ఆగస్టు 25, 26 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

August 24th, 01:08 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 25, 26 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 25న సాయంత్రం 6 గంటలకు అహ్మదాబాద్‌లోని ఖోడల్‌ధామ్ మైదానంలో రూ. 5,400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకింతం చేయటంతో పాటు కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నాను. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన మాట్లాడనున్నారు.