సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
June 28th, 05:00 pm
ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.ప్రధానమంత్రికి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ పురస్కారంతో సీషెల్స్ సత్కారం
June 28th, 03:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సీషెల్స్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ పాట్రిక్ హర్మినీ ఇవాళ ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ విశిష్ట పురస్కారంతో సత్కరించారు. కాలుష్య రహిత భూగోళం లక్ష్యంగా నాయకత్వం వహిస్తున్నందుకు, వర్ధమాన దేశాల ప్రయోజనాల కోసం గళమెత్తిన ఆయనను ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ బిరుదుతో గౌరవించారు. అలాగే, నీలి ఆర్థిక వ్యవస్థ వికాసం, వాతావరణ ప్రభావ ఉపశమన చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, వర్ధమాన చిన్న ద్వీపదేశాల అభివృద్ధి ఆకాంక్షలను ప్రోత్సహించడంలో ఆయన దీర్ఘకాలిక నిబద్ధతకు గుర్తింపుగా ప్రధానమంత్రికి ఈ గౌరవం లభించింది. ఈ విశిష్ట పురస్కారం ప్రత్యేకంగా ఏర్పరచి, ఒక అంతర్జాతీయ నాయకుడికి ప్రదానం చేయడం ఇదే తొలిసారి.‘జీ7 శిఖరాగ్ర సమావేశం - విస్తృత భాగస్వామ్య సదస్సు: కొత్త భాగస్వామ్యాల నిర్మాణం, అంతర్జాతీయ సంఘీభావ పునరుద్ధరణ’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
June 16th, 10:12 pm
జీ-7 శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు మాక్రాన్ ఆత్మీయ స్వాగతానికి, ఆయన అందించిన ఆతిథ్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు.ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో "నూతన భాగస్వామ్యాల ఏర్పాటు
June 16th, 10:07 pm
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ7 సదస్సులో నూతన భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ ఐక్యతను పునర్నిర్మించటం అంశంపై ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.తల్లి పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ చారిత్రాత్మక రికార్డు... ప్రజలను అభినందించిన ప్రధాని
June 05th, 11:40 pm
దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే అద్భుతమైన ఘనతను సాధించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంతో ముడిపడి ఉన్న ఈ అద్భుత విజయం పర్యావరణ పరిరక్షణకు ప్రజలు ఎంతగా కట్టుబడి ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో మొక్కను నాటిన ప్రధానమంత్రి
June 05th, 10:11 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొక్కను నాటారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
June 05th, 09:53 am
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ సంరక్షణ పట్ల మక్కువను కనబరిచే వారందరినీ ఆయన ప్రశంసించారు.'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
March 29th, 11:30 am
ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్‌నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్లకు (2031-2035) కేబినెట్ ఆమోదం... యూఎన్ఎఫ్‌సీసీసీకి నివేదించేలా నిర్ణయాలు
March 25th, 05:35 pm
భారత పర్యావరణ కార్యాచరణను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. 2031 నుంచి 2035 కాలానికి గాను దేశపు ‘జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్ల (ఎన్‌డీసీ)’కు ఆమోదం తెలిపింది. యూఎన్ఎఫ్‌సీసీసీ, పారిస్ ఒప్పందం ప్రకారం దేశం తన పర్యావరణ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు సుస్థిరాభివృద్ధి, వాతావరణపరంగా న్యాయంపై నిబద్ధతను ఈ నిర్ణయంతో పునరుద్ఘాటించింది.ఇజ్రాయెల్ అధ్యక్షునితో భారత ప్రధానమంత్రి సమావేశం
February 26th, 09:00 pm
2017లో తాను ఇజ్రాయెల్‌లో పర్యటించినప్పుడు, అలాగే 2023లో దుబాయ్‌లో సమావేశాల సందర్భంగా అధ్యక్షుడు హెర్జోగ్‌తో జరిపిన భేటీలను శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భారత్ - ఇజ్రాయెల్ సంబంధాలను శాంతి, ఆవిష్కరణ, అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం అనేది ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కొత్త ఆరంభమని ఇరువురు నేతలు పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢమైన నమ్మకానికి, పంచుకున్న ప్రజాస్వామ్య విలువలకు, విశిష్టమైన స్నేహానికి నిదర్శనమని వారు అభివర్ణించారు. వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణలు, సంస్థలు, రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటి రంగాలలో ప్రస్తుతం కొనసాగుతున్న సహకారం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.వారణాసిలో 72 వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 04th, 01:00 pm
ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, యూపీ ప్రభుత్వ మంత్రులు - సోదరులు రవీంద్ర జైస్వాల్, దయాశంకర్, గిరీష్ యాదవ్, బనారస్ మేయర్ - సోదరుడు అశోక్ తివారీ, ఇతర ప్రజాప్రతినిధులు, వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, దేశం నలుమూలల నుంచి నుండి విచ్చేసిన క్రీడాకారులు, కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులకు నమస్కారం.వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన ప్రధాని
January 04th, 12:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడాకారులందరికీ స్వాగతం పలికి అభినందించడం పట్ల వారణాసి పార్లమెంటు సభ్యునిగా సంతోషంగా ఉందని తెలిపారు. నేటి నుంచి నగరంలో జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు ఎంతో కష్టపడి ఈ జాతీయ స్థాయి పోటీలకు వచ్చారని.. రాబోయే రోజుల్లో వారణాసి గడ్డపై వారి కృషికి పరీక్ష ఎదురుకానుందని ఆయన ఉద్ఘాటించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి జట్లు ఇక్కడకు చేరుకున్నాయని.. ఇది 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోందని అభివర్ణించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న వారందరికీ ప్రధాన మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగ పాఠం
December 17th, 12:25 pm
పురాతన విజ్ఞానమూ, ఆధునిక ఆకాంక్షలూ కలిగిన ఒక దేశపు హృదయం వంటి ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. మీ పార్లమెంటు పట్ల, మీ ప్రజల పట్ల, మీ ప్రజాస్వామ్య ప్రస్థానం పట్ల ప్రగాఢ గౌరవంతో నేను మీ వద్దకు వచ్చాను. 140 కోట్ల భారతీయుల తరఫున స్నేహం, సద్భావన, సౌభ్రాతృత్వంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఇథియోపియాలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని
December 17th, 12:12 pm
భారత ప్రజల తరఫున ఇథియోపియా చట్టసభ సభ్యులకు మైత్రి, సద్భావనాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించడం, ఇథియోపియాలోని సామాన్యులు- రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గర్వించేలా ఎదుగుతున్న మహిళలు, దేశ భవితను తీర్చిదిద్దుతున్న యువతతో ఈ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి మాట్లాడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ ఆఫ్ ఇథియోపియా నిషాన్’ను తనకు అందించిన ఇథియోపియా ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబంధాల ప్రాధాన్యం దృష్ట్యా.. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలు ఈ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
December 06th, 08:14 pm
హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో భారత్‌కు, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను, ఇక్కడ తమ అభిప్రాయాలను పంచుకున్న సహచరులను అభినందిస్తున్నాను. శోభన గారు చెప్పిన వాటిలో నేను రెండు విషయాలను గమనించాను. మొదటిది, గతంలో మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇది సూచించారు అని చెప్పారు. మీడియాకు పని చేయమని చెప్పే సాహసం ఈ దేశంలో ఎవరూ చేయరు. కానీ నేను చెప్పాను. శోభన గారు, ఆమె బృందం అత్యంత ఉత్సాహంగా దానిని పూర్తి చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడే ఎగ్జిబిషన్ సందర్శించాను. మీ అందరూ కూడా తప్పనిసరిగా దానిని సందర్శించమని కోరుతున్నాను. ఫొటోగ్రాఫర్ మిత్రులు క్షణాలను చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఫొటోల్లో బంధించారు. ఇక రెండో విషయానికి వస్తే... నేను ఇంకా ఆమె చెప్పిన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని చెప్పి ఉండొచ్చు. దానికి బదులుగా ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని హిందుస్థాన్ టైమ్స్ చెబుతోందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 06th, 08:13 pm
