డామన్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన...జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 07:20 pm
మీరంతా ఇక్కడకు ఎలాగైతే వచ్చారో అలాగే లక్షద్వీప్‌లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనతో అనుసంధానమయ్యారు. ఈరోజు లక్షద్వీప్‌లో అభివృద్ధికి ఒక కొత్త ఆరంభం జరిగింది. లక్షద్వీప్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఒక కొత్త ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించడంతో పాటు కొన్ని పథకాలకు శంకుస్థాపనలు కూడా చేశాం.డామన్‌లో సుమారు రూ. 2,970 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు... ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 07:15 pm
డామన్‌లో సుమారు రూ.2,970 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన గత పర్యటనను గుర్తుచేసుకుంటూ, తాను గతంలో చేసిన పరిశీలన ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు వైవిధ్యభరితమైన, చైతన్యవంతమైన మన దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నివసించే వివిధ ప్రాంతాల ప్రజలతో యావత్ దేశపు అందమైన దృశ్యాన్ని అందిస్తూ, మినీ ఇండియాకు సజీవ ఉదాహరణగా డామన్ నిలుస్తోంది అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 04:30 pm
విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!గుజరాత్‌లోని సూరత్‌లో ₹18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 04:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.జూన్ 5న సూరత్, దమన్‌లలో ప్రధానమంత్రి పర్యటన
June 04th, 10:03 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 26న గుజరాత్, దమన్‌లలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు, ప్రధానమంత్రి సూరత్ జిల్లా హజీరాలో పర్యటించి, అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు, సూరత్‌లో సుమారు రూ.18,800 కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితమివ్వడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్బంగా జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.Cabinet approves road upgradation projects in Madhya Pradesh worth Rs. 4,415.60 Crore
June 03rd, 03:29 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved upgradation of Hiwarkhedi-Roshni-Ashapur-Rudhy Section of NH-347B and widening of Deshgaon-Julwaniya Section of NH-347B in Madhya Pradesh at a cost of Rs.4,415.60 Crore. The upgraded corridor will enhance multi-modal integration by connecting with 6 PM Gati-Shakti Economic Nodes, 5 social nodes and 5 Logistic Nodes, thereby facilitating faster movement of goods and passengers across the region.బీహార్‌లో జాతీయ రహదారి-31.. 231ల పరిధిలోని ఖగారియా-పూర్నియా విభాగం ఉన్నతీకరణకు మంత్రిమండలి ఆమోదం
June 03rd, 03:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) బీహార్‌లోని జాతీయ రహదారి-31, 231ల పరిధిలోగల ఖగారియా-పూర్నియా విభాగం ఉన్నతీకరణకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిర్మాణం-నిర్వహణ-బదిలీ-టోల్ (బీఓటీ-టోల్) పద్ధతిలో 4 వరుసల ప్రమాణాలకు అనుగుణంగా 143.529 కిలోమీట్లర పొడవైన ఈ ప్రాజెక్టును రూ.3936.05 కోట్ల వ్యయంతో ఉన్నతీకరిస్తారు.మే 10, 11వ తేదీల్లో గుజరాత్‌లో పీఎం పర్యటన
May 09th, 11:19 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2026 మే 10, 11వ తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. మే 10న రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకుంటారు. మే 11న ఉదయం 10:15 గంటలకు సోమనాథ్ ఆలయంలో జరిగే సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అనంతరం ప్రధానమంత్రి వడోదరాకు వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు సర్దార్‌ధామ్ హాస్టల్‌ను ప్రారంభిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఏర్పాటు చేసిన సభల్లో ఆయన ప్రసంగిస్తారు.మే 10న కర్ణాటక, తెలంగాణలో పీఎం పర్యటన
May 09th, 11:17 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 10, 2026న కర్ణాటక, తెలంగాణల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు బెంగళూరులో జరిగే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 3:45 గంటలకు హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్, వియత్నాం దేశాల సంయుక్త ప్రకటన
May 06th, 05:24 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం దేశాధ్యక్షుడు శ్రీ తో లామ్ 2026 మే 05 నుంచి మే 07 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈయనతో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో పాటు వ్యాపార ప్రతినిధుల బృందం కూడా పర్యటనలో పాల్గొంది.వియత్నాం అధ్యక్షుడి అధికారిక భారత పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
May 06th, 03:44 pm
ఐఆర్ఈఎల్ (భారత్), వియత్నాంకు చెందిన రేడియోధార్మిక - అరుదైన మూలకాల సాంకేతిక సంస్థ (ఐటీఆర్ఆర్ఈ) మధ్య పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందంవియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం అధ్యక్షుడితో ఉమ్మడి మీడియా సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
May 06th, 01:00 pm
భారత్-వియత్నాం భాగస్వామ్యంలో వారసత్వం, అభివృద్ధి రెండూ కీలకమే. గతేడాది భారత్ నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాలను వియత్నాంకు తీసుకువెళ్లినప్పుడు అక్కడి జనాభాలో సుమారు పదిహేను శాతం మంది అంటే.. పదిహేను మిలియన్లకు పైగా ప్రజలు వాటిని దర్శించుకున్నారు. మన ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించేందుకు, వియత్నాంలోని మై సన్, న్హాన్ టవర్స్ వద్ద ప్రాచీన చాం నాగరికత దేవాలయాల పునరుద్ధరణను మేం చేపడుతున్నాం. చాం నాగరికతకు సంబంధించిన రాతప్రతులను కూడా డిజిటలైజ్ చేసి, ఈ అమూల్యమైన వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరుస్తున్నాం.సిక్కిం రాష్ట్ర 50వ ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 28th, 10:25 am
సిక్కిం గవర్నర్ శ్రీ ఓం మాథుర్, ప్రజలెన్నుకున్న, ఉత్సాహవంతుడైన యువకుడు, నా ప్రియ మిత్రుడైన ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, పార్లమెంటులో నా సహసభ్యులు శ్రీ దోర్జీ షెరింగ్ లెప్చా, డాక్టర్ ఇంద్ర హాంగ్ సుబ్బా, శ్రీ దిల్లీ రామ్ థాపా, రాష్ట్రంలోని నా ప్రియ సోదరీసోదరులారా!PM Modi participates in the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim
April 28th, 10:15 am
Addressing the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim, PM Modi said the state exemplifies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. Highlighting tourism, sporting talent and the role of self-help groups in Sikkim, he termed the Northeast as India’s ‘Asht Lakshmi’ and called for collective efforts to accelerate Sikkim’s development and realise Viksit Bharat.ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 01:25 pm
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, కార్యశీలుడైన ప్రజాదరణగల యువ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ అజయ్ టమ్టా, సాంకేతిక మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ మహేంద్ర భట్ సహా వేదికను అలంకరించిన మాజీ గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, మాజీ ముఖ్యమంత్రులైన సోదరులు శ్రీ రమేష్ పోఖ్రియాల్, శ్రీ విజయ్ బహుగుణ, శ్రీ తీరథ్ సింగ్ రావత్, శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీసోదరులందరికీ అభివందనం.ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
April 14th, 01:20 pm
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, చుట్టుపక్కల ప్రాంత అభివృద్ధిలో కీలక ఘట్టమిది. డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బైశాఖి, బోహాగ్ బిహు, పుతాండు పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పండుగ శోభ నెలకొన్న వేళ ఈ ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు.ఏప్రిల్ 14న ఉత్తరాఖండ్, యూపీల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి
April 13th, 04:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఏప్రిల్ 14న ఉత్తరాఖండ్‌లోను, ఉత్తరప్రదేశ్‌లోను పర్యటించనున్నారు. ఉదయం సుమారు 11:15 గంటలకు ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ చేరుకొంటారు. ఢిల్లీ -డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ లో ఉన్నత భాగమైన వైల్డ్‌లైఫ్ కారిడార్ గురించి ప్రధానమంత్రి సమీక్షిస్తారు. ఉదయం దాదాపు 11:40 గంటలకు ప్రధాని డెహ్రాడూన్ సమీపంలో జై మా దాత్ కాళీ ఆలయాన్ని దర్శించుకొని, పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత, ఇంచుమించు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధానమంత్రి డెహ్రాడూన్‌లో ఒక జనసభలో పాల్గొని, ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.TMC is Anti-North Bengal, Anti-tribal, Anti-tea garden, Anti-women & Anti-youth: PM Modi in Siliguri
April 12th, 01:15 pm
Ahead of the West Bengal Assembly elections, Prime Minister Narendra Modi today turbocharged the BJP’s campaign with a high-energy address in Siliguri, drawing massive public support. Addressing a packed rally in North Bengal, the PM launched a scathing attack on the ruling All India Trinamool Congress (TMC), accusing it of corruption, neglect and fostering a climate of fear.PM Modi’s high-energy speech electrifies the Siliguri crowd
April 12th, 01:00 pm
Ahead of the West Bengal Assembly elections, Prime Minister Narendra Modi today turbocharged the BJP’s campaign with a high-energy address in Siliguri, drawing massive public support. Addressing a packed rally in North Bengal, the PM launched a scathing attack on the ruling All India Trinamool Congress (TMC), accusing it of corruption, neglect and fostering a climate of fear.జైపూర్ మెట్రో ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గ ఆమోదం
April 08th, 04:24 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం.. జైపూర్ మెట్రో రెండో దశను ఆమోదించింది. ప్రహ్లాదపుర నుంచి టోడి మోడ్ వరకు 41 కి.మీ.ల పొడవుతో 36 స్టేషన్లతో కూడిన ఉత్తర-దక్షిణ కారిడార్ నిర్మాణాన్ని రూ.13,037.66 కోట్ల అంచనా వ్యయంతో చేపడతారు. కేంద్ర ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వాలు 50:50 భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును రాజస్థాన్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఎంఆర్‌సీఎల్) నిర్మిస్తుంది.