆర్థిక సమ్మిళిత్వాన్ని వేగవంతం చేసేలా సేవలందించేందుకు యువ నిపుణులనేకులు సిద్ధమవుతుండగా, మరికొందరు దేశ పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నారు. మీ విభాగాలు వేరు కావచ్చు... కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. విభాగం, పని, హోదా, ప్రాంతం ఏవైనా సరే – దేశ సేవే ఏకైక లక్ష్యం. మళ్లీమళ్లీ మనం దీన్ని మననం చేసుకోవాలి. ప్రజలే ప్రథమం: ఇదే మన మార్గదర్శక సూత్రం. దేశ ప్రజలకు సేవ చేయడానికి మీకు గొప్ప వేదిక లభించింది. జీవితంలోని ఈ ముఖ్యమైన దశలో ఇంత గొప్ప విజయాన్ని సాధించిన మీ అందరికీ అభినందనలు. కెరీర్‌లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న మీకు నా శుభాకాంక్షలు.

రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 12th, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు వీడియో అనుసంధానం ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఈ యువత కొత్త బాధ్యతలు ప్రారంభించనున్నదని తెలిపారు. వివిధ విభాగాల్లో తమ సేవలను ప్రారంభిస్తున్న యువకులను ఆయన అభినందించారు. ఉద్యోగ నిర్వహణలో ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ.. పౌరులకు ప్రథమ ప్రాధాన్యం అనే సూత్ర మార్గనిర్దేశంలో దేశానికి సేవ చేయడమే వారి సమష్టి లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ట్రినిడాడ్, టొబాగో దేశంలోని ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 04th, 05:56 am

ఈ సాయంత్రం వేళ ఇలా మీ అందరినీ కలవడం గర్వాన్నీ, అమితానందాన్నీ ఇస్తోంది. చక్కని ఆతిథ్యమిచ్చి, నా గురించి ఆత్మీయంగా మాట్లాడిన ప్రధానమంత్రి కమ్లా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!

ట్రినిడాడ్ టొబాగోలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 04th, 04:40 am

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ మోదీని ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా స్వాగతిస్తూ, ట్రినిడాడ్ టొబాగోలో అత్యున్నత జాతీయ పురస్కారమైన ‘‘ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో’’తో ఆయనను సత్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ గౌరవాన్ని తనకు ఇస్తున్నందుకు ఆమెతో పాటు ట్రినిడాడ్ టొబాగో ప్రజానీకానికి తన హృదయపూర్వక కృతజ్ఞత‌లను ప్రధానమంత్రి తెలియజేశారు.

బీహార్ లోని శివాన్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

June 20th, 01:00 pm

అందరికీ నమస్కారం. బాబా మహేంద్రనాథ్, బాబా హంసనాథ్, సోహగరా ధామ్, తావే భవానీమాత, అంబికా భవానీ మాత, భారత మొదటి రాష్ట్రపతి దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ల పవిత్ర భూమిపై మీ అందరికి హార్దిక స్వాగతం!

బీహార్లోని సివాన్‌లో రూ.5,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 20th, 12:00 pm

బీహార్లోని సివాన్లో రూ.5,200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాబా మహేంద్రనాథ్, బాబా హన్స్‌నాథ్‌లను స్మరించుకున్నారు. అలాగే పవిత్రమైన సోగర ధామ్‌‌ ప్రాశస్థ్యాన్ని గుర్తుచేశారు. థావే భవానీ మాత, అంబికా భవానీ మాతకు వందనం సమర్పించారు. దేశానికి తొలి రాష్ట్రపతిగా సేవలందించిన దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లోక నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌‌ను ఆయన గౌరవపురస్సరంగా తలచుకున్నారు.

గుజరాత్ లోని దాహోద్ లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

May 26th, 11:45 am

గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, గుజరాత్ మంత్రివర్గంలోని నా సహచరులందరూ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర విశిష్ట ప్రముఖులు, దాహోద్ లోని నా ప్రియమైన సోదరులు, సోదరీమణులారా!

గుజరాత్‌లోని దాహోద్‌లో రూ. 24,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

May 26th, 11:40 am

గుజరాత్‌లోని దాహోద్ లో రూ.24,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2014లో తాను మొదటిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మే 26నే కాబట్టి ఈ రోజు ప్రత్యేకమైనదని అన్నారు. దేశాన్ని నడిపించే బాధ్యతను నిర్వర్తించడంలో గుజరాత్ ప్రజలు తనకు అందించిన మద్దతును, ఆశీర్వాదాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఈ నమ్మకం, ప్రోత్సాహమే దేశానికి రేయింబవళ్లు సేవ చేయాలనే తన అంకితభావానికి ఆధారంగా నిలిచాయని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న పాత పద్దతులను వదిలించుకుని ప్రతి రంగంలోనూ దూసుకువెళ్లేలా గడచిన కొన్నేళ్లలో భారత్ అసాధారణమైన, ఊహకందని నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ‘‘ఈరోజు నిరాశ, చీకటి నుంచి బయటపడి సరికొత్త విశ్వాసం, ఆశావాదం నిండిన కొత్తయుగంలోకి దేశం అడుగుపెట్టింది’’ అని చెప్పారు.