అనువాదం: గుజరాత్‌లో జరిగిన 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'లో ప్రధానమంత్రి ప్రసంగం
January 11th, 12:00 pm
ప్రజాదరణ కలిగిన గౌరవ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, ఉత్సాహవంతుడైన యువ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి గారు.. గుజరాత్ ప్రభుత్వ మంత్రులు జితుభాయ్ వాఘాని, అర్జున్‌భాయ్ మోద్వాడియా, డాక్టర్ ప్రద్యుమ్న వాజా, కౌశిక్ భాయ్ వేకారియా.. పార్లమెంటు సభ్యుడు రాజేష్‌భాయ్, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా.. ఈ రోజు దేశ నలుమూలలకు చెందిన లక్షలాది మంది ప్రజలు మనతో అనుసంధానమై ఉన్నారు.. వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘సోమనాథుడికి విజయం కలుగుగాక’!!గుజరాత్‌లోని సోమనాథ్‌లో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 11th, 11:41 am
గుజరాత్‌లోని సోమనాథ్‌లో ఈ రోజు నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమయం అసాధారణమైనది... ఈ వాతావరణం అసాధారణమైనది... ఈ వేడుక అసాధారణమైనది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒక వైపు స్వయంగా మహాదేవుడు... మరోవైపు సూర్యకిరణాలు, మంత్రాల ప్రతిధ్వని, ఉప్పొంగుతున్న భక్తితో కూడిన సముద్రపు అలలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో సోమనాథ్... భక్తులందరి ఉనికితో ఈ సందర్భాన్ని మరింత దివ్యమైనదిగా, గొప్పగా మారుస్తోందని ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా తనకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో చురుగ్గా సేవ చేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 72 గంటల పాటు నిరంతరాయంగా ఓంకారం జపించడం... 72 గంటల పాటు మంత్ర పఠనం చేయడం అద్భుతమని ఆయన పేర్కొన్నారు. నిన్న సాయంత్రం వెయ్యి డ్రోన్లతో... వేద గురుకులాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు నిర్వహించిన అద్భుత ప్రదర్శన సోమనాథుని వెయ్యి సంవత్సరాల గాథను ఎంతో చక్కగా వివరించిందన్నారు. 108 అశ్వాలతో సాగిన 'శౌర్య యాత్ర' ఈ రోజు ఆలయానికి చేరుకుందని ఆయన తెలిపారు. మంత్రాలు, భజనలతో భక్తులందరినీ మంత్రముగ్ధులను చేసిన ఈ ప్రదర్శన మాటలకు అతీతమని... కాలం మాత్రమే ఈ అనుభవాన్ని సంగ్రహించగలదని ఆయన వివరించారు. ఈ వేడుక దర్పం, గౌరవం, హుందాతనం, జ్ఞానం, గొప్పతనం, వారసత్వం, ఆధ్యాత్మికత, సాక్షాత్కారం, అనుభవం, ఆనందం, సాన్నిహిత్యాల కలయికగా ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అన్నింటికీ మించి ఇది భగవాన్ మహాదేవుని ఆశీర్వాదాలను కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు.జనవరి 10, 11 తేదీల్లో గుజరాత్‌లోని సోమనాథ్‌లో నిర్వహించే సోమనాథ స్వాభిమాన పర్వంలో పాల్గొననున్న ప్రధాని
January 09th, 12:10 pm
జనవరి 10, 11 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సోమనాథ్‌లో పర్యటిస్తారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో పాల్గొంటారు. జనవరి 10న రాత్రి 8 గంటలకు సోమనాథ ఆలయంలో నిర్వహించే ఓంకార మంత్రోచ్ఛారణలో పాల్గొంటారు. అలాగే డ్రోన్ ప్రదర్శనను వీక్షిస్తారు.డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
December 03rd, 09:11 am
డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో క్రీయాశీల భాగస్వామిగా ఉండటం నుంచి, రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షత వహించటం, మన దేశానికి మొదటి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించే వరకు అపారమైన గౌరవం, అంకితభావం, స్పష్టమైన లక్ష్యంతో ఆయన సేవలందించారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నిరాడంబరత, ధైర్యం, జాతీయ సమైక్యత పట్ల భక్తిభావంతో ప్రజా జీవితంలో ఆయన సుదీర్ఘంగా కొనసాగారు. ఆయన అందించిన ఆదర్శప్రాయమైన సేవలు, దార్శనికత తరతరాలకు స్ఫూర్తినిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.బిహార్‌లోని గయా జీలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 22nd, 12:00 pm
గౌరవనీయమైన బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు, జనాదరణ గల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు జీతన్ రామ్ మాంఝీ గారు, రాజీవ్ రంజన్ సింగ్ గారు, చిరాగ్ పాస్వాన్ గారు, రామ్ నాథ్ ఠాకూర్ గారు, నిత్యానందరాయ్ గారు, సతీష్ చంద్ర దుబే గారు, రాజ్ భూషణ్ చౌదరి గారు, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి గారు, విజయ్ కుమార్ సిన్హా గారు, బిహార్ ప్రభుత్వ మంత్రులు, నా తోటి పార్లమెంటేరియన్ ఉపేంద్ర కుష్వాహా గారు, ఇతర ఎంపీలు, నా ప్రియమైన బిహార్ సోదర సోదరీమణులారా!బిహార్లోని గయలో రూ. 12, 000 కోట్ల విలువైన వివిధ బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 22nd, 11:20 am
