పరాక్రమ దివస్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళి అర్పించిన ప్రధాని
January 23rd, 08:30 am
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన పరాక్రమ్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. నేతాజీ అచంచలమైన ధైర్యాన్నీ, దృఢ సంకల్పాన్నీ, దేశం కోసం ఆయన అసమానమైన సేవలనూ ప్రధానమంత్రి స్మరించుకున్నారు. నేతాజీ వెన్నుచూపని నాయకత్వ పటిమ, దేశభక్తి.. బలమైన భారత నిర్మాణం దిశగా తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని వ్యాఖ్యానించారు.