ఢిల్లీ ఓటర్లు నగరాన్ని 'ఆప్-డా' నుండి విముక్తి చేయాలని సంకల్పించారు: ప్రధాని మోదీ
January 03rd, 01:03 pm
పేద కుటుంబాలకు ఇళ్లు సహా కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రతి పౌరుడికి పక్కా ఇంటి లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ, వృద్ధి, వ్యవస్థాపకత మరియు మహిళల నేతృత్వంలోని అభివృద్ధి సంవత్సరంగా 2025 కోసం భారతదేశ విజన్‌ను ఆయన నొక్కి చెప్పారు.ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
January 03rd, 12:45 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు న్యూఢిల్లీలో పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ శ్రీ మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025వ సంవత్సరం భారత దేశ అభివృద్ధికి విస్తృత అవకాశాలను తీసుకువస్తుందని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యం వైపు దేశాన్ని ముందుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక సుస్థిరతలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా మారింది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఏడాది దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దేశం ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా మారడం, అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో యువతకు సాధికారత కల్పించడం, వ్యవసాయంలో నూతన రికార్డులు నెలకొల్పడం, మహిళా కేంద్ర అభివృద్ధిని ప్రోత్సహించడం, జీవన సౌలభ్యంపై దృష్టి సారించి ప్రతి పౌరునికీ నాణ్యమైన జీవితాన్ని అందించడమే 2025లో భారత్ లక్ష్యమని శ్రీ మోదీ వివరించారు.ఈ నెల 13న ముంబైలో ప్రధానమంత్రి పర్యటన
July 12th, 05:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 13వ తేదీన ముంబై నగరంలో పర్యటిస్తారు. ఆ రోజున సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ముంబైలోని గోరెగాఁవ్‌లో నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడ రహదారులు, రైల్వేలు, ఓడరేవుల రంగాలకు సంబంధించి రూ.29,400 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రాత్రి 7:00 గంటల ప్రాంతంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోగల జి-బ్లాక్‌లో ఇండియన్ న్యూస్ సర్వీస్ (ఐఎన్ఎస్) సెక్రటేరియట్‌కు వెళ్లి, ‘ఐఎన్ఎస్’ టవర్లను ప్రారంభిస్తారు.