ప్రధానమంత్రి భూటాన్ అధికారిక పర్యటనపై సంయుక్త పత్రికా ప్రకటన

November 12th, 10:00 am

పర్యటనలో భాగంగా నవంబర్ 11న చాంగ్లిమిథాంగ్‌లో భూటాన్ నాలుగో రాజు 70వ జన్మదిన వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. అలాగే థింపులో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి ప్రార్థన ఉత్సవంలో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలు పూజలర్పించడానికి భారత్ నుంచి బుద్ధ భగవానుని పవిత్ర పిప్రాహ్వా అవశేషాలను ఈ ఉత్సవంలో ఉంచడాన్ని భూటాన్ రాజు అభినందించారు.

భూటాన్ రాజుతో ప్రధానమంత్రి సమావేశం

November 11th, 06:14 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు థింఫు నగరంలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్‌ వాంగ్‌చుక్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌-భూటాన్‌ ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడంతోపాటు పటిష్ఠం చేయడంపై వారిద్దరూ అభిప్రాయాలను పంచుకున్నారు. రెండు దేశాల ప్రయోజనాలతో ముడిపడిన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపైనా వారు చర్చించారు. ఢిల్లీ దుర్ఘటనలో ప్రాణనష్టంపై మాననీయ భూటాన్‌ రాజు సంతాపం ప్రకటించారు.

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భం లో టెలిఫోన్ ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

January 01st, 05:38 pm

కొత్త సంవ‌త్స‌రం ఆరంభ దినం కావ‌డం తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌లువురు ప్ర‌ముఖుల తో టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు. వారి లో కింగ్ డ‌మ్ ఆఫ్ భూటాన్ యొక్క రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్‌ గ్యాల్ వాంగ్చుక్, భూటాన్ ప్రధాని డాక్టర్ లాయెన్‌చెన్‌ (డాక్టర్) లోటే శెరింగ్‌, శ్రీ‌ లంక అధ్య‌క్షుడు శ్రీ గోటాబాయా రాజ‌ప‌క్ష, శ్రీ లంక ప్ర‌ధాని శ్రీ మ‌హీంద రాజ‌ప‌క్ష, మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా మరియు నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ లు ఉన్నారు.