భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
August 15th, 07:26 pm
మన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన ప్రధానమంత్రి
July 26th, 06:47 pm
మాల్దీవుల దేశంలో అధికారిక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు ముయిజు ఆతిథ్యం ఇచ్చిన ప్రభుత్వాధినేత లేదా దేశ నాయకుడు కూడా ప్రధాని మోదీనే కావటం విశేషం.భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల
July 25th, 09:08 pm
భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మాల్దీవులు అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజు స్మారక స్టాంపులను విడుదల చేశారు.మాల్దీవుల అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ
July 25th, 08:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మాలేలోని అధ్యక్షుడి కార్యాలయంలో మాల్దీవుల దేశాధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీకి రిపబ్లిక్ స్క్వేర్‌లో అధ్యక్షుడు ముయిజు ఘనంగా సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్యనున్న లోతైన స్నేహ బంధాన్ని, హృదయపూర్వక వాతావరణాన్ని ఈ సమావేశం ప్రతిబింబించింది.మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడితో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
July 25th, 08:43 pm
మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ అత్యాధునిక భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర ఈ రోజు ప్రారంభించారు.మాల్దీవ్స్ అధ్యక్షుడితో సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
July 25th, 06:00 pm
ఇది భారత్-మాల్దీవ్స్ దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవ ఏడాది కూడా కావడం విశేషం. వాస్తవానికి ఈ బంధానికిగల మూలాలు చరిత్రకన్నా ప్రాచీనమైనవేగాక, సముద్రమంతటి లోతైనవి కూడా. అనాదిగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ రోజు స్మారక స్టాంపును ఆవిష్కరించాం. దీనిపై కనిపించే రెండు దేశాల సంప్రదాయ పడవల చిత్రం చూస్తే- చరిత్రలో మనం ఇరుగుపొరుగు మాత్రమే కాదని, సహ ప్రయాణికులమని స్పష్టమవుతుంది.మాల్దీవుల మాలే చేరుకున్న ప్రధాని మోదీ
July 25th, 10:28 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం మాల్దీవులకు చేరుకున్నారు. ఆయనను విమానాశ్రయంలో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు స్వయంగా స్వాగతించారు. ప్రధాని మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు.యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని ప్రకటన
July 23rd, 01:05 pm
భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతిని సాధించింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, రక్షణ, విద్య, పరిశోధన, సుస్థిరత, ఆరోగ్యం, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో మన సహకారం విస్తరించింది. గౌరవ ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో జరిపే సమావేశంలో రెండు దేశాల్లోనూ సంక్షేమాన్ని, వృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశం లభిస్తుంది. ఈ పర్యటనలో గౌరవ కింగ్ ఛార్లెస్ IIIతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నా.యునైటెడ్ కింగ్‌డమ్ మరియు మాల్దీవులకు ప్రధానమంత్రి పర్యటన (జూలై 23 - 26, 2025)
July 20th, 10:49 pm
ప్రధాని మోదీ జూలై 23 - 26 వరకు యుకే కి అధికారిక పర్యటన మరియు మాల్దీవులకు రాష్ట్ర పర్యటన చేస్తారు. ఆయన పిఎం స్టార్మర్‌తో విస్తృత చర్చలు జరుపుతారు మరియు వారు సీఎస్పి పురోగతిని కూడా సమీక్షిస్తారు. జూలై 26న జరిగే మాల్దీవుల స్వాతంత్ర్య 60వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ 'గౌరవ అతిథి'గా ఉంటారు. ఆయన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజును కలుస్తారు మరియు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చలు జరుపుతారు.భారత్ 76వ గణతంత్ర దినోత్సవం.. ప్రపంచ నేతల శుభాకాంక్షలు.. ప్రధానమంత్రి ధన్యవాదాలు
January 26th, 05:56 pm
భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు వ్యక్తం చేశారు.అక్టోబర్ 6-10 మధ్య భారత్ లో మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జు జరిపిన అధికారిక పర్యటన అనంతర ముఖ్య పరిణామాలు
October 07th, 03:40 pm
భారత్-మాల్దీవుల ఒప్పందం: సమగ్ర ఆర్థిక, నౌకావాణిజ్య భద్రత దిశగా భాగస్వామ్యం కోసం వ్యూహరచనభారత్, మాల్దీవులు: సమగ్ర ఆర్థిక, నౌకా వాణిజ్య భద్రతా భాగస్వామ్యమే లక్ష్యం
October 07th, 02:39 pm
1. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మాల్దీవుల అధ్యక్షుడు డా. మహ్మద్ ముయిజ్జు ఈరోజు (అక్టోబర్ 7, 2024) సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, రెండు దేశాల ప్రజల మధ్య చారిత్రక సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సాధించిన ప్రగతిని సమగ్రంగా సమీక్షించారు.మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గౌరవనీయ మొహమ్మద్ ముయిజ్జుతో సంయుక్త పత్రికా ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 07th, 12:25 pm
భారత్-మాల్దీవ్స్ సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ముఖ్యంగా ఈ రెండూ అత్యంత సన్నిహిత, ఇరుగుపొరుగు మిత్ర దేశాలు. అలాగే మేము అనుసరిస్తున్న పొరుగుకు ప్రాధాన్యం విధానంతో పాటు మా దార్శనిక సాగర్ కార్యక్రమంలో మాల్దీవ్స్‌కు కీలక స్థానముంది. మాల్దీవ్స్ విషయంలో ఎల్లప్పుడూ మొట్టమొదట స్పందించి, తనవంతు బాధ్యత నిర్వర్తించేది భారతదేశమే. నిత్యావసరాల కొరత తీర్చడంలోనైనా, ప్రకృతి విపత్తుల సమయంలో తాగునీటి సరఫరాలోనైనా, కోవిడ్ సంక్షోభం వేళ టీకాలు అందించడంలోనైనా పొరుగు దేశం విషయంలో భారత్ సదా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంది. ఇక ఇవాళ పరస్పర సహకారానికి వ్యూహాత్మక దిశను నిర్దేశించడం కోసం ‘‘సమగ్ర ఆర్థిక-సముద్ర భద్రత భాగస్వామ్యం’’ విధానాన్ని ఆమోదించాం.డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు
August 15th, 09:20 pm
భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రపంచ నేతలు వారి శుభాకాంక్షలు వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి యొక్క పదవీ స్వీకారప్రమాణ కార్యక్రమం లో పాలుపంచుకొన్న భారతదేశ ఇరుగు పొరుగు దేశాల నేతలు మరియు హిందూమహాసముద్ర ప్రాంత దేశాల నేతలు
June 09th, 11:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పాటు, మంత్రి మండలి యొక్క పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమం 2024 జూన్ 9 వ తేదీ నాడు రాష్ట్రపతి భవన్ లో చోటు చేసుకొంది. ఈ కార్యక్రమం లో గౌరవ అతిథులు గా భారతదేశం చుట్టుప్రక్కల దేశాల కు చెందిన నేతలు మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల కు చెందిన నేతలు పాలుపంచుకొన్నారు.ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం నేత ల యాత్ర
June 08th, 12:24 pm
సాధారణ ఎన్నికలు- 2024 పూర్తి అయిన దరిమిలా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మంత్రిమండలి యొక్క పదవీప్రమాణ స్వీకారం కార్యక్రమం 2024 జూన్ 9వ తేదీ న జరుగనున్నది. ఈ సందర్భం లో, విశిష్ట అతిథులు గా హాజరు కావలసిందంటూ భారతదేశాని కి ఇరుగు పొరుగున ఉన్న దేశాల నేతల ను మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల నేతల ను హృదయపూర్వకం గా ఆహ్వానించడమైంది.మాల్దీవుల అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
December 01st, 09:35 pm
యూఏఈ లో డిసెంబర్ 1న జరిగిన కాప్-28 సమ్మిట్ సందర్భంగా మాల్దీవుల రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.డాక్టర్ శ్రీమొహమ్మద్ ముయిజ్జు మాల్ దీవ్స్ కు అధ్యక్షుని గా ఎన్నికైన సందర్భం లో అభినందనలనుతెలియజేసిన ప్రధాన మంత్రి
October 01st, 09:34 am
డాక్టర్ శ్రీ మొహమ్మద్ ముయిజ్జు మాల్ దీవ్స్ కు అధ్యక్షుని గా ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.