అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లున్నప్పటికీ భారత్ సాధిస్తున్న పురోగతికి, దేశ సంస్కరణల వేగానికి ఆర్థిక సర్వే సమగ్ర ప్రతిబింబమని కొనియాడిన ప్రధానమంత్రి
January 29th, 08:31 pm
ఇవాళ సమర్పించిన ఆర్థిక సర్వే, భారతదేశ సంస్కరణల వేగానికి సమగ్ర రూపమని, అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లున్నప్పటికీ దేశం సాధిస్తున్న స్థిరమైన పురోగతిని ఇది ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. బలమైన స్థూల ఆర్థిక అంశాలు, సుస్థిర వృద్ధి, దేశ నిర్మాణంలో ఆవిష్కరణలు, వ్యాపార దక్షత, మౌలిక సదుపాయాల విస్తరణ పాత్రను ఆర్థిక సర్వే స్పష్టం చేసిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, యువతకు ఉపాధి, సామాజిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, సమ్మిళిత అభివృద్ధి ప్రాధాన్యతను ఈ సర్వే వెల్లడించింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయటానికి, ఉత్పాదకతను పెంచటానికి, వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం చేయటానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ని ఇది వివరించింది అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.