బిహార్‌లోని గయలో రూ.12,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. జ్ఞానం, విముక్తికి పవిత్ర నగరమైన గయకు ప్రధానమంత్రి వందనాలు అర్పించారు. విశిష్టమైన విష్ణుపాద ఆలయం ఉన్న ఈ పుణ్యభూమి నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గయ ప్రాంతం ఆధ్యాత్మికత, శాంతికి నిలయం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ పవిత్ర నేలలోనే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందారని గుర్తుచేశారు.. ‘గయా జీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం ప్రాచీనమైనది మాత్రమే కాక అత్యంత గొప్పది’ అని మోదీ పేర్కొన్నారు. ఈ నగరాన్ని కేవలం ’గయ‘ అని కాకుండా గౌరవంగా ‘గయా జీ’ అని పిలవాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల భావనను గౌరవించినందుకు బిహార్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు. గయా జీ వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్రం, బిహార్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
April 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు నేను మీతో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నా మనసులో మాట చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడినా.. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతున్నట్లు అనిపిస్తుంది. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తీవ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని తెలియజేస్తోంది. కాశ్మీర్‌లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు , కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో మనకున్న అతిపెద్ద బలాలు. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఆధారం. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలును ఎదుర్కొనేందుకు మనం మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఉగ్రవాద దాడి తర్వాత యావద్దేశం ఒక్క గొంతుతో మాట్లాడుతోంది.ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు మన ఓటింగ్ ప్రక్రియను బలోపేతం చేసింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 19th, 11:30 am
In the 118th episode of Mann Ki Baat, PM Modi reflected on key milestones, including the upcoming 75th Republic Day celebrations and the significance of India’s Constitution in shaping the nation’s democracy. He highlighted India’s achievements and advancements in space sector like satellite docking. He spoke about the Maha Kumbh in Prayagraj and paid tributes to Netaji Subhas Chandra Bose.Our Constitution is the foundation of India’s unity: PM Modi in Lok Sabha
December 14th, 05:50 pm
PM Modi addressed the Lok Sabha on the 75th anniversary of the Indian Constitution's adoption. He reflected on India's democratic journey and paid tribute to the framers of the Constitution.రాజ్యాంగ ఆమోదం 75వ వార్షికోత్సవం: లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 14th, 05:47 pm
రాజ్యంగాన్ని ఆమోదించుకొని 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా లోక్‌సభలో చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. మనం ఈ ప్రజాస్వామ్య పండుగను నిర్వహించుకోవడం భారత పౌరులకే కాక పూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గర్వకారణమూ, గౌరవభరితమంటూ వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగ 75వ వార్షికోత్సవ అసాధారణ, మహత్తర యాత్ర సందర్భంగా ఆయన రాజ్యాంగ నిర్మాతలు కనబర్చిన ముందుచూపునకు, వారి దార్శనికతకు, వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతూ 75 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ప్రజాస్వామ్య ఉత్సవాన్ని జరుపుకోవలసిన తరుణమన్నారు. ఈ ఉత్సవంలో పార్లమెంటు సభ్యులు కూడా పాలుపంచుకొంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని శ్రీ మోదీ చెబుతూ, దీనికిగాను వారికి ధన్యవాదాలనూ, అభినందనలనూ తెలిపారు.దేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు
December 03rd, 08:59 am
భారతదేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జీ జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక బలమైన పునాదిని వేయడంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందించిన అమూల్య తోడ్పాటును ప్రధాని ప్రశంసించారు.Our Constitution is the guide to our present and our future: PM Modi on Samvidhan Divas
