అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని
July 04th, 09:40 pm
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ఆ దేశ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్-అమెరికా భాగస్వామ్యానికి ఉన్న శాశ్వతమైన బలాన్ని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ఇరు దేశ ప్రజల అపరిమిత సామర్థ్యాలపై గల నమ్మకం అనే ఉమ్మడి విలువల పునాదిపై ఈ బంధం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.ఎవియాన్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షునితో సమావేశమైన ప్రధానమంత్రి
June 18th, 05:04 am
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో 2026 జూన్ 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధానమంత్రి
June 10th, 11:50 pm
హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్‌కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి
May 23rd, 04:20 pm
అమెరికా విదేశాంగ మంత్రి గౌరవ మార్కో రూబియో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.ప్రధానమంత్రికి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
April 14th, 10:12 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.పశ్చిమాసియా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడి నుంచి ప్రధానమంత్రికి ఫోన్ కాల్
March 24th, 08:48 pm
అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె ట్రంప్ నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ కాల్ వచ్చింది.అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి
February 02nd, 11:15 pm
అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. భారత ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్‌నకు 1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి
December 11th, 08:50 pm
అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మాట్లాడారు.దీపావళి శుభాకాంక్షలు చెప్పిన యూఎస్ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు
October 22nd, 08:25 am
దీపావళికి స్వయంగా ఫోన్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలను చెప్పినందుకు అమెరికా అధ్యక్షుడు గౌరవ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మనసారా కృతజ్ఞతలు తెలియజేశారు.బందీల విడుదలను స్వాగతించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 13th, 07:59 pm
రెండు సంవత్సరాలకు పైగా బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. బందీల కుటుంబాల ధైర్యానికీ, శాంతి కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.గాజా శాంతి ప్రణాళిక విజయవంతం పట్ల అధ్యక్షుడు ట్రంప్‌ను అభినందించిన ప్రధానమంత్రి
October 09th, 09:31 pm
చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ఆయనకు అభినందనలు తెలిపారు.అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికలో ఒకటో దశ ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి
October 09th, 09:55 am
అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికలో ఒకటో దశపై ఒప్పందం కుదిరినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.గాజాలో శాంతి స్థాపన దిశగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి
October 04th, 07:58 am
గాజాలో శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. బందీల విడుదలకు వస్తున్న సంకేతాలు.. మానవతావాద, దౌత్యపరమైన ప్రయత్నాల్లో కీలక ముందడుగని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.గాజా సంఘర్షణకు స్వస్తి పలికే దిశగా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ చేపట్టిన శాంతి సాధన యత్నాలను స్వాగతించిన ప్రధానమంత్రి
September 30th, 09:19 am
గాజా సంఘర్షణను సమాప్తం చేయడానికి అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జే ట్రంప్ నడుం కట్టి ఒక సమగ్ర ప్రణాళికను ప్రకటించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
September 16th, 11:30 pm
తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారత్ - అమెరికా సమగ్ర, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు మీలాగే నేను కూడా పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం దిశగా మీరు తీసుకునే చర్యలకు సహకరిస్తాం’’ అని శ్రీ మోదీ అన్నారు.President Trump conveys warm birthday greetings to PM Modi
September 16th, 10:13 pm
US President Donald Trump called PM Modi on his 75th birthday, extending warm greetings and friendship. Both leaders reaffirmed their commitment to strengthen the India-US Comprehensive Global Strategic Partnership and shared views on key regional and global issues. PM Modi also voiced India’s support for Trump’s efforts toward a peaceful resolution in Ukraine.భారత్ - అమెరికా మధ్య బలమైన సంబంధాలున్నాయని స్పష్టం చేసిన ప్రధాని
September 10th, 07:52 am
భారత్ - అమెరికా మధ్య బలమైన సత్సంబంధాలున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల ప్రజలకు ఉజ్వలమైన, మరింత సుసంపన్నమైన భవిష్యత్తును అందించడం లక్ష్యంగా ఇరుదేశాలూ కలిసి పనిచేస్తాయని శ్రీ మోదీ అన్నారు.ట్రంప్ భావాలు.. సానుకూల దృక్పథం అభినందనీయం: ప్రధానమంత్రి
September 06th, 10:27 am
భారత్-అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలు, సానుకూల దృక్పథం అభినందనీయమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్-అమెరికా మంచి భవిష్యత్తును.. సమగ్రమైన, ప్రాపంచిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడి మధ్య టెలిఫోన్ సంభాషణపై విదేశాంగ కార్యదర్శి ప్రకటన
June 18th, 12:32 pm
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కావాల్సి ఉంది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ ముందుగానే అమెరికాకు తిరిగిరావాల్సి వచ్చింది. దీంతో సమావేశం జరగలేదు.జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది
April 24th, 03:29 pm
2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలు బలిగొంది, ప్రపంచ నాయకుల నుండి బలమైన సంఘీభావం లభించింది. ప్రపంచ మద్దతుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు, భారతదేశం ఉగ్రవాదులను మరియు వారి మద్దతుదారులను భూమి చివరల వరకు వెంబడిస్తుంది అని ప్రతిజ్ఞ చేశారు.