Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi

July 26th, 10:27 pm

PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharat

‘వికసిత వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026’లో ప్రధానమంత్రి ప్రసంగం

July 26th, 05:00 pm

ఈ కార్యక్రమం నిజంగా ఎంతో ప్రత్యేకమైనది. దేశంలోని దాదాపు 250 జిల్లాల యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం.

PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026

July 26th, 04:30 pm

PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పీఎం ప్రసంగానికి తెలుగు అనువాదం

July 06th, 06:47 pm

కేంద్ర క్యాబినెట్లో సహ మంత్రులు అమిత్ భాయ్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బీజేపీ సీనియర్ సభ్యులు, నాలాంటి లక్షలాది మంది కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచే శ్రీ మఖన్‌లాల్ జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శమిక్ భట్టాచార్య, గౌరవ ప్రజా ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 06th, 06:17 pm

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా నిర్ణయించిన ప్రయాణాల కారణంగా స్వయంగా హాజరుకాలేకపోతున్నట్లు చెప్పిన ఆయన.. ఇలాంటి ఒక చరిత్రాత్మక సందర్భంలో భౌగోళిక అడ్డంకులను అధిగమించటంలో డిజిటల్ అనుసంధానత అద్భుతమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. సాంకేతికత సహాయంతో నేను ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మీతో భాగస్వామిని అవుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.

'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.

May 31st, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.

సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

May 11th, 12:28 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. పునర్నిర్మాణం తర్వాత సోమనాథ్ ఆలయంలోకి భక్తులను అనుమతించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ సందర్శనకు వెళ్లటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

గుజరాత్‌లోని ప్రభాస్ పటన్‌ వద్ద జరిగిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగం

May 11th, 10:20 am

గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణానంతర ప్రతిష్ఠాపనోత్సవానికి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన అమృత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ అమృత మహోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 11th, 10:15 am

గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణానంతర ప్రతిష్ఠాపనోత్సవానికి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన అమృత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

May 10th, 11:05 am

ఈ ఉదయం నాకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించింది. వేద మంత్రోచ్చారణతో చిన్నారులు పలికిన స్వాగతం, శ్రీ గణేశుని దర్శనం, శ్రీ శ్రీ రవి శంకర్ 70వ జన్మదినోత్సవం, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ 45వ వార్షికోత్సవం.. ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ అద్భుతమైన ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 10th, 11:00 am

కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికున్న పవిత్రత గురించి ప్రధాని తెలియజేశారు. వేద మంత్రాలతో చిన్నారులు స్వాగతం పలకడం, గణేశుని దర్శనం, శ్రీ శ్రీ రవి శంకర్ 70వ సంవత్సరం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాలతో ఈ ఉదయం ప్రత్యేకంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు... ప్రతిచోటా వికసిస్తున్న కమలం: బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి ప్రధాని మోదీ

May 04th, 07:01 pm

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో ఘన విజయాల అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ క్షణం చారిత్రాత్మకమైనదని, భావోద్వేగభరితమైనదని, ప్రజాస్వామ్యంపై, పనితీరు ఆధారిత పాలనపై నమ్మకానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనమని అభివర్ణించారు. ధోవతితో కూడిన సాంప్రదాయ బెంగాలీ దుస్తులలో కనిపించిన ప్రధాని, బెంగాల్‌తో తనకున్న గాఢమైన సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ, ఆ రాష్ట్రానికి లభించిన చారిత్రాత్మక తీర్పు యొక్క ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచారు.

వివిధ రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగం

May 04th, 07:00 pm

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో ఘన విజయాల అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ క్షణం చారిత్రాత్మకమైనదని, భావోద్వేగభరితమైనదని, ప్రజాస్వామ్యంపై, పనితీరు ఆధారిత పాలనపై నమ్మకానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనమని అభివర్ణించారు. ధోవతితో కూడిన సాంప్రదాయ బెంగాలీ దుస్తులలో కనిపించిన ప్రధాని, బెంగాల్‌తో తనకున్న గాఢమైన సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ, ఆ రాష్ట్రానికి లభించిన చారిత్రాత్మక తీర్పు యొక్క ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచారు.

సిక్కిం రాష్ట్ర 50వ ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 28th, 10:25 am

సిక్కిం గవర్నర్ శ్రీ ఓం మాథుర్, ప్రజలెన్నుకున్న, ఉత్సాహవంతుడైన యువకుడు, నా ప్రియ మిత్రుడైన ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, పార్లమెంటులో నా సహసభ్యులు శ్రీ దోర్జీ షెరింగ్ లెప్చా, డాక్టర్‌ ఇంద్ర హాంగ్ సుబ్బా, శ్రీ దిల్లీ రామ్ థాపా, రాష్ట్రంలోని నా ప్రియ సోదరీసోదరులారా!

PM Modi participates in the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim

April 28th, 10:15 am

Addressing the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim, PM Modi said the state exemplifies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. Highlighting tourism, sporting talent and the role of self-help groups in Sikkim, he termed the Northeast as India’s ‘Asht Lakshmi’ and called for collective efforts to accelerate Sikkim’s development and realise Viksit Bharat.

నేడు బీజేపీ సుపరిపాలనకు మరియు ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తికి కూడా లబ్దిని అందించడానికి (last-mile delivery) నిదర్శనంగా నిలుస్తోంది: ప్రధాని మోదీ

April 06th, 12:30 pm

పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తరతరాల కార్యకర్తలకు, వారి అంకితభావానికి, త్యాగానికి, అచంచలమైన నిబద్ధతకు నివాళులర్పించారు. బీజేపీకి అధికారం గానీ, వనరులు గానీ లేని తొలినాళ్లలో, ప్రజలతో మమేకమవ్వడానికి కార్యకర్తలు అవిశ్రాంతంగా పర్యటించిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ, రాజకీయ ఒంటరితనం, హింస వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత్ ఉజ్వల భవిష్యత్తుపై వారికున్న నమ్మకమే వారిని ముందుకు నడిపించిందని ఆయన పునరుద్ఘాటించారు.

బీజేపీ స్థాపన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

April 06th, 12:00 pm

పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తరతరాల కార్యకర్తలకు, వారి అంకితభావానికి, త్యాగానికి, అచంచలమైన నిబద్ధతకు నివాళులర్పించారు. బీజేపీకి అధికారం గానీ, వనరులు గానీ లేని తొలినాళ్లలో, ప్రజలతో మమేకమవ్వడానికి కార్యకర్తలు అవిశ్రాంతంగా పర్యటించిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ, రాజకీయ ఒంటరితనం, హింస వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత్ ఉజ్వల భవిష్యత్తుపై వారికున్న నమ్మకమే వారిని ముందుకు నడిపించిందని ఆయన పునరుద్ఘాటించారు.

గుజరాత్‌లోని పోరుబందరులో మాధవపూర్ మేళా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

March 29th, 10:23 am

గుజరాత్‌లోని పోరుబందరులో జరుగుతున్న మాధవ్‌పూర్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సాహభరితమైన వేడుక మన ఘనమైన సంస్కృతిని చాటిచెబుతుందనీ... గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల మధ్య గల శాశ్వత సాంస్కృతిక బంధాన్ని మరింత బలపరుస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, ఈ పండుగ విభిన్న సంప్రదాయాలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. ప్రజలందరూ ఈ మేళాను సందర్శించాలని నేను పిలుపునిస్తున్నాను! అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 14th, 11:00 am

పొంగల్ ఈ రోజున నిజంగా ఓ అంతర్జాతీయ పర్వదినంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగాగల తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా దీన్ని అపరిమిత ఉత్సాహంతో నిర్వహించుకుంటారు. అటువంటి వారిలో నేనూ ఒకడిని. అందుకే, ఈ ప్రత్యేక పండుగ వేడుకల్లో మీ సంతోషంలో పాలుపంచుకోవడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. తమిళుల జీవనంలో పొంగల్ పంగుడ మధురానుభూతి. భూమాత, అన్నదాతలతోపాటు సూర్య భగవానునిపై మానవాళి కృతజ్ఞతకు ఈ పండగ ఓ ప్రతీక. ప్రకృతితో, కుటుంబంతో, సమాజంతో సామరస్యానికిగల ప్రాధాన్యాన్ని ఇది మనకు అవగతం చేస్తుంది. ఇదే సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లోనూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు వంటి పేర్లతో ఈ పర్వదినాన ప్రజలు సంబరాల్లో తలమునకలై ఉన్నారు. దేశవిదేశాల్లోని తమిళ సోదరీసోదరులందరికీ పొంగల్ సహా ఈ పండుగల వేళ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

న్యూఢిల్లీలో పొంగల్ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పొంగల్ ప్రపంచ పండుగలా మారింది: పీఎం

January 14th, 10:45 am

ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. తమిళంలో శుభాకాంక్షలు చెప్పిన శ్రీ మోదీ... “ఈ రోజు పొంగల్ ఒక ప్రపంచ పండుగలా మారింది” అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా ఉత్సాహంగా పొంగల్ని నిర్వహించుకుంటున్నారనీ, తానూ వారిలో ఒకడినని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేక పండుగను అందరితో కలిసి జరుపుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. తమిళుల జీవితంలో ఒక ఆహ్లాదకరమైన అనుభూతి లాంటిదనీ... ఇది రైతుల శ్రమకు, భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ అని శ్రీ మోదీ తెలిపారు. అదే సమయంలో ప్రకృతిలో, కుటుంబంలో, సమాజంలో సమతుల్యత దిశగా మనకు ఈ పండుగ మార్గనిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు, ఇతర పేర్లతో ఈ పండుగ చేసుకుంటున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. పొంగల్ పండుగ సందర్భంగా దేశవిదేశాల్లో ఉన్న తమిళ సోదరీ సోదరులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.