November 26th, 08:15 pm
PM Modi participated in the Constitution Day programme at the Supreme Court. “Our Constitution is a guide to our present and our future”, exclaimed Shri Modi and added that the Constitution had shown the right path to tackle the various challenges that have cropped up in the last 75 years of its existence. He further noted that the Constitution even encountered the dangerous times of Emergency faced by Indian Democracy.సుప్రీం కోర్టులో రాజ్యంగ దినోత్సవ కార్యక్రమం; పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 26th, 08:10 pm
న్యూఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవానికి సంబంధిత కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి శ్రీ సంజీవ్ ఖన్నా, సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ బీ.ఆర్. గవయి, జస్టిస్ శ్రీ సూర్యకాంత్, చట్ట, న్యాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘ్‌వాల్, అటార్నీ జనరల్ లు సహా ఇతర ఉన్నతాధికారులు పాలుపంచుకొన్నారు.డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
December 03rd, 10:01 am
భారతదేశాని కి ఒకటో రాష్ట్రపతి అయిన డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.డాక్టర్రాజేంద్ర ప్రసాద్ జయంతి నాడు ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి
December 03rd, 09:25 am
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ
August 13th, 11:31 am
మీ అందరితో ప్రత్యక్షం గా మాట్లాడడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది కానీ అందరితో మాట్లాడడం సాధ్యం కాదు. కానీ మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. లేదా ఏదైనా సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నా ఇంటికి కుటుంబ సభ్యుడిలా రావడానికి సమయం కేటాయించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు సాధించిన విజయాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ విషయంలో మీతో సహకరించగలిగినందుకు నేను కూడా గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం.కామన్‌వెల్త్ గేమ్స్-2022 భారత బృందానికి ప్రధానమంత్రి సత్కారం
August 13th, 11:30 am
కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)-2022లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో సత్కరించారు. వివిధ క్రీడల్లో పోటీపడిన క్రీడాకారులు, వారి శిక్షకులతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలు, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన ఈ క్రీడలలో భారతదేశానికి వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు లభించాయి. ఈ మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను ప్రధానమంత్రి అభినందించారు. సీడబ్ల్యూజీ-2022లో క్రీడాకారుల, శిక్షకుల ప్రతిభా ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సాధించిన విజయాలు తమకు గర్వకారణమని అభివర్ణించారు. క్రీడాకారుల అద్భుత కృషి వల్ల దక్కిన అద్భుత విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రవేశించడం గర్వించదగిన అంశమని ప్రధాని పేర్కొన్నారు.పాట్నాలోని బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 12th, 06:44 pm
ఈ చారిత్రాత్మక సందర్భానికి హాజరైన బీహార్ గవర్నర్ శ్రీ ఫాగు చౌహాన్ జీ, బీహార్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ జీ, విధానసభ స్పీకర్ శ్రీ విజయ్ సిన్హా జీ, బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అవధేష్ నారాయణ్ సింగ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీమతి. రేణు దేవి జీ, తార్కిషోర్ ప్రసాద్ జీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ తేజస్వి యాదవ్ జీ, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులందరికీ!PM addresses the closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly
July 12th, 06:43 pm
PM Modi addressed closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly in Patna. Recalling the glorious history of the Bihar Assembly, the Prime Minister said big and bold decisions have been taken in the Vidhan Sabha building here one after the other.డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
December 03rd, 10:26 am
భారతదేశాని కి ఒకటో రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులను అర్పించారు.