మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల్లో ప్రమాదం... ప్రాణనష్టం పట్ల ప్రధాని సంతాపం

February 05th, 08:36 pm

మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల్లో ఈ రోజు జరిగిన ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.