ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా జన్మ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగం
November 19th, 11:00 am
పవిత్రమైన పుట్టపర్తి నేలపై నేడు మీ అందరి మధ్య ఉండటం నాకు ఒక భావోద్వేగంతో కూడిన ఆధ్యాత్మిక అనుభూతి. కొద్దిసేపటి క్రితం బాబా సమాధి వద్ద నివాళులు అర్పించే అవకాశం నాకు లభించింది. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందడం ఎల్లప్పుడూ నా హృదయాన్ని భావోద్వేగంతో నింపే అనుభవం.ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా శతజయంత్యుత్సవాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 19th, 10:30 am
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా భక్తకోటిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ‘సాయిరాం’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధానమంత్రి.. ఈ పవిత్ర పుట్టపర్తి క్షేత్రంలో భక్తులందరి నడుమ ఉండడం ఒక భావోద్వేగభరిత, ఆధ్యాత్మిక అనుభవమని పేర్కొన్నారు. కొద్దిసేపటి కిందటే బాబా సమాధి వద్ద పుష్పాంజలి ఘటించే అవకాశం తనకు దక్కిందన్నారు. బాబా పాదాలకు నమస్కరించి, ఆయన ఆశీస్సులను పొందినట్లు చెప్పారు. బాబా ఆశీస్సులు ఎప్పుడు అందించినా మనసు భావోద్వేగానికి లోనవుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ఫిలిప్పీన్స్ భూకంప మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
October 01st, 03:23 pm
ఫిలిప్పీన్స్‌లో భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టం, విస్తృత ఆస్తి నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.An RSS shakha is a ground of inspiration, where the journey from 'me' to 'we' begins: PM Modi
October 01st, 10:45 am
In his address at the centenary celebrations of the Rashtriya Swayamsevak Sangh (RSS), PM Modi extended his best wishes to the countless swayamsevaks dedicated to the resolve of national service. He announced that, to commemorate the occasion, the GoI has released a special postage stamp and a coin. Highlighting the RSS’ five transformative resolutions, the PM remarked that in times of calamity, swayamsevaks are among the first responders.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శత వార్షికోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 01st, 10:30 am
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శత వార్షికోత్సవాలు ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున మహా నవమి.. సిద్ధిధాత్రి అమ్మవారిని ఆరాధించేది ఈ రోజేనని ఆయన గుర్తు చేశారు. రేపు విజయదశమి మహా పర్వదినం.. ఈ పండుగ భారతీయ సంస్కృతిలో ఓ శాశ్వత జయఘోషకు సంకేతం.. అన్యాయంపై న్యాయం, అసత్యంపై సత్యం, చీకటిపై వెలుగు పైచేయిని సాధించిన సన్నివేశమని ఆయన అభివర్ణించారు. అంతటి పవిత్ర సందర్భంలో, వంద సంవత్సరాల కిందట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. ఇది యాదృచ్ఛిక ఘటన ఏమీ కాదని ఆయన ఉద్ఘాటించారు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించడమే.. దీనిలో భాగంగా ప్రతి యుగంలోనూ అప్పటి సవాళ్లను ఎదుర్కోవడానికి జాతీయ అంతశ్చేతన కొత్త కొత్త రూపాలను తీసుకొంటూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ యుగంలో, నిత్య జాతీయ చైతన్యం మూర్తీభవించిన ఓ ప్రతిరూపంగా సంఘ్ నిలుస్తోందని ఆయన తేల్చి చెప్పారు.అఫ్గనిస్థాన్ భూకంపం మృతులకు ప్రధానమంత్రి సంతాపం
September 01st, 02:16 pm
ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం కారణంగా జరిగిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం తెలిపారు.From seafood to tourism and trade, India is building a new ecosystem along the coastal regions: PM Modi in Bhuj, Gujarat
May 26th, 05:00 pm
PM Modi launched multiple development projects in Bhuj, Gujarat. Emphasizing that Kutch has demonstrated the power of hope and relentless effort in achieving remarkable success, the PM recalled the devastating earthquake that once led many to doubt the region’s future. He cited Dhola Vira and Lothal as prime examples of India's rich heritage. He also highlighted the UNESCO recognised Smriti Van memorial.గుజరాత్‌లోని భుజ్‌లో రూ. 53,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 26th, 04:45 pm
పవిత్ర భూమి కచ్ లో ఆశాపుర మాత దివ్య ఉనికిని గుర్తు చేస్తూ, శ్రీ మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. ఈ ప్రాంతంపై ఆమె నిరంతర ఆశీస్సులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడి ప్రజలకు కూడా తన గౌరవాన్ని తెలియజేశారు.ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
April 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు నేను మీతో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నా మనసులో మాట చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడినా.. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతున్నట్లు అనిపిస్తుంది. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తీవ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని తెలియజేస్తోంది. కాశ్మీర్‌లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు , కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో మనకున్న అతిపెద్ద బలాలు. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఆధారం. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలును ఎదుర్కొనేందుకు మనం మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఉగ్రవాద దాడి తర్వాత యావద్దేశం ఒక్క గొంతుతో మాట్లాడుతోంది.6వ బిమ్స్ టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 04th, 12:59 pm
ఈ సదస్సు కోసం ఘనమైన ఏర్పాట్లు చేసిన థాయిలాండ్ ప్రభుత్వానికి, గౌరవనీయ షినవత్ర గారికి నా కృతజ్ఞతలు.థాయ్‌లాండ్‌లో జరిగిన బిమ్స్‌టెక్ ఆరో సదస్సులో పాల్గొన్న ప్రధాని
April 04th, 12:54 pm
థాయ్‌లాండ్‌లో నిర్వహించిన బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) ఆరో సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రస్తుతం థాయ్‌లాండ్ అధ్యక్షత వహిస్తోంది. ‘‘బిమ్స్‌టెక్: సంక్షేమం, స్థిరత్వం, బహిరంగం’’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. బిమ్స్‌టెక్ ప్రాంత నాయకుల ప్రాధాన్యాలు, ప్రజల ఆకాంక్షలను ఇది ప్రతిపలిస్తుంది. అలాగే అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో ఉమ్మడి వృద్ధి సాధిండచంలో బిమ్స్‌టెక్ ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.బిమ్స్‌టెక్ దేశాల మధ్య సహకారానికి వివిధ అంశాలతో 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక.. ప్రధానమంత్రి ప్రతిపాదన
April 04th, 12:53 pm
బిమ్స్‌టెక్ ఆరో శిఖరాగ్ర సదస్సును థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్బంగా బిమ్స్‌టెక్ సభ్యదేశాల మధ్య సహకారానికి సంబంధించిన వేర్వేరు అంశాలతో కూడిన 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. బిమ్స్‌టెక్ దేశాల వాణిజ్య స్థాయిని పెంచాలని, సమాచార సాంకేతిక విజ్ఞాన (ఐటీ) రంగానికున్న వాస్తవ శక్తిసామర్థ్యాలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. థాయిలాండ్, మయన్మార్‌లలో ఇటీవల భూకంపం వచ్చిన నేపథ్యంలో విపత్తు నిర్వహణ రంగంలో అంతా కలసి పని చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అంతరిక్ష రంగంలో మరింత కృషి చేయాలని, భద్రత వ్యవస్థను బలపరచుకోవాలని శ్రీ మోదీ స్పష్టం చేశారు. బిమ్స్‌టెక్‌కు ఉమ్మడి శక్తిని సమకూర్చడంతోపాటు ముందుండి నాయకత్వాన్ని వహించాల్సిందిగా యువజనులను ఆయన కోరారు. సాంస్కృతిక సంబంధాలు బిమ్స్‌టెక్ సభ్యదేశాలను మరింత సన్నిహితం చేయగలవన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.భూకంప విషాదం నేపథ్యంలో మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి
March 29th, 01:41 pm
భూకంప విషాదం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్‌కు అండగా నిలవడంలో సన్నిహిత మిత్రదేశంగా, పొరుగుదేశంగా భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ విపత్తుకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించినట్లు తెలిపిన ప్రధానమంత్రి.. బాధిత ప్రాంతాలకు తక్షణ ఉపశమనాన్ని, అవసరమైన సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.మయన్మార్, థాయిలాండ్‌లలో భూకంపం ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
March 28th, 02:18 pm
మయన్మార్, థాయిలాండ్‌లలో ఈ రోజు ఉదయం పెను భూకంపం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీలో భూప్రకంపనల నేపథ్యంలో ప్రశాంతంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ప్రధాని సూచన
February 17th, 08:08 am
‘ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు’’ అని ప్రధానమంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
December 07th, 05:52 pm
పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 07th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.ప్రభుత్వాధినేతగా 23 వసంతాలు పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు
October 07th, 09:06 pm
ప్రభుత్వాధినేతగా 23 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ పౌరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలాన్ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. తన హయాంలో ఆ రాష్ట్రం సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సుకు భరోసా ఇస్తూ ‘సబ్కా సాథ్-సబ్కా వికాస్’ నినాదానికి ఉజ్వల నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. అలాగే గడచిన దశాబ్దంలో భారత పురోగమన వేగం ప్రపంచమంతా మనవైపు అత్యంత ఆశాభావంతో దృష్టి సారించేలా చేసిందని వ్యాఖ్యానించారు. దేశంలోని 140 కోట్లమంది పౌరుల సమష్టి స్వప్నమైన ‘వికసిత భారత్’ సాకారమయ్యేదాకా అవిశ్రాంతంగా కృషి చేస్తానని ఆయన ప్రతినబూనారు.పోలాండ్ లోని వార్సా లో భారతీయ సమాజం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 21st, 11:45 pm
ఇక్కడి దృశ్యం నిజంగా అద్భుతం... మీ ఉత్సాహం కూడా అమోఘం. నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, మీరు అలసిపోలేదు. మీరందరూ పోలాండ్‌లోని వివిధ భాషలు, మాండలికాలు, వివిధ ఆహారపు అలవాట్లున్న ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ భారతీయతే మిమ్మల్ని ఒకటిగా కలిపింది. మీరు ఇక్కడ నాకు స్వాగతం పలికారు... మీరు చూపిన ఈ ఆదరణకు మీ అందరికీ, ముఖ్యంగా పోలాండ్ ప్రజలకు చాలా కృతజ్ఞతలు.వార్సాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 21st, 11:30 pm
ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు ఆత్మీయతతో, ఉత్సాహంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి పోలండ్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్-పోలండ్ సంబంధాలను బలోపేతం చేసేందుకు పోలండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా, ప్రధానమంత్రి డోనాల్డ్ టస్క్ తో సమావేశానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లివంటిదని, పోలండ్‌తో భారతదేశపు విలువలను పంచుకోవడం వల్ల రెండు దేశాలు చేరువయ్యాయని అన్నారు.