అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

September 05th, 08:36 am

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మేధస్సును పెంపొందించడంలో ఉపాధ్యాయుల అంకితభావం బలమైన, ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాది అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త, ఉపాధ్యాయులు డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ జీవితాన్ని, ఆలోచనలను ఆయన జయంతి సందర్భంగా మనం స్మరించుకుందాం అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధాని ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

September 05th, 08:07 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు.