ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
June 06th, 06:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు ‘ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి’ సమావేశం జరిగింది. భారతదేశ ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాధాన్యతలకు సంబంధించిన విస్తృత శ్రేణి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రధాని పేర్కొన్నారు.భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి పథంలో దూసుకుపోతోందన్న ప్రధానమంత్రి
June 05th, 08:07 pm
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం అత్యంత బలంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నమోదైన 7.7 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటు, అదే ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం వృద్ధి రేటే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థ అంతర్గత బలాన్ని, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల విజయాన్ని, 140 కోట్ల మంది భారతీయుల కష్టాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి కొనియాడారు.రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 23rd, 11:15 am
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 23rd, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 19వ రోజ్‌గార్ మేళా (ఉగ్యోగ మేళా)లో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ప్రభుత్వ సేవలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలుకుతూ.. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలతో సహా పలు రంగాల్లో దేశ అభివృద్ధికి వారు అందించబోయే కీలక సహకారాన్ని ప్రస్తావించారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.నార్వే - భారత్ వ్యాపార, పరిశోధన సదస్సులో ప్రధాని ప్రసంగం
May 18th, 11:49 pm
నార్వే, భారత్ వ్యాపార, పరిశోధన వర్గాల మధ్య ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరి మాటలు వినే అవకాశం లభించింది. మన భాగస్వామ్యానికి పునాది చాలా బలంగా ఉందన్న నమ్మకం వారి మాటలు విన్న తర్వాత నాకు కలిగింది.భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
May 18th, 08:50 pm
ఓస్లోలో జరిగిన భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గౌరవ రాజు హాకాన్, నార్వే ప్రధానమంత్రి గౌరవ జోనాస్ గార్ స్టోర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 18th, 05:00 am
ముందుగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం గోథెన్‌బర్గ్‌లో జరగడం నాకు సంతోషంగా ఉంది. ఈ నగరం ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందినది. ఈ నగరం యూరప్ తయారీ రంగ స్ఫూర్తికి చిహ్నంగానూ నిలుస్తుంది.‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ని (ఈఆర్‌టీ) ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
May 17th, 12:12 am
గోథెన్‌బర్గ్‌లో 2026 మే 17న నిర్వహించిన 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' (ఈఆర్‌టీ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. వోల్వో గ్రూప్ నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్, ఐరోపా కమిషన్ అధ్యక్షులు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఐరోపాకు చెందిన సీనియర్ పారిశ్రామిక ప్రముఖులు, ప్రముఖ యూరోపియన్- భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.నెదర్లాండ్స్‌లో సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ప్రధాని ప్రసంగం
May 16th, 10:00 pm
ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు నిలయాలైన కొన్ని కంపెనీల అధినేతల నడుమ ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు 300కు పైగా డచ్ కంపెనీలు భారత్ ప్రస్థానంలో భాగమయ్యాయి. భారత్ పట్ల మీకున్న సానుకూల దృక్పథం, విశ్వాసం వల్లే.. ఐరోపా నుంచి భారత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా, రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నెదర్లాండ్స్ నిలిచింది.కాంగ్రెస్ అధికార దాహపు పుస్తకంలో 'పాలన' అనే అధ్యాయమే లేదు: బెంగళూరులో ప్రధాని మోదీ
