న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

September 12th, 04:54 pm

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!

‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం

September 12th, 04:45 pm

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్‌ భవన్‌ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్‌ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

గుజరాత్ లోని హన్సల్ పూర్ లో గ్రీన్ మొబిలిటీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం

August 26th, 11:00 am

గుజరాత్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్ గారు, భారత్ లోని జపాన్ రాయబారి కెయిచి ఓనో సాన్, సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి సాన్, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి తాకెచి సాన్, చైర్మన్ ఆర్ సీ భార్గవ గారు, హన్సల్ పూర్ ఉద్యోగులు, ఇతర ముఖ్య అతిథులు, ప్రియమైన పౌరులారా!

గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో హరిత రవాణాకు సంబంధించిన ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 26th, 10:30 am

స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్‌ ఆత్మనిర్భర్‌గా మారే దిశలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోనున్న హరిత రవాణా కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో ప్రారంభించారు. గణనాథుని పండుగ వాతావరణం మధ్య 'మేడిన్ ఇండియా' ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయంగా ప్రధాని పేర్కొన్నారు. భారత్‌తో తయారీ, ప్రపంచం కోసం తయారీ అనే ఉమ్మడి లక్ష్యం వైపు ఇదొక ముఖ్యమైన ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు ఈ రోజు నుంచి 100 దేశాలకు ఎగుమతి అవుతాయని తెలిపారు. దేశంలో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ తయారీని కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారత్, జపాన్ మధ్య స్నేహానికి ఈరోజు కొత్త కోణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. భారత ప్రజలందరితో పాటు జపాన్‌, సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Important to maintain the authenticity of handloom craftsmanship in the age of technology: PM at Bharat Tex

February 16th, 04:15 pm

PM Modi, while addressing Bharat Tex 2025 at Bharat Mandapam, highlighted India’s rich textile heritage and its growing global presence. With participation from 120+ countries, he emphasized innovation, sustainability, and investment in the sector. He urged startups to explore new opportunities, promoted skill development, and stressed the fusion of tradition with modern fashion to drive the industry forward.

భారత్ టెక్స్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం

February 16th, 04:00 pm

న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ‘భారత్ టెక్స్ 2025’ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను కూడా ఆయన పరిశీలించారు. సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరికీ భారత్ టెక్స్‌కు ఆహ్వానం పలుకుతున్నానన్నారు. ఈ రోజు భారత్ మండపంలో భారత్ టెక్స్ రెండో సంచికను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మా దేశ సంప్రదాయాలను కళ్లకు కట్టడంతోపాటు వికసిత్ భారత్ సాధనకు ఉన్న అవకాశాలను కూడా చాటుతోందని, ఇది ఇండియాకు గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ‘‘భారత్ టెక్స్ ఇక మెగా గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్‌గా ఎదుగుతోంది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు. వేల్యూ చైన్‌లో పాత్రధారులైన మొత్తం 12 సముదాయాలు ఈసారి ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నాయని కూడా ఆయన తెలిపారు. దుస్తులు, అనుబంధ వస్తువులు (ఏక్సెసరీస్), యంత్ర పరికరాలు, రసాయనాలు, అద్దకం రంగులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్న సంగతిని ఆయన ప్రస్తావించారు. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన విధాన రూపకర్తలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓలు), పరిశ్రమ నేతలకు వ్యాపారానికి, సహకారానికి, భాగస్వామ్యాల్ని ఏర్పరచుకోవడానికి ఒక బలమైన వేదికగా భారత్ టెక్స్ మారుతోందని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పాటును అందిస్తున్న ఆసక్తిదారులందరి కృషిని ఆయన ప్రశంసించారు.

The Genome India Project marks a defining moment in the country's biotechnology landscape: PM

January 09th, 06:38 pm

PM Modi delivered his remarks at the start of the Genome India Project. “Genome India Project is an important milestone in the biotechnology revolution”, exclaimed Shri Modi. He noted that this project has successfully created a perse genetic resource by sequencing the genomes of 10,000 inpiduals from various populations.

జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 09th, 05:53 pm

జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి ఇవాళ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. పరిశోధన రంగంలో భారత్‌ నేడు చారిత్రకంగా ముందంజ వేసిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 5 సంవత్సరాల కిందటే ఆమోదం లభించిందని ప్రధాని గుర్తుచేశారు. అయితే, కోవిడ్‌ మహమ్మారి ఎన్నో సవాళ్లు విసిరినా, మన శాస్త్రవేత్తలు అత్యంత శ్రద్ధాసక్తులతో దీన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో ‘ఐఐఎస్సీ, ఐఐటీ’, ‘సిఎస్ఐఆర్’, ‘డిబిటి-బ్రిక్’ వంటి 20కిపైగా విశిష్ట పరిశోధనా సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయని శ్రీ మోదీ వివరించారు. దీని ఫలితంగా 10,000 మంది భారతీయుల జన్యు క్రమంతో కూడిన సమాచారం నేడు భారత బయోలాజికల్ డేటా సెంటర్‌లో అందుబాటులో ఉందన్నారు. జీవ సాంకేతిక పరిశోధన రంగంలో ఈ ప్రాజెక్టు ఓ కీలక మలుపుగా నిలవగలదని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తంచేస్తూ, దీనితో ముడిపడిన భాగస్వామ్య సంస్థలన్నిటికీ అభినందనలు తెలిపారు.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

December 26th, 11:11 pm

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘అత్యంత విలక్షణ నాయకుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కోల్పోవడం పట్ల దేశ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు’’ అని శ్రీ మోదీ అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సాధారణ మూలాల నుంచి వచ్చి ఉన్నతమైన ఆర్థిక వేత్తగా ఎదిగారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసం విస్తృతంగా కృషి చేశారన్నారు.

ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ

November 19th, 08:34 am

రియో డి జెనీరో లో జరుగుతున్న జి-20 సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలు జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. 2024 జూన్, ఇటలీలోని ‘పూలీయా’ లో జార్జియా మెలోనీ అధ్యక్షతన ఏర్పాటైన జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన నేటి సమావేశం గత రెండేళ్ళలో అయిదోది. ఎన్నో సమస్యల మధ్య చేపట్టిన జి-7 అధ్యక్ష పదవికి సమర్ధమైన నేతృత్వం అందిస్తున్నందుకు శ్రీ మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు తెలియజేశారు.

18వ ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు (ఏపీకే 2024)లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

October 25th, 11:20 am

ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు అధ్యక్షుడు డాక్టర్ బుష్,

జమైకా ప్రధాని హెచ్.ఇ డాక్టర్. ఆండ్రూ హోల్నెస్ అధికారిక భారత పర్యటన సందర్భంగా (సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు) జరిగిన ఒప్పందాలు

October 01st, 12:30 pm

ఆర్థిక సేవలు, ఉత్పత్తులను అందరికీ అందుబాటులో ఉంచడం, సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతిని ప్రోత్సహించే లక్ష్యంతో విజయవంతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పంచుకునే విషయంలో పరస్పర సహకారంపై భారత్, జమైకా ప్రభుత్వాల తరపున భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, జమైకా ప్రధాన మంత్రి కార్యాలయం మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం.

Economic Survey highlights prevailing strengths of our economy, showcases outcomes of various Government reforms: PM

July 22nd, 07:15 pm

The Prime Minister, Shri Narendra Modi has remarked that the Economic Survey highlights the prevailing strengths of our economy and also showcases the outcomes of the various reforms brought by the Government.

జి-7 సదస్సు నేపథ్యంలో ఇటలీ ప్రధానితో ప్రధానమంత్రి సమావేశం

June 14th, 11:40 pm

రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి రాజకీయ సంప్రదింపులు క్రమబద్ధంగా సాగుతుండటంపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రగతిని సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం పురోగమిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. పరిశుభ్ర ఇంధనం, తయారీ, అంతరిక్షం, శాస్త్ర-సాంకేతిక, టెలికాం, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు తదితర రంగాల్లో సుస్థిర సరఫరా శ్రేణి నిర్మాణం దిశగా వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్క్ వంటి అంశాల్లో సహకార చట్రం రూపకల్పన సంబంధిత పారిశ్రామిక సంపద హక్కుల (ఐపిఆర్) ఒప్పందంపై ఇటీవల సంతకాలు పూర్తికావడంపై వారిద్దరూ హర్షం ప్రకటించారు.

PM Modi interacts with the Indian community in Paris

July 13th, 11:05 pm

PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.

సమాజంలోని అన్ని వర్గాలకు సహాయం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి కొనసాగింపే, నేటి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ : ప్రధానమంత్రి

November 12th, 10:29 pm

నేటి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ సమాజంలోని అన్ని వర్గాలకు సహాయం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి కొనసాగింపు అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

We are focussing on making tax-paying seamless, painless, faceless: PM Modi

August 13th, 11:28 am

PM Narendra Modi rolled out a taxpayers charter and faceless assessment on Thursday as part of the government's effort to easing the compliance for assessees and reward the honest taxpayer. He also launched the Transparent Taxation - Honoring The Honest platform, in what he said will strengthen efforts of reforming and simplifying the country's tax system.

పన్నుల కు సంబంధించి ‘‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ద ఆనెస్ట్’’ పేరిట ఏర్పాటు చేసిన ఒక నూతన వ్యవస్థ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 13th, 10:27 am

పన్నుల కు సంబంధించి ‘‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ద ఆనెస్ట్’’ పేరిట ఏర్పాటు చేసిన ఒక నూతన వ్యవస్థ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ప్రారంభించారు.

Prime Minister reviews “Project Arth Ganga” : Correcting imbalances; connecting people

May 15th, 08:43 pm

Prime Minister Shri Narendra Modi today reviewed the plans being envisaged for implementing “Project Arth Ganga”.

భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క లాంఛనప్రాయీకరణ మరియు ఆధునీకరణపై మేము దృష్టి సారించాము: ప్రధాని మోదీ

December 20th, 11:01 am

అస్సోచామ్ శతవార్షిక ఉత్సవాలను ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అని చెప్పడానికి నాలుగు పదాలు అవసరమని ఆయన అన్నారు, అయితే ప్రభుత్వం మరియు మొత్తం వ్యవస్థ రోజు మరియు వెలుపల పనిచేసేటప్పుడు, అట్టడుగు స్థాయికి వెళ్లడం ద్వారా ర్యాంకింగ్స్ మెరుగుపడతాయి. భారతదేశం అత్యంత వ్యాపార స్నేహపూర్వక దేశాలలో ఒకటిగా ప్రధాని పేర్కొన్నారు మరియు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ లో దేశం 63 వ స్థానంలో ఉందని పేర్కొన్నారు.