ట్రినిడాడ్, టొబాగో దేశంలోని ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 04th, 05:56 am
ఈ సాయంత్రం వేళ ఇలా మీ అందరినీ కలవడం గర్వాన్నీ, అమితానందాన్నీ ఇస్తోంది. చక్కని ఆతిథ్యమిచ్చి, నా గురించి ఆత్మీయంగా మాట్లాడిన ప్రధానమంత్రి కమ్లా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!ట్రినిడాడ్ టొబాగోలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 04th, 04:40 am
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ మోదీని ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా స్వాగతిస్తూ, ట్రినిడాడ్ టొబాగోలో అత్యున్నత జాతీయ పురస్కారమైన ‘‘ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో’’తో ఆయనను సత్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ గౌరవాన్ని తనకు ఇస్తున్నందుకు ఆమెతో పాటు ట్రినిడాడ్ టొబాగో ప్రజానీకానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలను ప్రధానమంత్రి తెలియజేశారు.మహా కుంభమేళాపై లోక్ సభలో ప్రధాని ప్రసంగం
March 18th, 01:05 pm
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాపై నేనిప్పుడు మాట్లాడబోతున్నాను. ఈ గౌరవ సభ ద్వారా లక్షలాది మంది దేశ ప్రజలకు నమస్కరిస్తున్నాను. వారి సహకారంతోనే మహా కుంభమేళా విజయవంతమైంది. ఈ బృహత్ కార్యక్రమం విజయవంతం కావడంలో అనేక మంది వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం, సమాజం, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికే అంకితమై సేవలందించిన కార్మికులందరికీ నా అభినందనలు. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు, ప్రత్యేకించి ప్రయాగరాజ్ వాసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.PM Modi addresses Lok Sabha on successful conclusion of Maha Kumbh
March 18th, 12:10 pm
PM Modi while addressing the Lok Sabha on Mahakumbh, highlighted its spiritual and cultural significance, likening its success to Bhagirath’s efforts. He emphasized unity, youth reconnecting with traditions, and India's ability to host grand events. Stressing water conservation, he urged expanding river festivals. Calling it a symbol of ‘Ek Bharat, Shreshtha Bharat,’ he hailed Mahakumbh’s legacy.మారిషస్‌లోని భారతీయులతో సమావేశంలోప్రధానమంత్రి ప్రసంగం
March 12th, 06:07 am
పదేళ్ల కిందట ఇదే తేదీన నేను మారిషస్ పర్యటనకు వచ్చేనాటికి ఓ వారం ముందే మేం హోలీ పండుగ చేసుకున్నాం. అప్పుడు భారత్ నుంచి హోలీ వేడుకల సంరంభాన్ని నాతో మోసుకొచ్చాను. అయితే, ఈసారి వర్ణరంజిత హోలీ సంరంభాన్ని మారిషస్ నుంచి మన దేశానికి తీసుకెళ్తాను. ఈ నెల 14వ తేదీన హోలీ కాబట్టి.. వేడుకలకు మరొక రోజు మాత్రమే ఉంది.మారిషస్‌లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 11th, 07:30 pm
మారిషస్ ప్రధాని శ్రీ నవీన్ చంద్ర రాంగులాంతో పాటు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్‌లోని ట్రాయోన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని, ఇండియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తినిపుణులు, సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు సహా భారతీయ ప్రవాసులు చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మారిషస్ మంత్రులు అనేక మందితోపాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.రాజ్యాంగమే మనకు మార్గదర్శకం: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 29th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క ఈ ఎపిసోడ్‌లో, రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవం మరియు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ సన్నాహాలతో సహా భారతదేశం సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రతిబింబించారు. బస్తర్ ఒలింపిక్స్ విజయాన్ని ఆయన ప్రశంసించారు మరియు ఆయుష్మాన్ భారత్ పథకం కింద మలేరియా నిర్మూలన మరియు క్యాన్సర్ చికిత్సలో పురోగతి వంటి ముఖ్యమైన ఆరోగ్య పురోగతులను హైలైట్ చేశారు. అదనంగా, ఒడిశాలోని కలహండిలో వ్యవసాయ పరివర్తనను ఆయన ప్రశంసించారు.