ఇలాబెన్భట్ట్ గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

November 02nd, 04:28 pm

ప్రముఖ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త అయిన ఇలాబెన్ భట్ట్ మృతి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మహిళల సశక్తీకరణ ను, సామాజిక సేవ ను మరియు యువతీయువకుల లో విద్య వ్యాప్తిని ప్రోత్సహించడం కోసం ఆమె చేసినటువంటి ప్రయాసల ను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు.