ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి
March 21st, 04:26 pm
ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయటంపై ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్‌లో మాట్లాడారు.బహ్రెయిన్ రాజుతో మాట్లాడిన ప్రధానమంత్రి
March 20th, 07:57 pm
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. బహ్రెయిన్ రాజుకి పండుగ శుభాకాంక్షలు తెలపడంతోపాటు.. ప్రాంతీయ భద్రతా అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిపారు.ఖతార్ పాలకుడితో మాట్లాడిన ప్రధానమంత్రి ఈద్ శుభాకాంక్షలు తెలిపి... ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించిన ప్రధానమంత్రి
March 19th, 10:00 pm
ఖతార్ పాలకుడు శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈద్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రాంతీయ భద్రత పరమైన ఆందోళనలపై చర్చించారు.ఒమన్ సుల్తాన్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వంపై చర్చ
March 19th, 04:39 pm
ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలప్రదమైన చర్చలు జరిపారు. పండగ శుభాకాంక్షలను తెలపడంతో పాటు.. ఆ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులపై చర్చించారు.కువైట్ యువరాజుతో ప్రధానమంత్రి సంభాషణ
March 18th, 06:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కువైట్ యువరాజు మాననీయ షేక్ సబా అల్-ఖాలెద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయనకు ఈద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ప్రాంతీయ భద్రత పరిణామాలపై వారిద్దరూ సమీక్షించారు.యూఏఈ అధ్యక్షునితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. పశ్చిమ ఆసియాలో వర్తమాన స్థితి గురించి చర్చ
March 17th, 10:42 pm
యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్ మొహమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడి, ఈద్ కు ముందస్తు శుభాకాంక్షల్ని తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు పశ్చిమ ఆసియాలో వర్తమాన స్థితిని గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు. యూఏఈ లో అమాయక ప్రజల ప్రాణాలను హరించిన, పౌర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించిన అన్ని దాడుల్నీ భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధాని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం సురక్షితంగా, నిరంతరాయంగా కొనసాగేటట్లు చూడడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందేనని విషయాన్ని ప్రధానమంత్రితో పాటు అధ్యక్షుడు కూడా అంగీకరించారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించేందుకు రెండు దేశాలు కలసి నిరంతరం కృషి చేస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు.మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు
September 05th, 08:31 am
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పవిత్రమైన రోజు మన సమాజంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని ఆశిస్తున్నాను. దయ, సేవా భావం, న్యాయం వంటి విలువలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలవాలి’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
September 16th, 10:43 am
ఈ రోజున ‘మిలాద్-ఉన్-నబీ’ సందర్భంగా పౌరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలిపారు.మిలాద్-ఉన్-నబి సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
October 30th, 11:41 am
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ శుభదినాన అంతటా కరుణ మరియు సోదరభావం మరింత విస్తరించాలని ఆశిస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండాలన్నది నా ఆకాంక్ష. ఈద్ ముబారక్! అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అన్నారు.‘మన్ కీ బాత్’ రెండోవిడత 17వ సంచికలో భాగంగా 25.10.2020న ప్రధానమంత్రి ప్రసంగం
October 25th, 11:00 am
మిత్రులారా! ఈ పండుగలలో కూడా సరిహద్దుల్లో నిలబడి ఉన్న మన ధైర్యవంతులైన సైనికులను మనం గుర్తుంచుకోవాలి. వారంతా భారతమాటకు సేవ చేస్తూ రక్షిస్తున్నారు. వారందరినీ గుర్తు చేసుకుంటూ మనం మన పండుగలను జరుపుకోవాలి. భారతమాత ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలను గౌరవించడానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించాలి. మీరు సరిహద్దులో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీతోనే ఉందని, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తోందని నా ధైర్యవంతులైన సైనికులకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుమారులు, కుమార్తెలు ఉన్న ఆ కుటుంబాల త్యాగానికి నేను వందనం చేస్తున్నాను. దేశానికి సంబంధించిన కొంత బాధ్యత కారణంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం
October 20th, 05:40 pm
PM Modi addressed the nation over Covid-19 situation and said that the lockdown may have been lifted but warned adding the “virus is still out there.” PM Modi cautioned people to not lose guard during the festive season and urged the countrymen to wear masks, maintain social distancing and ensure hand hygiene. PM Modi said, Government is earnestly working towards developing, manufacturing and distribution of Covid-19 vaccine to every citizen, whenever it is available.జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రత్యేక ప్రసంగం
October 20th, 05:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ టెలివిజన్ ద్వారా దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ, కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో, పౌరులెవరూ, తమ రక్షణను తగ్గించవద్దనీ, ఆత్మసంతృప్తి చెందవద్దనీ, పౌరులందరికీ ఒక తీవ్రమైన విజ్ఞప్తి చేశారు.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ యొక్క అధ్యక్షుడి తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధాన మంత్రి
August 03rd, 07:49 pm
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ యొక్క అధ్యక్షుడు డాక్టర్ అశ్ రఫ్ గనీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు. హర్షభరితమైన పండుగ ‘ఈద్- ఉల్- అజ్ హా’ సందర్భం లో నేత లు ఉభయులు ఒకరి కి మరొకరు శుభకామనల ను వ్యక్తం చేసుకొన్నారు.ఈద్-ఉల్-అజ్ హా సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 01st, 10:10 am
ఈద్-ఉల్-అజ్ హా సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.మిలాద్- ఉన్- నబీ నాడు దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
November 10th, 12:18 pm
మిలాద్– ఉన్– నబీ ఈ రోజు కావడం తో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ఇవే మిలాద్– ఉన్– నబీ శుభాకాంక్షలు. ఈ దినం ప్రవక్త మహమ్మద్ భావాల తో ప్రేరణ ను పొంది సమాజం లో కరుణ ను మరియు సద్భావన తాలూకు స్ఫూర్తి ని పెంపొందించుగాక. సర్వత్రా శాంతి వర్ధిల్లుగాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.ఈద్ అల్-అజ్ హా సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 12th, 09:21 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల కు ఈద్ అల్-అజ్ హా సందర్భం లో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈద్ అల్-అజ్ హా ను పురస్కరించుకొని ఇవే నా శుభాకాంక్షలు. ఈ పర్వదినం మన సమాజం లో శాంతి మరియు సంతోషాల భావనల ను మరింత పెంపొందిస్తుందని ఆశిస్తున్నాను. ఈద్ ముబారక్’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.మిలాద్-ఉన్-నబీ నాడు దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
November 21st, 08:40 am
శుభప్రదమైన మిలాద్-ఉన్-నబీ సందర్భం గా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలకు ఈద్ శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
June 16th, 10:10 am
ఈద్ పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రధాన మంత్రి – మనసులో మాట – ప్రసారణ తేదీ 27.05.2018
May 27th, 11:30 am
నమస్కారం! ’మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా మరోసారి మీ అందరి ముందుకూ వచ్చే అవకాశం లభించింది. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది నావికా దళానికి చెందిన ఆరుగురు మహిళా కమాండర్ల బృందం గత కొద్ది నెలల క్రితం సముద్రయానం చేస్తున్నారని చెప్పిన సంగతి.ఆకాశవాణి లో 2017 నవంబర్ 26న ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం 38వ సంచిక ప్రసంగ పాఠం
November 26th, 11:30 am
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! కొద్ది కాలం క్రితం నాకు కర్ణాటక కు చెందిన బాల మిత్రులతో పరోక్షంగా సంభాషించే అవకశం లభించింది. టైమ్స్ గ్రూప్ వారి “విజయ కర్ణాటక” అనే వార్తాపత్రిక వారు బాలల దినోత్సవం సందర్భంగా ఒక అభిప్రాయ సేకరణ జరిపారు. అందులో భాగంగా ప్రధానమంత్రికి ఉత్తరం రాయవలసిందిగా వారు బాలలను కోరారు.