May 10th, 09:46 am
కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రశంసిస్తూ, అస్థిరత మరియు కుంభకోణాల కంటే 'స్థిరత్వం, వేగం మరియు పరిష్కారాల'కే దేశ ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారని ఉద్ఘాటించారు. బెంగళూరు గడ్డపై నేడు కాషాయ సూర్యుడు ఉదయించాడని ఆయన పేర్కొన్నారు.కర్ణాటకలోని బెంగళూరులో భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
May 10th, 09:45 am
కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రశంసిస్తూ, అస్థిరత మరియు కుంభకోణాల కంటే 'స్థిరత్వం, వేగం మరియు పరిష్కారాల'కే దేశ ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారని ఉద్ఘాటించారు. బెంగళూరు గడ్డపై నేడు కాషాయ సూర్యుడు ఉదయించాడని ఆయన పేర్కొన్నారు.'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
March 29th, 11:30 am
ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్‌నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.Cabinet approves a New Era of Plug-and-Play Industrial Development through Bharat Audyogik Vikas Yojna (BHAVYA)
March 18th, 04:05 pm
In a landmark step towards accelerating industrial growth, the Union Cabinet chaired by PM Narendra Modi has approved the Bharat Audyogik Vikas Yojna (BHAVYA), with an allocation of Rs.33,660 crore for developing 100 plug-and-play industrial parks across the country. The scheme aims to develop world-class industrial infrastructure, unlocking manufacturing potential and driving India’s growth story.The voice of the Global South becomes stronger and more confident when India and Brazil work together: PM Modi at the India-Brazil Joint Press Meet
February 21st, 12:30 pm
In his statement at the India-Brazil Joint Press Meet, PM Modi lauded Brazil President Lula’s vision and leadership and said that his visit has added grace to the AI Impact Summit. He noted that in their discussions they deliberated on advancing in every field with shared purpose and shared aspirations. The PM expressed confidence that the President's visit will deepen the strategic partnership and open new avenues of cooperation in the years ahead.మలేషియాలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో ప్రధాని భేటీ
February 08th, 02:50 pm
మలేషియాకు చెందిన నలుగురు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. పెట్రోనాస్ అధినేత, ఆ గ్రూప్ సీఈవో తాన్ శ్రీ తెంగ్కు మహమ్మద్ తౌఫిక్, బెర్జాయా కార్పొరేషన్ బెర్హాద్ వ్యవస్థాపకుడు తాన్ శ్రీ దాతో సేరి విన్సెంట్ తాన్ చీ యియున్, ఖజానా నేషనల్ బెర్హాద్ మేనేజింగ్ డైరెక్టర్ దాతో అమీరుల్ ఫైసల్ వాన్ జహీర్, ఫైసన్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థాపకుడు దాతో పువా ఖైన్ సెంగ్‌తో ఆయన భేటీ అయ్యారు.అనువాదం: కేంద్ర బడ్జెట్‌పై ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
February 01st, 01:38 pm
నేటి బడ్జెట్ చారిత్రాత్మకమైనది. ఇది దేశంలోని 'నారీ శక్తి' (మహిళా శక్తి) శక్తిమంతమైన ప్రతిరూపంగా ఉంది. ఒక మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా గారు వరుసగా తొమ్మిదో సారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించారు. అపారమైన అవకాశాలకు ఒక రాజమార్గం ఈ బడ్జెట్. ఈ బడ్జెట్ వర్తమాన కాలపు కలలను సాకారం చేయడమే కాకుండా భారత్ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిని బలపరుస్తుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) వైపు మనం వేసే భారీ ప్రయాణానికి ఈ బడ్జెట్ ఒక బలమైన పునాది వంటిది.2026 కేంద్ర బడ్జెటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందన
February 01st, 01:00 pm