న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కావడాన్ని గమనించినట్టు తెలిపారు. సదస్సు నిర్వాహకులకు, తమ ఆలోచనలు పంచుకున్నవారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. శోభనాజీ ప్రస్తావించిన రెండు అంశాలను తాను శ్రద్ధగా గమనించినట్లు శ్రీ మోదీ తెలిపారు. అందులో మొదటిది, గతంలో తాను ఈ వేదికకు వచ్చినప్పుడు చేసిన ఒక సూచనను ఆమె గుర్తు చేశారని, మీడియా సంస్థల విషయంలో అలా సూచనలు ఇవ్వడం చాలా అరుదని, అయినా తాను ఆ పని చేశానని ఆయన అన్నారు. ఆ సూచనను శోభనా జీ, వారి బృందం ఉత్సాహంగా అమలు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడు, ఫొటోగ్రాఫర్లు క్షణాలను చిరస్మరణీయంగా మలిచిన తీరును చూశానని, ఆ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆయన కోరారు. శోభనా జీ ప్రస్తావించిన రెండో అంశం గురించి శ్రీ మోదీ వివరిస్తూ, తాను దేశానికి సేవ చేస్తూ ఉండాలన్నది కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదని, ఇదే విధంగా సేవలు కొనసాగించాలని హిందుస్థాన్ టైమ్స్ పత్రికే స్వయంగా చెబుతున్నట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. ఇందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 28th, 03:35 pm
ఈ రోజు ఈ పవిత్ర సందర్భంలో నా మనసు శాంతితో నిండిపోయింది. సాధువులు, మహర్షుల సమక్షంలో కూర్చోవడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం శతాబ్దాల నాటి ఈ మఠం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేడుకలో మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి రాకముందు, రామాలయం... వీర్ విఠల్ ఆలయాల్లో పూజలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇక్కడి శాంతి, ప్రశాంత వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచాయి.గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
November 28th, 03:30 pm
“శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోంది. ఇది చాలా చారిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొంది. తరాలు మారినా, కాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదు. దీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారింది. మఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే సాధనను సేవతో, సంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు. కష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కమిటీలోని సభ్యులందరూ, ఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.అనువాదం: కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠంలో ‘లక్ష కంఠాల గీతా పారాయణం’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 28th, 11:45 am
నేను మొదలుపెట్టే ముందు.. కొంతమంది పిల్లలు తమ బొమ్మలను ఇక్కడికి తీసుకువచ్చారు. దయచేసి ఎస్పీజీ, స్థానిక పోలీసులు వాటిని తీసుకునే విషయంలో సహాయం చేయండి. మీరు వెనుక వైపున మీ చిరునామా రాస్తే నేను ఖచ్చితంగా మీకు ఒక ధన్యవాద లేఖ పంపుతాను. ఎవరి దగ్గర ఏమున్నా దయచేసి వారికి ఇవ్వండి. వారు వాటిని తీసుకుంటారు. మీరు కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఈ పిల్లలు ఎంత కష్టపడి పనిచేస్తారు. కొన్నిసార్లు వీటిని నేను గుర్తించక పోతే అది నాకు బాధ కలిగిస్తుంది.కర్ణాటకలోని ఉడుపిలో లక్ష కంఠ గీతా పారాయణ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 28th, 11:30 am
మూడు రోజుల క్రితం తాను గీతా భూమి అయిన కురుక్షేత్రంలో ఉన్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేశారు. నేడు శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు పొందిన, జగద్గురు శ్రీ మధ్వాచార్య గారి మహిమతో పావనమైన ఈ భూమికి రావడం తనకు అత్యంత సంతృప్తినిచ్చే విషయమని అన్నారు. ఈ సందర్భంలో లక్ష మంది ప్రజలు కలిసి చేసిన భగవద్గీత