భారత్‌లో ప్రస్తుతం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోందనీ, ఈ బడ్జెటుతో ఈ ఎక్స్‌ప్రెస్ ఒక కొత్త శక్తినే కాకుండా ఓ కొత్త జోరును కూడా అందుకొంటుందని శ్రీ మోదీ వెల్లడించారు. ఇంతవరకు చేపట్టనటువంటి సంస్కరణల్ని చేపట్టినందువల్ల, భారత్‌లో వృద్ధి లోకి రావాలని తపించిపోతున్న, ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన యువతకు వారు ఉవ్వెత్తున ఎగరడానికి విశాల గగనాన్ని బడ్జెటు వారి ఎదుట ఆవిష్కరించిందని ఆయన అన్నారు. నమ్మకమైన పాలన, దేశ పౌరుల ప్రయోజనాలకు ప్రాముఖ్యాన్నిచ్చే ఆర్థిక ప్రణాళిక.. ఈ రెండు దృష్టికోణాలనూ బడ్జెటు సాకారం చేసిందని కూడా ఆయన చెప్పారు. ద్రవ్య లోటును తగ్గించడం, ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం, అదే సమయంలో అధిక మూలధన వ్యయానికీ, అధిక అభివృద్ధికీ పూచీని ఇవ్వడం.. వీటిపై దృష్టిని కేంద్రీకరించిన అద్వితీయ బడ్జెటు ఇదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.గువహటిలో సంప్రదాయ బోడో సాంస్కృతిక కార్యక్రమం ‘బకురుంబా దహోవ్’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 17th, 06:30 pm
అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, శాసనసభ స్పీకర్ శ్రీ బిశ్వజిత్ దైమరీ, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ పబిత్రా మార్గిరిటా, బోడోలాండ్ ప్రాదేశిక పాలన మండలి ముఖ్య కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ హగ్రామా మోహిలరి, రాష్ట్ర మంత్రులు, అస్సాంలోని నా విశిష్ట సోదరీసోదరులారా!అస్సాంలోని గౌహతిలో జరిగిన బగురుంబా ధహోవ్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
January 17th, 06:00 pm
గౌహతిలోని సరుసజాయ్ స్టేడియంలో నిర్వహించిన బోడో చారిత్రాత్మక సాంస్కృతిక కార్యక్రమం 'బగురుంబా ధహోవ్ 2026'ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అస్సాం సంస్కృతి చూడటం, బోడో సామాజిక వర్గ సంప్రదాయాలను నిశితంగా గమనించడం తన అదృష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. మరే ఇతర ప్రధానమంత్రి అస్సాంను తాను సందర్శించినంత తరచుగా సందర్శించలేదన్న ఆయన.. అస్సాం కళలు - సంస్కృతికి పెద్ద వేదిక లభించాలని, భారీ వేడుకల ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నట్లు ప్రధానంగా చెప్పారు. ఈ దిశగా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపిన ఆయన.. భారీ స్థాయిలో జరిగిన బిహు వేడుకలు, ఝుమోయిర్ వినోందిని ప్రదర్శన, ఏడాదిన్నర కిందట ఢిల్లీలో జరిగిన భారీ బోడో మహోత్సవ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఉదహరించారు. అస్సాం కళలు, సంస్కృతి అందించే అనన్యమైన ఆనందాన్ని అనుభవించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోనని అన్నారు. బగురుంబా పండుగను నిర్వహించడంపై మరోసారి సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. దీనిని బోడో అస్తిత్వానికి నిదర్శనంగా, అస్సాం వారసత్వ ప్రతీకగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న అందరికీ ముఖ్యంగా కళాకారులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.‘వికసిత భారత్ యువ సారథుల చర్చాగోష్ఠి-2026’ ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 06:45 pm
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, ఎంపీలు, వికసిత భారత్ యువ సారథుల పోటీ విజేతలు, ఇతర ప్రముఖులు, దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి హాజరైన నా యువ మిత్రులందరూ ఇక్కడ ఓ కొత్త అనుభూతిని పొంది ఉంటారు. మీరంతా అలసిపోలేదా? ఇప్పటికి రెండు రోజుల నుంచి అదేపనిగా ప్రసంగాలు వింటూనే ఉన్న మీకు మరోసారి వినడం అలసట అనిపిస్తోందా? ఏదేమైనా, పత్రికా సమావేశం సందర్భంగా నేను చెప్పాల్సిందేమిటో ఇప్పటికే చెప్పేశాను. నేను తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి మీలో చాలామంది పుట్టి కూడా ఉండరని నేను అనుకుంటున్నా. ఇక 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మీలో అధికశాతం ఇంకా పిల్లలుగానే ఉండి ఉంటారు. అయితే, ముఖ్యమంత్రిగా లేదా ఇవాళ ప్రధానమంత్రిగా యువతరంపై నాకు సదా అపారమైన నమ్మకం. మీ సామర్థ్యం, ప్రతిభ నుంచి నాకెప్పుడూ నవ్యోత్తేజం లభిస్తూంటుంది. ఈ నేపథ్యంలో వికసిత భారత్ స్వప్న సాకార సారథ్యం బాధ్యతను మీరు స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా.